Life Insurance Corporation: ప్రపంచంలోనే శక్తిమంతమైన బీమా బ్రాండ్ ఎల్‌ఐసీ
దేశీ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ 2024 సంవత్సరానికి సంబంధించి బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 నివేదికలో ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన బీమా సంస్థగా నిలిచింది.
9.8 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువ, 88.3 బ్రాండ్ పటిష్టత సూచీ స్కోరు, ట్రిపుల్ ఏ రేటింగ్‌తో ఎల్‌ఐసీ ఈ ఘనత సాధించింది.
బ్రాండ్ విలువలో పెరుగుదల
గతేడాదితో పోలిస్తే ఎల్‌ఐసీ బ్రాండ్ విలువ 9% పెరిగి 4.9 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ విషయంలో ఎన్‌ఆర్‌ఎంఏ ఇన్సూరెన్స్ (1.3 బిలియన్ డాలర్లు) మూడో స్థానంలో నిలిచింది.
చైనా కంపెనీల ఆధిపత్యం
బ్రాండ్ విలువ పరంగా చూస్తే చైనా కంపెనీలు మాత్రం ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. 33.6 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో పింగ్ ఆన్ అగ్రస్థానంలో ఉండగా, చైనా లైఫ్ ఇన్సూరెన్స్ (24.3 బిలియన్ డాలర్లు), సీపీఐసీ (13.7 బిలియన్ డాలర్లు) వరుసగా 3వ, 5వ స్థానాల్లో నిలిచాయి.
Credit Card: మహిళల ప్రత్యేక ప్రయోజనాల కోసం ‘దివా’ క్రెడిట్ కార్డును తెచ్చిన బ్యాంక్ ఇదే!!
#Tags