Budget 2023 Highlights: కేంద్ర బడ్జెట్‌ 2023–24

2023–24 ఆర్థిక సంవత్సరానికి 45.03 లక్షల కోట్ల రూపాయలతో కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీ పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

గత బడ్జెట్లో వేసిన పునాదులపై ముందుకు సాగుతూవందేళ్ల భారత్‌’బ్లూప్రింట్లో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు తోడ్పడేలా పద్దును రూపొందించినట్టు వెల్లడించారు. రానున్న పాతికేళ్ల అమృత కాలంలో ఆశించిన ప్రగతి లక్ష్యాల సాధనకు మంత్రి సప్తర్షి మంత్రం జపించారు. సమ్మిళితాభివృద్ధి, ప్రతి ఒక్కరికీ పథకాల ఫలాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సామర్థ్యాల వెలికితీత, హరిత వృద్ధి, యువ శక్తి, ఆర్థిక రంగం.. ఇలా వృద్ధి ఏడు విభాగాలుగా అభివృద్ధి బ్లూ ప్రింట్ను ఆవిష్కరించారు. భారత్ను ప్రపంచ ఆర్థిక రంగంపైతళుకులీనుతున్న తారగా అభివర్ణించారు. ‘‘మన ఆర్థిక వ్యవస్థ పురోగమన దిశలో ఉంది. వృద్ధి బాటన అది శరవేగంగా పరుగులు తీస్తున్న వైనాన్ని ప్రపంచమంతా అబ్బురపాటుతో వీక్షిస్తోంది’’అంటూ భరోసా ఇచ్చారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యాన్ని అతి త్వరలో సాధిస్తామని ధీమా వెలిబుచ్చారు. తొమ్మిదేళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలు తదితరాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ వచ్చారు. తలసరి ఆదాయం రెట్టింపై ప్రజలు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నారని చెప్పారు. ‘అందరికీ తోడు, అందరి అభివృద్ధిలక్ష్యంతో సాగుతున్నామన్నారు. చ్చేది ఎన్నికల సంవత్సరం కావడంతో మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌. 2024లో ఓటాన్అకౌంట్ప్రవేశపెట్టి ఎన్నికలకు వెళ్లనుంది.

డిజిటల్బాటన వడివడిగా..
సుపరిపాలనే దేశ ప్రగతికి మూలమంత్రమన్న విత్త మంత్రి, పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం ద్వారా సామాన్యుడి సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నామన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఉటంకించారు. తొమ్మిదేళ్ల ప్రభుత్వ కృషి ఫలితంగా ప్రభుత్వ రంగంలో ప్రపంచ స్థాయి డిజిటల్వ్యవస్థ సాకారమైందని చెప్పారు. ఆధార్, కొవిన్, యూపీఐ, డిజి లాకర్స్తదితరాలన్నీ ఇందుకు నిదర్శనమేనన్నారు. కృత్రిమ మేధలో లోతైన పరిశోధనల నిమిత్తం మూడు అత్యున్నత విద్యా సంస్థల్లో సెంటర్స్ఆఫ్ఎక్సలెన్స్తేనున్నట్టు చెప్పారు. 5జీ సేవలను మరింత విస్తరిస్తామన్నారు. అదే సమయంలో పేదలు, దిగువ తరగతి సంక్షేమానికీ పెద్ద పీట వేశామని చెప్పారు. ‘‘కరోనా వేళ దేశంలో ఎవరూ ఆకలి బాధ పడకుండా చూడగలిగాం. 80 శాతం మంది పేదలకు ఆహార ధాన్యాలందించాం. ప్రధాన్మంత్రి గరీబ్కల్యాణ్అన్న యోజన కింద రూ.2 లక్షల కోట్లతో పేదలకు ఉచితంగా తిండి గింజలు సరఫరా చేశాం. వంద కోట్ల పై చిలుకు మందికి వ్యాక్సిన్లిచ్చాం. వాటిని పంపి ఎన్నో ప్రపంచ దేశాలను ఆదుకున్నాం’’అన్నారు.

