Indian Passport: వీసా లేకుండానే 57 దేశాలను చుట్టిరావొచ్చు... ఆ దేశాలేవో ఇక్క‌డ తెలుసుకోండి.. అలాగే మ‌న‌ పాస్‌పోర్టు ర్యాంకు ఎంతంటే..?

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా?.. అయితే ఎలాంటి వీసా లేకుండా కేవలం భారత పాస్‌పోర్టుతో 57 దేశాలకు వెళ్లిపోవచ్చు. తాజాగా లండన్‌కు చెందిన హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌ ర్యాంకుల్లో భారత్‌ 80వ స్థానంలో నిలిచింది. మనతోపాటు సెనెగల్, టోగోలకు కూడా 80వ ర్యాంక్‌ లభించింది.
Indian Passport: వీసా లేకుండానే 57 దేశాలను చుట్టిరావొచ్చు... ఆ దేశాలేవో ఇక్క‌డ తెలుసుకోండి.. అలాగే మ‌న‌ పాస్‌పోర్టు ర్యాంకు ఎంతంటే..?

గత ఐదేళ్లుగా భారత్‌ ర్యాంకు మెరుగుపడుతుండటం విశేషం. 2022లో భారత్‌ 87వ స్థానంలో నిలిచింది. కాగా ఈ ఏడాది అగ్రస్థానంలో సింగపూర్‌ నిలిచింది. ఈ దేశానికి చెందిన పాస్‌పోర్టుతో 192 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రమంలో సింగపూర్‌ గతేడాది ర్యాంకుల్లో ముందున్న జపాన్‌ను అధిగమించింది.

Success Story: గూడెం నుంచి అమెరికాకు... ఈ వ‌రంగ‌ల్ ప్రొఫెస‌ర్ స‌క్సెస్ జ‌ర్నీ సాగిందిలా..!

ఇక జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌లు రెండో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో వీసా లేకుండా 190 దేశాలకు వెళ్లొచ్చు. జపాన్, ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, లక్సెంబర్గ్, దక్షిణ కొరియా, స్వీడన్‌ మూడో స్థానం దక్కించుకు­న్నాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో 189 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. బ్రిటన్‌ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. 

వీసా లేకుండా వెళ్లగలిగే దేశాలు
బార్బడోస్, భూటాన్, బొలీవియా, బ్రిటిష్‌ వర్జిన్‌ దీవులు, బురుండి, కంబోడియా, కుకు దీవులు, కేప్‌ వెర్డే దీవులు, కొమొరో దీవులు, జిబౌటి, డొ­మి­నికా, ఎల్‌ సాల్వడార్, ఫిజీ, గబాన్, గ్రెనడా, గినియా–బిస్సావు, హైతీ, ఇండోనేషియా, ఇరాన్, జమైకా, జోర్డాన్, కజకిస్థాన్, లావోస్, మకావు, మడగాస్కర్, మాల్దీవులు, మార్షల్‌ దీవులు, మౌరిటానియా, మారిషస్, మైక్రో­నే­షియా, మోంట్సెరాట్, మొజాంబిక్, మయన్మార్, నేపాల్, నియు, ఒమన్, పలావు దీవులు, ఖతార్, రువాండా, సమోవా, సెనెగల్, సీషెల్స్‌ దీవులు, సియర్రా లియోన్, సోమాలియా, శ్రీలంక, సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్, సెయింట్‌ లూసి­యా, సెయింట్‌ విన్సెంట్, టాంజానియా, థాయి­లాండ్, తైమూర్‌–లెస్టే, టోగో, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, ట్యునీషియా, తువాలు, వనటు, జింబాబ్వే. 

ఇవీ చ‌దవండి: ఈ విష‌యాలు తెలుసుకుంటే.. ఇక‌పై ఇంగ్లిష్‌లో అన‌ర్గ‌ళంగా ప్ర‌శ్నించొచ్చు

దాదాపు పదేళ్ల క్రితం వరకు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న అమెరికా ఎనిమిదో స్థానా­­నికి పడిపోయింది. ఈ మేరకు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌­పోర్ట్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ) డేటా ఆధారంగా తాజాగా వీసా లేకుండా ప్రయా­ణించే దేశాలకు హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌ ర్యాంకులను ప్రకటించింది. 

ఇవీ చ‌దవండి: రేపు కూడా స్కూల్స్‌, కాలేజీకు సెల‌వులు.. ఈ పరీక్షలన్నీ వాయిదా.. ఇంకా..

చెత్త పాస్‌పోర్టు గల దేశాల్లో పాకిస్థాన్‌
హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌ నాలుగో చెత్త పాస్‌పోర్ట్‌ కలిగిన దేశంగా నిలిచింది. పాక్‌ పాస్‌పోర్టుతో వీసా లేకుండా కేవలం 33 దేశాలకు వెళ్లడానికి మాత్రమే వీలుంది. ఇక ఆఫ్ఘనిస్థాన్, ఉత్తర కొరియా, పపువా న్యూ గినియా, తుర్కిమెనిస్థాన్‌ దేశాలకు జీరో ర్యాంక్‌ లభించింది. అంటే ఈ దేశాల ప్రజలు వీసా లేకుండా పాస్‌పోర్టుతో ఏ దేశంలోకి ప్రవేశించలేరు.

#Tags