Coromandel International: కోరమాండల్‌ రూ.800 కోట్ల పెట్టుబడి

ఎరువుల తయారీ సంస్థ కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ రూ.800 కోట్ల పెట్టుబడి చేయనున్నట్లు ప్రకటించింది.

ఇందులో రూ.677 కోట్లు రెండు కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు ఖర్చు చేయాలని అక్టోబర్ 24న జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయించారు. మిగిలిన మొత్తాన్ని మూలధన అవసరాలకు వినియోగించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ప్లాంట్‌ను రూ.513 కోట్లతో విస్తరించనున్నారు, దీనిలో 7,50,000 టన్నుల వార్షిక సామర్థ్యంతో గ్రాన్యులేషన్ ట్రైన్‌ను 24 నెలల్లో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం కాకినాడ కేంద్రం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 22,50,000 టన్నులు, వినియోగం 93% చేరిందని కంపెనీ పేర్కొంది. ఈ విస్తరణతో కాకినాడ ప్లాంట్ భారత్‌లోని అతిపెద్ద ఎరువుల తయారీ కేంద్రంగా మారుతుందని కోరమాండల్‌ తెలిపింది.

Dengue Vaccine: డెంగ్యూ వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌ ప్రారంభం.. ఎక్క‌డంటే..

ఫంగిసైడ్స్‌ మల్టీ ప్రొడక్ట్‌.. 
అలాగే గుజరాత్‌లోని అంకలేశ్వర్‌లో 600 టన్నుల వార్షిక సామర్థ్యంతో ఫంగిసైడ్స్ మల్టీ ప్రొడక్ట్ ప్లాంట్‌ను రూ.164 కోట్లతో నెలకొల్పాలని నిర్ణయించారు. ఇది 18 నెలల్లో ప్రారంభమవుతుంది. అలాగే, కోరమాండల్‌ క్రాప్ ప్రొటెక్షన్‌ ఫిలిప్పైన్స్‌లో 6.67% వాటాను రూ.76 లక్షలతో కొనుగోలు చేయాలని బోర్డు నిర్ణయించింది.

తగ్గిన నికర లాభం.. 
సెప్టెంబర్ త్రైమాసికంలో, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ నికర లాభం 13% క్షీణించి రూ.659 కోట్లకు చేరింది. ఎబిటా 8% తగ్గి రూ.975 కోట్లకు నమోదైంది. అయితే, టర్నోవర్ 6.4% పెరిగి రూ.7,433 కోట్లను తాకింది.

Development Projects: విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ.. ఆ ప్రాజెక్టులు ఏవంటే..

#Tags