Jagananna Suraksha: రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్న సురక్ష’ క్యాంపులు

ప్రజల వినతులను సంతృప్త స్థాయిలో పరిష్కరించడం, ఏ ఒక్కరూ మిగిలిపోకుండా అర్హులందరికీ వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి అనుబంధంగా చేపట్టిన ‘జగనన్న సురక్ష’ ద్వారా జులై 1 నుంచి సచివాలయాలవారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా జగనన్న సురక్ష క్యాంపులు:

జగనన్న సురక్ష కార్యక్రమం కింద జూలై 1వ తేదీ నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల వద్ద నెల రోజుల పాటు ప్రత్యేక క్యాంపుల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
ఏపీ వ్యాప్తంగా ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ప్రారంభమైంది. సమస్యలు పరిష్కరించి లబ్ధిదారులకు సర్టిఫికెట్లను ప్రజాప్రతినిధులు అందజేస్తున్నారు. 
తొలిరోజు జూలై 1వ తేదీన 1,306 సచివాలయాల పరిధిలో క్యాంపులు జరగనున్నట్లు అధికారలు తెలిపారు. దీనికి సంబంధించి ఆయా సచివాలయాల పరిధిలోని వలంటీర్లు జూన్‌ 24వ తేదీ నుండే ఇంటింటికీ వెళ్లి క్యాంపుల సమాచారాన్ని తెలియజేయడంతో పాటు ఆయా కుటుంబాల నుంచి వ్యక్తిగత వినతుల వివరాలను సేకరించారు.
తొలిరోజు క్యాంపులకు సంబంధించి 14,29,051 కుటుంబాలకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ జూన్ 30న‌ ఎస్‌ఎంఎస్‌ రూపంలో కూడా సమాచారాన్ని పంపింది.

 Daily Current Affairs in Telugu: 1 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

ధ్రువీకరణ పత్రాల జారీ:

జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ప్రత్యేక క్యాంపులకు సంబంధించి 11 రకాల ప్రధాన ధ్రువీకరణ పత్రాల జారీకి ఎలాంటి సర్విసు చార్జీలను వసూలు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది.  
సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రత్యేక క్యాంపులలో అందే వినతులను అత్యంత వేగంగా పరిష్కరించే లక్ష్యంతో ఏడు రోజుల ముందే దరఖాస్తులను స్వీకరించడంతోపాటు టోకెన్లను కూడా జారీ చేస్తున్నారు.
జూన్ 30 సాయంత్రం వరకు 9.48 లక్షల టోకెన్లు జారీ కాగా 6.77 లక్షల వినతుల వివరాలను సచివాలయాల డిజిటల్‌ అసిస్టెంట్లు కంప్యూటర్లలో నమోదు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అప్పటికప్పుడే పరిష్కారానికి అవకాశం ఉన్న 2.65 లక్షల వినతులకు సంబంధించి క్యాంపు నిర్వహణకు ముందే అధికారుల స్థాయిలో ఆమోద ప్రక్రియ పూర్తయ్యాయి.

 Daily Current Affairs in Telugu: 30 జూన్ 2023 క‌రెంట్ అఫైర్స్

#Tags