Global Corruption Index 2023: ప్రపంచ అవినీతి సూచీలో 93వ స్థానంలో భారత్‌

ప్రపంచ అవినీతి సూచీలో భారత్‌ దిగజారింది. గత ఏడాది (2022) కంటే ఈ ఏడాది (2023) ఎనిమిది స్థానాలు దిగువకు పడిపోయింది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ రిపోర్టు ప్రకారం–2023 ఏడాదికిగాను మొత్తం 180 దేశాల్లో భారత్‌ 93వ స్థానంలో నిలిచింది.

2022లో భారత్‌ ర్యాంక్‌ 85గా ఉంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ప్రభుత్వ రంగ అవినీతి స్థాయిల ఆధారంగా బెర్లిన్‌ కేంద్రంగా పని చేస్తున్న ట్రాన్‌ ్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ ప్రతి ఏడాది ఈ నివేదికను రూపొందిస్తుంది. తాజాగా 2023కు సంబంధించిన నివేదికను వెల్లడించింది. అవినీతి స్థాయిని బట్టి దేశాలకు 0 నుంచి 100 వరకు స్కోర్‌ ఇస్తుంది. అత్యంత అవినీతి ఉన్న దేశానికి 0 స్కోర్, అవినీతి రహిత దేశానికి 100 స్కోర్‌ను కేటాయిస్తుంది. ఈ ఏడాది ట్రాన్‌ ్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ భారత్‌కు 39 స్కోర్‌ ఇచ్చింది. దాంతో భారత్‌ 93వ ర్యాంక్‌లో నిలిచింది. గత ఏడాది ఇండియా 40 స్కోర్‌తో 85వ ర్యాంక్‌లో ఉంది.

చదవండి: World Economy: ప్రపంచ ఎకానమీపై ఐఎంఎఫ్‌ కీలక ప్రకటన

#Tags