US Election Results: అమెరికా ఎన్నికల ఫలితాలు.. ఆ దేశ అధ్యక్షుడు ఎవ‌రంటే..

అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికయ్యారని యూఎస్ హౌస్‌ స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ వెల్లడించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్ గెలుపొందారు.  ట్రంప్.. కమలా హారిస్‌ను ఓడించి రెండో సారి అధ్యక్ష పీఠం ఎక్కి, అమెరికాకు 47వ అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ ఎన్నికల్లో మొత్తం 538 స్థానాలు ఉన్నాయి. 

డొనాల్ట్‌ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ శుభాకాంక్షలు తెలియజేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉత్కంఠ పోరు కొనసాగుతుంది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ మధ్య పోరు హోరాహోరీగానే సాగుతోంది. అయితే ఈ పోరులో ట్రంప్‌ గెలుపు దాదాపూ ఖరారైనట్లేనని తెలుస్తోంది. 

ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం..
డొనాల్డ్‌ ట్రంప్‌.. 267 ఎలక్టోరల్‌ ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన జార్జియా, కాన్సస్‌, అయోవా, మోంటానా, యుటా, నార్త్‌ డకోటా, వయోమింగ్‌, సౌత్‌ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్‌, ఆర్కాన్సాస్‌, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిస్సోరి, మిసిసిపి, ఒహాయో, వెస్ట్‌ వర్జీనియా, అలబామా, సౌత్‌ కరోలినా, ఫ్లోరిడా, ఐడహో రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకున్నారు.

కమలా హారిస్.. 214 ఎలక్టోరల్‌ సీట్లను కైవసం చేసుకున్నారు. కాలిఫోర్నియా, ఓరెగన్‌, వాషింగ్టన్‌, న్యూ మెక్సికో, వర్జీనియా, ఇల్లినోయీ, న్యూజెర్సీ, మేరీల్యాండ్‌, వెర్మాంట్‌, న్యూయార్క్‌, కనెక్టికట్‌, డెలవేర్‌, మసాచుసెట్స్‌, రోడ్‌ ఐల్యాండ్‌, కొలరాడో, హవాయి, న్యూహ్యాంప్‌షైర్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియాను సొంతం చేసుకున్నారు.

సుహాస్‌ సుబ్రమణ్యం​ సరికొత్త రికార్డు 
అమెరికా ఎన్నికల ఫలితాల్లో భారత సంతతికి చెందిన సుహాస్‌ సుబ్రమణ్యం ప్రతినిధుల సభకు గెలుపొందారు. వర్జీనియా 10వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి ఆయన డెమోక్రటిక్‌ పార్టీ తరఫున గెలుపొందారు. వర్టీజినియా నుంచి ప్రతినిధుల సభకు గెలిచిన తొలి ఇండియన్‌ అమెరికన్‌గా సుహాస్‌ సుబ్రమణ్యం సరికొత్త రికార్డు సృష్టించారు.  

#Tags