Skip to main content

భారత్-దక్షిణాఫ్రికా వ్యాపార సదస్సులో మోదీ

న్యూఢిల్లీలో జనవరి 25న ఇండస్ట్రీ చాంబర్- సీఐఐ నిర్వహించిన భారత్-దక్షిణాఫ్రికా వాణిజ్య సదస్సుప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
2.6 ట్రిలియన్ డాలర్లతో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, బ్రిటన్ తరువాత ఉన్న భారత్ త్వరలో ఐదో స్థానానికి ఎదుగుతుందని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. దేశంలో పెట్టుబడుల పురోగతికి నిరంతర చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందనీ వివరించారు.

దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం 150కిపైగా భారత్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామ్‌పోసా పేర్కొన్నారు. వ్యవసాయం, ఐసీటీ, ఎయిరోస్పేస్, ఇంధనం, ఫార్మా, రక్షణ, మౌలిక, మైనింగ్, క్రియేటివ్ రంగాల్లో పరస్పరం సహకరించుకోడానికి రెండు దేశాలకూ చక్కటి అవకాశాలు ఉన్నాయన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత్-దక్షిణాఫ్రికా వాణిజ్య సదస్సు
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : న్యూఢిల్లీ
ఎక్కడ : ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామపోసా
Published date : 26 Jan 2019 08:11PM

Photo Stories