5G: అమెరికాను వెనక్కి నెట్టి.. ప్రపంచంలో రెండో అతిపెద్ద 5జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా భారత్
కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. భారతదేశం అమెరికాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా అవతరించింది.
☛ చైనా మొత్తం మార్కెట్‌లో 32% వాటాతో అగ్రస్థానంలో ఉంది. భారత్ 13% వాటాతో రెండో స్థానంలో ఉంది. జాబితాలో 10% మార్కెట్ వాటాతో అమెరికా మూడవ స్థానానికి పడిపోయింది.
☛ యాపిల్, శాంసంగ్ కంపెనీలు 5జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
☛ బడ్జెట్ ధరల్లో 5జీ స్మార్ట్‌ఫోన్లు లభించడం వల్ల అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు ఈ విభాగంలో అధిక వృద్ధిని సాధిస్తున్నాయి.
మొత్తం 5జీ స్మార్ట్‌ఫోన్లలో యాపిల్ కంపెనీ 25% వాటాను కలిగి ఉంది. ప్రధానంగా ఐఫోన్ 15, ఐఫోన్ 14 సిరీస్‌ల అగ్రగామిగా ఉన్నాయి. తరువాత శాంసంగ్ 5G హ్యాండ్‌సెట్‌లలో 21% కంటే ఎక్కువ వాటాతో రెండో స్థానంలో ఉంది. ముఖ్యంగా గెలాక్సీ ఏ సిరీస్, ఎస్24 సిరీస్ ఎక్కువ షిప్‌మెంట్‌లను కలిగి ఉన్నాయి.
GDP Growth: ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్
#Tags