GST Collections: ఏపీలో క్షీణించిన జీఎస్టీ వసూళ్లు! దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు ప్రస్తుతం తిరోగమన దిశలో సాగుతున్నాయని గణాంకాలు పేర్కొంటున్నాయి.

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వాణిజ్య కార్యకలాపాలు నెమ్మదించడంతో జీఎస్టీ వసూళ్లు క్షీణించాయి. గడచిన మూడు నెలల్లో నాలుగు, ఏడు శాతం చొప్పన జీఎస్టీ వసూళ్లు తగ్గగా, నవంబర్‌లో ఏకంగా 10 శాతం మేర క్షీణించాయి. నవంబర్‌లో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం గతేడాదితో పోలిస్తే 10 శాతం క్షీణించి రూ.4,093 కోట్ల నుంచి రూ.3,699 కోట్లకు పడిపోయినట్లు కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొంది. 

ఇదే సమయంలో.. తమిళనాడు 8 శాతం, కర్ణాటక 15 శాతం, కేరళ 10 శాతం, తెలంగాణ 3 శాతం వృద్ధి నమోదు చేస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటే క్షీణతను నమోదు చేసింది. నవంబర్‌లో దేశవ్యాప్తంగా జీఎస్టీ ఆదాయం 9.38 శాతం వృద్ధితో రూ.139,678 కోట్లుగా నమోదైంది.

దేశ సగటు కంటే వెనుకబాటు.. 
వైఎస్సార్‌సీపీ హయాంలో దేశ స­గటు కంటే అత్యధిక వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది మాత్రం వెనుకబడ్డాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు చూస్తే దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో 10.3 శాతం వృద్ధితో రూ.11,04,817 కోట్లు వసూళ్లు అయితే ఏపీలో కేవలం 2.2 శాతం వృద్ధితో రూ.30,056 కోట్ల­కు పరిమితమైంది.

Andhra Pradesh: గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నంబర్‌వన్.. అలాగే వీటి ఉత్పత్తిలోనూ..

#Tags