China’s Communist Party Congress: ఆర్థిక వ్యవస్థ పునర్వైభవం ఖాయం.. జాతీయ సదస్సులో కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా స్పష్టికరణ

బీజింగ్‌:  ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక మందగమనం పెద్ద సమస్యేమీ కాదని, తమ దేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే పుంజుకోవడం ఖాయమని కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా(సీపీసీ) ధీమా వ్యక్తం చేసింది. మరిన్ని విదేశీ పెట్టుబడుల కోసం ద్వారాలు తెరుస్తామని ప్రకటించింది.
China’s

ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణే లక్ష్యంగా సీపీసీ 20వ జాతీయ సదస్సులో సోమవారం నూతన ఆర్థిక విధానంపై విస్తృతంగా చర్చించారు. 2,300 మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు. వాస్తవానికి 2022లో 5.5 శాతం వృద్ధి సాధించాలని చైనా సర్కారు లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ, అది సాధ్యం కాదని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంకు తేల్చిచెప్పాయి. 3.2 శాతం వృద్ధిని ఐఎంఎఫ్, 2.8 శాతం వృద్ధిని ప్రపంచ బ్యాంకు అంచనా వేశాయి. చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ కఠినంగా అమలు చేస్తున్న జీరో కోవిడ్‌ పాలసీ వల్ల ఆర్థిక ప్రగతి క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసిక నుంచి ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టడం తథ్యమని నేషనల్‌ డెవలప్‌మెంట్, రిఫామ్‌ కమిషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఝవో చెన్‌న్‌ చెప్పారు. కొత్త పరిశ్రమలు, తద్వారా కొత్త ఉద్యోగాల సృష్టికి కృషి చేస్తున్నామని వివరించారు.  

Also read: Great Hall Of The People: చైనాలో తైవాన్‌ అంతర్భాగం.. బలప్రయోగానికీ వెనుకాడం

50 లక్షల మందిపై దర్యాప్తు  
అవినీతిని సహించే ప్రసక్తే లేదని చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ తేల్చిచెప్పింది. గత పదేళ్లలో అవినీతి ఆరోపణల కింద తమ పార్టీలో 50 లక్షల మంది సభ్యులపై దర్యాప్తు చేసినట్లు వెల్లడించింది. 553 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు తెలిపింది. అధికార దుర్వినియోగానికి పాల్పడడం, లంచాలు ఇవ్వడం, లంచాలు తీసుకోవడం వంటివాటిలో భాగస్వాములైతే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించింది. చైనా కమ్యూనిస్ట్‌ పారీ్టలో 9.6 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. గత పదేళ్లలో 2,07,000 మందికి వివిధ రకాల శిక్షలు విధించినట్లు పార్టీ క్రమశిక్షణా కమిటీ ఉప కార్యదర్శి షియావో తెలిపారు. 

Also read: Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 17th కరెంట్‌ అఫైర్స్‌

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

#Tags