World Bank: 2024లో భారత్‌ వృద్ది 7.5 శాతం

భారత ఆర్థిక వ్యవస్థ 2024లో 7.5 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక అంచనా వేసింది. గతంలో అంచనా వేసిన వృద్ధి రేటు కంటే 1.2 శాతం పెంచడం విశేషం. భారత్‌లో బలమైన వృద్ధితో పాటు పాకిస్థాన్, శ్రీలంకల్లో రికవరీతో దక్షిణాసియాలో వృద్ధి 6 శాతంగా నమోదు కావొచ్చని ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది. నివేదిక ప్రకారం– 2024, 2025లలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే ప్రాంతంగా దక్షిణాసియా నిలుస్తుందని పేర్కొంది.
 

చదవండి: April 8th Current Affairs GK Quiz: నేటి ముఖ్యమైన టాప్ బిట్స్ ఇవే!
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags