World Economic Forum: ప్రయాణ, పర్యాటక అభివృద్ధి సూచీలో భారత్‌కు 39వ స్థానం!

ప్ర‌పంచ ఆర్థిక వేదిక (World Economic Forum) విడుదల చేసిన ప్రయాణ, పర్యాటక అభివృద్ధి సూచీ 2024 ప్ర‌కారం భారతదేశం గణనీయమైన పురోగతి సాధించింది.

అంతర్జాతీయ పర్యాటక కార్యకలాపాలు మళ్ళీ కోవిడ్-19కి ముందు స్థాయికి చేరుకుంటున్నాయని డ‌బ్ల్యూఈఎఫ్ వార్షిక నివేదిక వెల్లడించింది.  

ఈ సూచికలో భారతదేశం ర్యాంక్ మెరుగై 39వ స్థానానికి చేరుకుంది. ఈ జాబితాలో అమెరికా తొలిస్థానంలో నిలిచింది. ద‌క్షిణాసియాలో త‌క్కువ మ‌ద్య‌స్థాయి ఆధాయం క‌లిగిన దేశాల‌లో భార‌త్ తొలి స్థానంలో ఉంది. 2021లో డ‌బ్ల్యూఈఎఫ్ ప్ర‌క‌టించిన ఈ సూచిలో భారత్ 54వ స్థానంలో ఉంది. 2024 జాబితాలో అమెరికా, స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. 

 

Indian Stock Market: చరిత్రాత్మక ఘనత సాధించిన భారత స్టాక్ మార్కెట్!

#Tags