Telugu Language Day: ఆగ‌స్టు 29వ తేదీ తెలుగు భాషా దినోత్సవం

ప్ర‌తి సంవ‌త్స‌రం ఆగ‌స్టు 29వ తేదీ తెలుగు భాషా దినోత్సవాన్ని జ‌రుపుకుంటారు.

తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు, వ్యవహారిక భాషోద్యమ మూలపురుషుడు, బహుభాషావేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, శాసన పరిశోధకుడు, తెలుగుభాషకు గొడుగు గిడుగు రామమూర్తి శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో జన్మించారు. 1880లో పర్లాకిమిడిలో ఉపాధ్యాయుడిగా జీవితం మొదలు పెట్టి 1911 వరకు విద్యాభివృద్ధికై కృషి చేసాడు. ఈయ‌న 1863, ఆగస్టు 29వ తేదీ జ‌న్మించి, 1940, జనవరి 22వ తేదీ మ‌ర‌ణించారు. 

➤ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1966లో ఆగస్టు 29ని తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించింది.

➤ ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు భాష గొప్పదని.. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసిన భాష అని కొనియాడారు.  

➤ తెలుగు అనేది కేవలం భావవ్యక్తీకరణ కోసం ఉపయోగించే ఒక భాష మాత్రమే కాదని.. యుగయుగాలుగా కవుల ఊహలకు రెక్కలు కట్టి, మన పండితుల జ్ఞానానికి పదును పెట్టిన మన జాతి ప్రాచీన వారసత్వానికి ప్రాణం అని  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. 

Madras Day: ఆగస్టు 22వ తేదీ ‘మద్రాస్ డే’.. నేటితో 385 ఏళ్లు పూర్తి

➤ దేశంలో హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు. మన తెలుగు భాష భారత్‌లో 4వ స్థానంలో, అమెరికాలో 11వ స్థానంలో ఉంది. 

➤ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌వాడ తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక‌క్షేత్రంలో గిడుగు వెంక‌ట రామ‌మూర్తి పంతులు 161వ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో తెలుగు భాషా దినోత్స‌వం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా వివిధ రంగాల ద్వారా తెలుగు భాష ప‌రిర‌క్ష‌ణ‌కు, భాష‌కు, క‌ళ‌ల కోసం విశేష సేవ‌లందిస్తున్న 17 మందికి సీఎం చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పుర‌స్కారాలు అందించారు.

#Tags