Jagananna Videshi Vidya Deevena: జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు జమ చేసిన సీఎం జగన్‌

పేద విద్యార్థులు సైతం ప్రపంచంలోని అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఉన్నత విద్య అభ్య­సించేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి.
Jagananna Videshi Vidya Deevena

సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి 357 మంది విద్యార్ధుల‌కు రూ.45.53 కోట్లు బటన్‌ నొక్కి నిధులు విడుదల చేశారు. 

టాప్‌ 50 యూనివర్సిటీల్లో 21 మంది ఫ్యాకల్టీలను ఎంపిక చేశాం. గతంలో కేవలం రూ.10లక్షలు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు రూ.1.25కోట్ల వరకు ఇస్తున్నాం. గతంలో మొక్కుబడిగా ఇచ్చిన పరిస్థితి ఉండేది. మన ప్రభుత్వం వచ్చాక కోటి రూపాయలు దాటినా ఇస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు ఇస్తున్నామని వెల్లడించారు.

☛☛ YSR Netanna Nestam: తిరుపతి వెంకటగిరిలో వైఎస్సార్‌ నేతన్న నేస్తం

ఇదీ పథకం:

క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్స్‌ ప్రకారం ఇంజనీరింగ్, మెడిసిన్, లా, జర్నలిజం తదితర 21 ఫ్యాకల్టీల్లో టాప్‌ 50 ర్యాంకుల్లోని విదేశీ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. దీని ద్వారా ప్రపంచంలోని 320కి పైగా ఉత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువుకొనేందుకు మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశం కలుగుతుంది. గడచిన 6 నెలల్లో ‘జగనన్న విదేశీ విద్యా దీవెన‘ కింద అందించిన ఆర్థిక సాయం రూ.65.48 కోట్లు. 

☛☛  Jagananna Thodu: చిరు వ్యాపారులకు జగనన్న తోడు

#Tags