China Population: రెండో ఏడాది కూడా తగ్గిన చైనా జనాభా.. కార‌ణం ఇదే..

అధిక జనాభాతో మన దేశం జన భారత్‌గా దూసుకుపోతుంటే పొరుగుదేశం చైనా జనాభా క్షీణతను చవిచూస్తోంది.

వరసగా రెండో ఏడాదీ అక్కడ జనాభా క్షీణత నమోదైంది. గత ఏడాదితో చూస్తే 2023 ఏడాదిలో చైనా జనాభా 20.8 లక్షలు తగ్గి 140.97 కోట్లకు పడిపోయింది. వార్షిక గణాంకాలను జ‌న‌వ‌రి 17వ తేదీ (బుధవారం) చైనా విడుదల చేసింది. 

జనాభా నియంత్రణే లక్ష్యంగా ఒకే బిడ్డ విధానాన్ని కఠినంగా కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం అమలు చేయడంతో చైనాలో గత ఆరు దశాబ్దాల్లో ఎరుగని జనాభా క్షీణతను 2022 ఏడాది ఎదుర్కొంది. 2022లో చైనాలో 95.6 లక్షల మంది జన్మిస్తే 2023లో 90.2 లక్షల మంది పుట్టారు. జననాల రేటు అత్యంత కనిష్టానికి పడిపోవడమూ ఇందుకు ఒక కారణం. కోవిడ్‌ కారణంగా 2023 ఏడాదిలో ఎక్కువ మంది చనిపోవడమూ జనాభా తగ్గుదలకు మరో కారణమైంది. గత ఏడాది ఏకంగా 1.11 కోట్ల మంది చైనాలో చనిపోయారు.

Red Sea Attacks: ఇజ్రాయెల్‌ లక్ష్యంగా ఎర్రసముద్రంలో నౌకలపై దాడులు.. ఎవరీ ఎర్రసముద్రపు హౌతీలు..?

#Tags