Child Born: ఈ దేశంలో ఒక్క బిడ్డను కంటే రూ.61 లక్షలు!

దక్షిణ కొరియా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

దీనిని పరిష్కరించడానికి పిల్లలకు జన్మనిచ్చే తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా ఒక్కో బిడ్డకు 59 వేల పౌండ్లు (దాదాపు రూ. 61 లక్షలు) ఇవ్వాలని ఆ దేశ ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఈ వినూత్న చర్యను అమలు చేయడానికి ముందు ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి, దక్షిణ కొరియా ప్రభుత్వానికి చెందిన అవినీతి నిరోధక, పౌర హక్కుల కమిషన్ ఒక పబ్లిక్ సర్వేను నిర్వహించింది. ఈ సర్వే ఏప్రిల్ 17న ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి సంవత్సరానికి 12.9 బిలియన్ పౌండ్లు (సుమారు రూ. 1.3 లక్షల కోట్లు) ఖర్చు అవుతుందని అంచనా. ఇది దక్షిణ కొరియా బడ్జెట్‌లో దాదాపు సగం.

Indians Got American Citizenship: రికార్డ్.. అమెరికా పౌరసత్వం పొందిన భారతీయులు.. ఎంతమంది అంటే..?

దక్షిణ కొరియా దేశంలో జననాల రేటు భారీగా తగ్గిపోతోంది. 2023లో ఇది 0.72కు పడిపోయింది. 2023లో నమోదైన జాతీయ జనన రేటు ఆ దేశ చరిత్రలోనే అత్యంత కనిష్టం. దేశంలో జనాభా సంక్షోభానికి అనేక కారణాలు ఉన్నాయి. పెరిగిన జీవన వ్యయం, తగ్గిన జీవన నాణ్యత.. వెరసి దంపతులు వివాహ బంధానికి, పిల్లలను కనేందుకు విముఖత చూపుతున్నారు.

#Tags