New Covid Wave: మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ వేవ్.. వారంలో 25 వేల కేసులు!!

గత వారంలో కోవిడ్-19 కేసులు సింగపూర్‌లో భారీగా పెరిగాయి.

మే 5 నుంచి 11 వరకు 25,900 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు వారంలో 13,700 కేసులొచ్చాయి. దేశం మరో కోవిడ్ వేవ్‌ను ఎదుర్కొంటుందని, వచ్చే నాలుగు వారాల్లో కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని ఆరోగ్య మంత్రి ఓంగ్ యె కుంగ్ హెచ్చరించారు.

ప్రస్తుతం, రోజుకు సగటున 250 మంది ఆసుపత్రిలో చేరుతున్నారు. కానీ ఐసీయూలో చేరేవారు తక్కువగా ఉన్నారు. 60 ఏళ్లు పైబడిన వారు, అంతర్లీన వ్యాధులు ఉన్నవారు మరియు వృద్ధాశ్రమాలలో నివసించేవారు అదనపు డోసు టీకా తీసుకోవాలని ప్రభుత్వం ప్రజలకు సూచిస్తోంది. మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేయడం వంటి కొన్ని ఆంక్షలు తిరిగి విధించబడ్డాయి. 

 

H5N1 Bird Flu: తొలిసారి ఆవు పాలల్లో బర్డ్ ఫ్లూ వైరస్.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

#Tags