Visakhapatnam Port: విశాఖ పోర్టుకు ప్రపంచ బ్యాంక్ సీపీపీఐలో టాప్ 20లో స్థానం!
ప్రపంచ బ్యాంక్ రూపొందించిన కంటైనర్ పోర్టుల పనితీరు సూచీ (సీపీపీఐ)లో టాప్ 20 స్థానాల్లో నిలిచింది. ఈ ఘనతతో పోర్టు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేశారు.
విశాఖ పోర్టు సాధించిన విజయాలు ఇవే..
➤ ప్రపంచవ్యాప్త కంటైనర్ పోర్టుల పనితీరును అంచనా వేసే సీపీపీఐలో 18వ స్థానం.
➤ గంటకు 27.5 క్రేన్ కదలికలతో అద్భుతమైన కార్యాచరణ సామర్థ్యం.
➤ బెర్త్ లో షిప్ టర్న్‌అరౌండ్ సమయం 13% మాత్రమే.
➤ టర్న్‌అరౌండ్ టైమ్ లో 21.4 గంటల అద్భుత రికార్డు.
➤ 65 కంటే ఎక్కువ కంటైనర్ లైన్లతో అనుసంధానం.
➤ కంటైనర్ టెర్మినల్‌కు 8 నిరంతర సర్వీసులున్నాయి.
World Economic Forum: ప్రయాణ, పర్యాటక అభివృద్ధి సూచీలో భారత్‌కు 39వ స్థానం!
సరుకు రవాణాలో 4వ స్థానం
2023–24వ ఆర్థిక సంవత్సరంలో విశాఖ పోర్టు సరుకు రవాణాలో మెరుగైన పనితీరును కనబరిచి దేశంలోని మేజర్ పోర్టులలో 4వ స్థానంలో నిలిచింది. 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే సరుకు రవాణాలో 13.5 శాతం వృద్ధిని కనబరిచింది. ఈ ఘనత పట్ల కేంద్ర పోర్టులు, నౌక, జలరవాణా శాఖ సంతృప్తి వ్యక్తం చేసింది.