IMLD 2022 Theme: అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

2000 ఏడాది నుంచి భాషలు, సంస్కృతుల వైవిధ్యాన్ని మ‌రియు బ‌హుళ భాషల వాడకాన్ని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం నిర్వహించుకుంటారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఆలోచనను ప్రతిపాదించింది బంగ్లాదేశ్. ఇది 1999లో యునెస్కో సర్వసభ్య సమావేశంలో ఆమోదం పొంది, 2000 నుంచి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. 

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (యుఎన్‌జీఏ) 2008ను అంతర్జాతీయ భాషల సంవత్సరంగా ప్రకటించింది. ప్రపంచ జనాభాలో 40 శాతం మంది వారు మాట్లాడే లేదా అర్థమ‌య్యే భాషలో చ‌ద‌వ‌లేరు. బహుభాషా విద్యలో, ముఖ్యంగా ప్రారంభ విద్యలో మాతృభాషలో చ‌దువు గురించి గురించి ప్రజ‌ల్లో అవ‌గాహ‌న పెరిగింది. దేశంలో మానవ వనరుల, అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ రోజును విద్యాసంస్థలు, భాషా సంస్థలతో క‌లిసి మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటుంది.


అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం-2022 థీమ్‌: “యూజింగ్ టెక్నాల‌జీ ఫ‌ర్ మ‌ల్టీలింగ్వల్ లెర్నింగ్: ఛాలెంజెస్ అండ్ అపార్చునిటీస్”(“Using technology for multilingual learning: Challenges and opportunities”)

క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    :
ప్రతి ఏటా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు    : ప్రపంచ దేశాలు..
ఎందుకు : భాషలు, సంస్కృతుల వైవిధ్యాన్ని మ‌రియు బ‌హుళ భాషల వాడకాన్ని ప్రోత్సహించడానికి..

చ‌ద‌వండి: ఆస్ట్రేలియాలో తుపానులను ఏ పేరుతో పిలుస్తారు?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags