Storm Eunice: యూకేను వణికిస్తున్న ‘యూనిస్’
గంటకు 90 మైళ్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో యూనిస్ తుపాను బ్రిటన్‌ను భయపెడుతోంది. వారం వ్యవధిలోనే దూసుకొచ్చిన ఈ రెండో తుపాను తీవ్రతపై యూకే ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. తీర ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ప్రయాణాలను మానుకుని ఇళ్లకే పరిమితం కావాలని ప్రజలను హెచ్చరించింది. యూనిస్ తుపాను ప్రభావంతో జర్మనీ, పోలండ్‌లలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఆస్ట్రేలియాలో తుపానులను ఏ పేరుతో పిలుస్తారు?
చక్రవాతాలు లేదా తుపానులను స్థానికంగా వివిధ పేర్లతో పిలుస్తారు. అవి..
కరేబియన్ సముద్రం – హరికేన్లు
దక్షిణ చైనా సముద్రం – టైఫూన్లు
ఆస్ట్రేలియా తీరం – విల్లీ విల్లీ
ఫిలిప్పైన్ సముద్రం – బాగీలు
జపాన్ సముద్రం – కైఫూలు
బంగ్లాదేశ్ తీరం – గురింద్‌లు
భారత తీరం – తుపానులు/చక్రవాతాలు
అణు విన్యాసాలు చేయనున్నట్లు ప్రకటించిన దేశం?
ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో.. తమ బలగాల సన్నద్ధతను, అణు, సంప్రదాయ ఆయుధాలను పరీక్షించుకునేందుకు ఫిబ్రవరి 19న భారీ సాయుధ కసరత్తుకు దిగుతున్నట్టు రష్యా సైన్యం పేర్కొంది. అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లగల ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్లు, క్రూయిజ్ మిసైళ్లతో పాటు పూర్తిస్థాయి సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ జరిగే ఈ విన్యాసాలను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారని రక్షణ శాఖ పేర్కొంది. యుద్ధమే జరిగితే వినాశనానికే దారితీస్తుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఫిబ్రవరి 18న హెచ్చరించారు.
చదవండి: జీ20 ఆర్థికమంత్రుల సమావేశం నేతృత్వం వహిస్తోన్న దేశం?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్