Fiscal Deficit: మే నాటికి ద్రవ్యలోటు ఎంతంటే?

ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు, మే ముగిసే నాటికి లక్ష్యంలో 11.8 శాతానికి చేరింది.
Fiscal Deficit

విలువలో ఇది రూ.2,10,287 కోట్లు అని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) తాజా గణాంకాలను విడుదల చేసింది. 
2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు రూ.17.86 లక్షల కోట్లకు కట్టడి చేయాలని బడ్జెట్‌ నిర్దేశించింది. ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి విలువ అంచనాలో ఇది 5.9 శాతం. అయితే 2023 మే నాటికి లక్ష్యంలో (రూ.17.86 లక్షల కోట్లు) రూ.2.10 లక్షల కోట్లకు చేరిందన్నమాట. 2022-23లో ద్రవ్యలోటు జీడీపీలో 6.4 శాతంగా ఉంది.

☛ Daily Current Affairs in Telugu: 1 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

#Tags