Soft Girl Trending In Social Media: ఉద్యోగం మానేయడమే అక్కడ ట్రెండ్.. ఎక్కడో తెలుసా?
ఇప్పుడు స్వీడన్‌లో ‘హేమాఫ్లిక్వాన్’లేదా ‘హేమాఫ్రూ’అంటే ‘సాఫ్ట్‌గాళ్’(ఇంట్లో ఉండే స్నేహితురాలు లేదా గృహిణి) హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. సాఫ్ట్‌గాళ్ అంటే ఉద్యోగాలను చేయడానికి బదులు గృహిణిగా ఇంటికే పరిమితమై కొత్త జీవితాన్ని స్వీకరించడం. ఈ మైక్రో ట్రెండ్ 2010వ దశకం చివరలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ప్రారంభమైంది. కానీ స్వీడన్‌లో ఇటీవల కాలంలో ఇది మరింత ట్రెండ్‌గా మారుతోంది.
స్వీడన్ యువతపై అతిపెద్ద వార్షిక సర్వే ఈ విషయాలను వెల్లడించింది..
15 నుంచి 24 ఏళ్ల వయస్సున్న యువతులు ఉద్యోగం వదిలేసి ‘సాఫ్ట్‌గాళ్’ట్రెండ్‌ను స్వీకరించడానికే ఆసక్తి చూపుతున్నారని తెలిపింది.
ఉద్యోగాలు చేస్తూ సాధికారతను, స్వావలంబనను కోరుకునే ‘గాళ్ బాస్’ఆదర్శాన్ని ఇకపై త్యాగంచేయాలని చాలా మంది మహిళలు భావిస్తున్నారని అధ్యయనం వెల్లడించింది.
SSC CGL Tier 1 Results Released: ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ టైర్-1 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
పెదవి విరిచిన అభ్యదయ వాదులు
స్వీడన్‌లో ప్రధాన చర్చనీయాంశంగా మారిన ఈ ట్రెండ్‌పై స్వీడన్ మమిళా హక్కుల కార్యకర్త మాట్లాడారు. మహిళలు తమ భాగస్వాముల సంపాదనపై ఆధారపడటం అంటే లింగసమానత్వంలో వెనుకడుగు వేయడమే. ఇంకా పురుషాధిక్య సమాజాన్ని వ్యతిరేకించే మహిళలకు ఈ ధోరణి తప్పుడు సందేశాన్ని ఇస్తుంది’’అని ఆమె అన్నారు. పని చేసే హక్కు, జీవన భృతి పొందే హక్కు, ఆర్థిక స్వాతంత్య్రం కోసం మహిళలు శతాబ్దాలుగా ఎంతటి పోరాటం చేశారో నేటి స్వీడన్ మహిళలకు తెలీదనుకుంటా అని ఆమె అసహనం వ్యక్తంచేశారు.
TSPSC Releases Polytechnic Lecturers Provisional Selection List : పాలిటెక్నిక్ లెక్చరర్ల ఎంపిక జాబితా విడుదల
ఒత్తిడే కారణమంటున్న నిపుణులు:
సైద్ధాంతిక చర్చలను పక్కన పెడితే యువతులు పనిని విడిచిపెట్టడానికి లేదా సాదాసీదా జీవనశైలిని కోరుకోవడానికి గల సామాజిక, సాంస్కృతిక కారణాలపై చర్చలు మొదలయ్యాయి. చాలా మంది ఉద్యోగులు సంవత్సరానికి ఆరు వారాల సెలవు పొందుతారు. 1% కంటే తక్కువ మంది వారానికి 50 గంటల కంటే ఎక్కువ పని చేస్తారు. దీంతో పనిచేసే మహిళల్లో ఒత్తిడిపాళ్లు చాలా ఎక్కువగా ఉంటున్నాయనితేలింది. ఇదే ‘సాఫ్ట్‌గాళ్’ట్రెండ్ వైపు వెళ్లడానికి కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ముఖ్యంగా జెన్ జెడ్ ఏజ్ గ్రూప్ (1997 నుంచి 2012 మధ్య జన్మించిన) యువతులు కెరీర్‌లో లక్ష్యాల కంటే విశ్రాంతి వైపు దృష్టి పెడుతున్నారన్న వాదనలు ఎక్కువయ్యాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)