Cyril Ramaphosa: దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా మళ్లీ రామఫోసా

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌(ఏఎన్‌సీ)కు చెందిన సిరిల్‌ రామఫోసా(71) మళ్లీ ఎన్నికయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో దాదాపు 30 ఏళ్ల తర్వాత ఏఎన్‌సీ పార్లమెంట్‌లో మెజారిటీ కోల్పోయింది.

దీంతో, డెమోక్రాటిక్‌ అలయెన్స్, ఇతర చిన్న పార్టీలతో కలిసి ఏఎన్‌సీ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. శుక్రవారం పార్లమెంట్‌లో జరిగిన ఎన్నిక లో రామఫోసాకు 283 ఓట్లు పడగా, ప్రత్యర్థి మలేమాకు 44 ఓట్లే ద క్కాయి. రామఫోసా బుధవారం అధ్యక్షునిగా ప్రమాణం చేయనున్నారు. 

చదవండి:

భారత్-దక్షిణాఫ్రికా వ్యాపార సదస్సులో మోదీ

ఘనంగా 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

#Tags