Best Cities in World: ప్రపంచ ఉత్తమ నగరాల్లో ముంబైకి 12వ ర్యాంక్‌

‘టైమ్‌ ఔట్‌’ విడుదల చేసిన ప్రపంచంలో టాప్‌ నగరాల జాబితాలో ముంబై పన్నెండో స్థానంలో ఉంది.

భారత్‌ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక నగరం ముంబై కావడం విశేషం. జాబితాలో న్యూయార్క్, కేప్‌టౌన్‌ , లండన్‌ , బెర్లిన్‌ , మ్యాడ్రిడ్‌ మొదటి ఐదు స్థానాలను దక్కించుకున్నాయి. నగరాల్లో లభించే ఆహారం, వాటిలోని భవన నిర్మాణ రీతులు, సాంస్కృతిక సంపద వంటి వాటిపై ప్రజాభిప్రాయం, నిపుణుల విశ్లేషణల ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఈ నగరాల్లో నివసించడం పట్ల ప్రజలు ఏ మేరకు సంతోషంగా ఉన్నారనే దానిని బట్టి ర్యాంకులను ఇచ్చినట్లు వెల్లడించింది.
 

#Tags