GST Council చంఢీగడ్ లో జీఎస్‌టీ మండలి సమావేశాలు - కీలక నిర్ణయాలు వాయిదా

GST Council meeting in Chandigarh - key decisions postponed

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన చండీగఢ్‌లో రెండు రోజుల పాటు జరిగిన వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అత్యున్నత స్థాయి నిర్ణయక మండలి 47వ సమావేశం బుధవారం ముగిసింది. మాంసం, చేపలు, పెరుగు, పనీర్, తేనె వంటి ఆహార పదార్థాల విషయంలో ముందే ప్యాక్‌ లేదా లేబుల్‌  చేసిన ఆహార పదార్థాలపై జీఎస్‌టీ విధింపుసహా తొలి రోజు పలు నిర్ణయాలను తీసుకున్న మండలి సమావేశం రెండరోజు కీలక అంశాలపై తుది నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది.  జీఎస్‌టీ స్లాబ్స్‌లో మార్పులు, రెవెన్యూ నష్టానికి సంబంధించి రాష్ట్రాలకు పరిహారం (జూన్‌లో ముగిసే ఐదేళ్ల కాలం తరువాత)సహా  ఆన్‌లైన్‌ గేమింగ్, రేసింగ్‌లు, క్యాసినో, లాటరీలపై 28 శాతం పన్ను విధింపు వంటి కీలక అంశాలపై సమావేశం ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. కీలక అంశాలపై సంబంధిత వర్గాలతో సంప్రదింపులకోసం ఆయా అంశాలను వాయిదా వేసినట్లు ఆర్థికమంత్రి తెలిపారు. 

#Tags