National Space Day 2024: ఆగస్టు 23వ తేదీ జాతీయ అంతరిక్ష దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..

చంద్రయాన్-3 విజయానికి గుర్తుగా ఆగస్టు 23వ తేదీని భారతదేశం “జాతీయ అంతరిక్ష దినోత్సవం”గా జరుపుకుంటుంది.

2023 జులై 14వ తేదీ ఇస్రో చంద్రయాన్‌ 3 అంతరిక్ష యాత్ర చేపట్టి, ఆగస్టు 23వ తేదీ ల్యాండర్‌ను చంద్రుడిపై దింపింది. దీంతో ప్ర‌తి సంవ‌త్స‌రం ఆగస్టు 23వ తేదీ జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించుకోవాలని కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా అన్ని పాఠశాలలు, డైట్‌ కళాశాలల్లో విద్యార్థులతో పాటు యువకుల్లో అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి పెంచేందుకుగాను వివిధ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 

ఈ ఏడాది థీమ్‌: ‘చంద్రుని తాకేటప్పుడు జీవితాలను తాకడం: భారతదేశ అంతరిక్ష సాగా’. 

విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ కార్యకలాపాలను https://bharatonthemoon.ncert.gov.in/login వెబ్‌లింక్‌లో నమోదు చేయవ‌చ్చు. అలాగే https://ncert.nic.in/chandrayaan.phpలో చంద్రయాన్‌ ఉత్సవ్‌ మాడ్యూల్‌ అందుబాటులో ఉంటాయి.

World Mosquito Day: ఆగస్టు 20వ తేదీ ప్రపంచ దోమల దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..

అలాగే.. ఎన్‌సీఈఆర్‌టీ అన్ని పాఠశాలలు, డైట్‌ కళాశాలల్లో విద్యార్థులతో పాటు యువకుల్లో అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి పెంచేందుకుగాను వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులు అంతరిక్షం గురించి తెలుసుకోవడమే కాకుండా, తమ సొంత ప్రాజెక్టులు కూడా చేయవచ్చు.

ఇస్రో-నాసా సంయుక్త మిషన్‌ నిసార్‌ను 2025లో చేపట్టనున్నట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం వస్తే చంద్రయాన్‌-4 మిషన్‌ను 2027లో ప్రారంభించానున్నట్లు ఇస్రో సైంటిఫిక్‌ సెక్రటరీ శాంతను భటవాడేకర్ అన్నారు.

#Tags