HIV Medicine Test : హెచ్ఐవీకి సూది మందుకు ప‌రీక్ష విజ‌య‌వంతం..

హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్‌ నుంచి కాపాడే సూది మందు పరీక్షలు విజయవంతమయ్యాయి. దక్షిణాఫ్రికా, ఉగాండాలలో నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌ సత్ఫలితాలిచ్చాయి. లెనకపవిర్‌ ఇంజెక్షన్‌ను ఆరు నెలలకు ఒకసారి చొప్పున సంవత్సరానికి రెండుసార్లు ఇవ్వడం వల్ల యువతులను హెచ్‌ఐవీ నుంచి కాపాడవచ్చని స్పష్టమైంది.

Free Education: నిరుపేద దేశంలో ఉచిత విద్య.. ఈడ్చి కొడుతున్న ఈదురుగాలులు.. ఎక్కడంటే..

రోజువారీ మాత్రల రూపంలో ఉన్న ఇతర ఔషధాల కన్నా లెనకపవిర్‌ ఇంజెక్షన్‌ మెరుగైనదా? కాదా? అనే అంశాన్ని ఈ పరీక్షల్లో విశ్లేషించారు. ఈ మూడు ఔషధాలు ప్రీ –ఎక్స్‌పోజర్‌ ప్రొఫిలాక్సిస్‌ (పీఆర్‌ఈపీ) డ్రగ్స్‌ అని పరిశోధకులు తెలిపారు. ఈ ఇంజెక్షన్‌ను అందరికీ అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు గిలీడ్‌సైన్సెస్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

#Tags