Donald Trump : వీరిద్ద‌రికి కీల‌క ప‌ద‌వుల‌ను అప్ప‌గించిన ట్రంప్‌

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం అందుకున్నారు. వచ్చే ఏడాది (2025) జనవరిలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో ట్రంప్‌ తన ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఎన్నికల ప్రచారంలో తనకు మద్దతుగా నిలిచిన ఎలాన్‌ మస్క్‌కు ట్రంప్‌ కీలక పదవి అప్పగించారు.

National Security Advisor : ట్రంప్‌కు జాతీయ భద్రతా సలహాదారుడిగా ఫ్లోరిడా కాంగ్రెస్ సభ్యుడు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో తనకు మద్దతుగా నిలిచిన బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌, వివేక్‌ రామస్వామిలకు ఎఫిషియెన్సీ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఎలాన్‌ మస్క్‌ను గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ డిపార్ట్‌మెంట్‌కు హెడ్‌గా నియమించారు. అలాగే, వివేక్‌ రామస్వామి కూడా హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ఈ ఇద్దరు అద్భుతమైన అమెరికన్లు కలిసి వృథా ఖర్చులను తగ్గించి, ఫెడరల్ ఏజెన్సీలను పునర్నిర్మించి పరిపాలనకు మార్గం సుగమం చేస్తారని ట్రంప్‌ ఓ ప్రకటనలో తెలిపారు. సేవ్‌ అమెరికా-2 ఉద్యమానికి ఇవి ఎంతో ముఖ్యమైనవి. వీరిద్దరూ తన పాలనకు మార్గం సుగమం చేస్తారని ట్రంప్‌ చెప్పుకొచ్చారు.

United Nations : ఐరాస భద్రతా మండలిలో.. ఎలాంటి ఫలితాలు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.. ఈ విష‌యంలో..

ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లిక్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం వివేక్‌ రామస్వామి పోటీకి నిలబడ్డారు. ఆదరణ అంతంత మాత్రంగానే రాడంతో పోటీ నుంచి వైదొలిగి.. ట్రంప్‌కు బహిరంగ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ కూడా ట్రంప్‌ విజయం కోసం ఎంతగానో శ్రమించారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Congratulations to @elonmusk and @VivekGRamaswamy on this historic achievement! $DOGE #DonaldJTrump #ElonMusk #MAGA #TrumpVance2024 #VivekRamaswamy pic.twitter.com/6b98v4hyyO

— Brock W. Mitchell (@BrockWMitchell) November 13, 2024

#Tags