Earthquakes: వరుస భూకంపాలు.. 24 గంటల్లో 80 సార్లు కంపించిన భూమి.. ఎక్కడంటే..
రిక్టర్ స్కేల్‌పై అత్యధిక తీవ్రత 6.3గా నమోదైంది. దీని కారణంగా రాజధాని తైపీలోని భవనాలు ఊగిసలాడాయి.
కాగా, ఏప్రిల్ 3న 7.2 తీవ్రతతో మరొక శక్తివంతమైన భూకంపం సంభవించింది, దీని కారణంగా 14 మంది మరణించారు, చాలా మంది గాయపడ్డారు. ఈ తాజా భూకంపాలు 20 రోజుల్లో ద్వీపరాజ్యంలో 1,000కి పైగా భూకంపాలకు కారణమయ్యాయి.
రెండు టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ సమీపంలో ఉండడంతో తైవాన్ భూకంపాలు తరచూ సంభవిస్తుంటాయి. 1993లో రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా.. 2,000 మంది మరణించారు. ఆ తర్వాత 2016లో ఆ దేశం దక్షిణ ప్రాంతంలో సంభవించిన భూకంపం ధాటికి 100 మంది మరణించారు. ప్రాణ నష్టం సంగతి పక్కనపెడితే ఏప్రిల్ 3వ తేదీన సంభవించిన భూకంపం తైవాన్‌లో పాతికేళ్ల తర్వాత సంభవించిన భారీ భూకంపంగా నమోదు అయ్యింది.
Vasuki Indicus: ప్రపంచంలోనే అతిపెద్ద పాము వెలుగులోకి.. ఇది ఉన్నది ఎక్కడో తెలుసా?!