World Press Freedom Index 2024: ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో 159వ స్థానంలో ఉన్న భారత్..

రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (RSF) ప్రచురించిన 2024 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచికలో భారతదేశం 180 దేశాలలో 159వ స్థానానికి చేరుకుంది.

ఇది 2021 ర్యాంకింగ్ కంటే ఒక స్థానం మెరుగుపడింది. అయితే ఇంకా చాలా మెరుగుపడవలసిన అవసరం ఉంది.

ఈ నివేదికలో ముఖ్య అంశాలు ఇవే..
➢ పాకిస్థాన్ (152వ స్థానం), శ్రీలంక (150వ స్థానం) కంటే భారతదేశం దిగువన ఉంది.
➢ నార్వే అగ్రస్థానంలో ఉండగా, డెన్మార్క్, స్వీడన్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
➢ ఆసియా-పసిఫిక్ ప్రాంతం జర్నలిజంకు రెండవ అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా పరిగణించబడుతుంది. ఇందులో మయన్మార్, చైనా, ఉత్తర కొరియా, వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు ఉన్నాయి.
➢ 2024 సూచికలో టాప్ 15లో ఒక్క ఆసియా దేశం కూడా లేదు.

World Press Freedom Day 2024: మే 3వ తేదీ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..

➢ దక్షిణాసియాలో పత్రికా స్వేచ్ఛకు ముప్పు పెరుగుతోంది.
➢ మధ్యప్రాచ్యం మరియు ఉత్తర ఆఫ్రికాలో సగం దేశాలు "చాలా తీవ్రమైన" పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.
➢ యూరోపియన్ యూనియన్‌లో పత్రికా స్వేచ్ఛ "మంచిది"గా పరిగణించబడుతుంది. అయితే హంగేరి, మాల్టా, గ్రీస్ వంటి దేశాలు క్షీణతను ఎదుర్కొంటున్నాయి.
➢ యూరోపియన్ మీడియా ఫ్రీడమ్ యాక్ట్ (EMFA) ఈయూ(EU)లో పత్రికా స్వేచ్ఛను రక్షించడానికి ప్రయత్నిస్తుంది.

UNESCO Awards: ప్రతిష్టాత్మక బహుమతికి ఎంపికైన జర్నలిస్టులు

#Tags