US and Japan: అమెరికా-జపాన్‌ సైనిక ఒప్పందం.. ఇక చైనాకు..

చైనా నుంచి పెరుగుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు, ఆ దేశానికి గట్టి గుణపాఠం చెప్పేందుకు జపాన్-అమెరికాలు ఒక సైనిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

ఈ రెండు దేశాలు సంయుక్తంగా చైనా చర్యలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపధ్యంలో తాజాగా జపాన్, అమెరికా రక్షణ అధిపతులు, అగ్ర దౌత్యవేత్తలు టోక్యోలో సమావేశమయ్యారు. యూఎస్‌ఏ సైనిక కమాండ్‌ను నవీకరించడం, జపాన్‌లో యూఎస్‌ఏ నుంచి లైసెన్స్ పొందిన క్షిపణుల ఉత్పత్తిని పెంచడం తదితర అంశాలపై చర్చించారు.
 
అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్, డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ జపాన్-అమెరికా సెక్యూరిటీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో జపాన్ ప్రతినిధులు యోకో కమికావా, మినోరు కిహారాతో భద్రతా చర్చలు జరిపారు. చైనా తన ఆధిపత్యాన్ని పెంచుకోవడంలో నిమగ్నమైందని, తూర్పు, దక్షిణ చైనా సముద్రంలో, తైవాన్ చుట్టూ యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నిస్తోందని ఆస్టిన్ ఆరోపించారు.

ఉత్తర కొరియా చేపట్టిన అణు కార్యక్రమం, రష్యా నుంచి ఆ దేశానికి అందుతున్న సహకారం మొదలైనవి ప్రాంతీయ, ప్రపంచ భద్రతకు ముప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. యుఎస్ఏ బలగాల పెంపుతో సహా కమాండ్ అండ్ కంట్రోల్ నిర్మాణాలను ఆధునీకరించే విషయమై త్వరలో చర్చించనున్నట్లు ఆస్టిన్ తెలిపారు.

US Elections 2024: అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ ఖరారు..ఆమె నేపథ్యమిదే

#Tags