పెద్ద దేశాల్లో మనమే టాప్‌..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును ఏకంగా 7 శాతంగా మంత్రి అంచనా వేశారు. ‘‘పెద్ద దేశాలన్నింట్లోనూ ఇదే అత్యధికం. అంతర్జాతీయంగా తీవ్ర మాంద్యం, కరోనా కల్లోలం, రష్యాఉక్రెయిన్యుద్ధం వంటి గడ్డు సమస్యలను తట్టుకుంటూ ఇంతటి ఘనత సాధించనుండటం గొప్ప ఘనత’’అని చెప్పారు. ప్రస్తుతం 6.4గా ఉన్న ద్రవ్య లోటును 2023–24లో 5.9 శాతానికి పరిమితం చేయడమే లక్ష్యమన్నారు.

ఐటీ పరిమితి 7 లక్షలకు..

కొత్త పన్ను విధానంలో వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచడం ద్వారా పన్ను చెల్లింపుదా రులు పాత విధానం నుంచి మారేలా ప్రోత్సహించేందుకు మంత్రి ప్రయత్నించారు. గరిష్ట ఆదాయ పన్ను రేటును 42.7 శాతం నుంచి 39 శాతానికి, సర్చార్జిని 37 నుంచి 27 శాతానికి తగ్గించారు. సీనియర్సిటిజన్లకు కూడా గరిష్ట పొదుపు పరిమితిని రెట్టింపు చేస్తూ రూ.30 లక్షలకు పెంచారు. మొబైల్ఫోన్విడి భాగాలు, టీవీలు తదితరాలపై కస్టమ్స్డ్యూటీ తగ్గింపు ద్వారా మధ్య, దిగువ తరగతికి ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు. అయితే వెండి ప్రియం కానుండటం మహిళలకు దుర్వార్తే.

మౌలికంపై మరింత దృష్టి..

మౌలిక సదుపాయాలు తదితరాలపై ఈసారి మరింత దృష్టి పెడుతున్నట్టు నిర్మల పేర్కొన్నారు. ఆర్థికంగా వెనకబడ్డ పట్టణ ప్రాంతాల వారికి గూడు కల్పించే పీఎం ఆవాస్యోజనకు కేటాయింపులను రూ.79 వేల కోట్లకు (ఏకంగా 66 శాతం) పెంచారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల కోసం పట్టణ మౌలికాభివృద్ధి నిధిని ప్రకటించారు. ఇక దేశానికి జీవనాడి అయిన రైల్వేలకు ఇప్పటిదాకా అత్యధికంగా రూ.2.4 లక్షల కోట్ల కేటాయింపులు చేశారు. ఇక పోర్టులు, పరిశ్రమలకు అనుసంధానాన్ని మరింత మెరుగు పరిచేందుకు ఉద్దేశించిన ఏకంగా రూ.77 వేల కోట్లతో కీలక రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టును ప్రకటించారు. ఇందులో రూ.15 వేల కోట్లను ప్రైవేట్రంగం నుంచి సేకరించనున్నారు.

హరిత నినాదం..

కాలుష్యకారక శిలాజ ఇంధనాల నుంచి క్రమంగా పూర్తిస్థాయిలో కాలుష్యరహిత స్వచ్ఛ ఇంధనానికి మారే లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.35 వేల కోట్లు కేటాయించారు. బయో వ్యర్థాలను ఇంధనంగా మార్చడం ద్వారా సంపద సృష్టికి గోబర్ధన్పథకం కింద ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. సాగు, భవనాలు, పరికరాలు తదితరాలన్నింటినీ హరితమయం చేయడానికి ప్రాధాన్యమిస్తామన్నారు. పీఎం కిసాన్పథకానికి రూ.2.2 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.20 లక్షల కోట్లుగా నిర్దేశించుకున్నారు. పశుగణాభివృద్ధి, మత్స్య విభాగాలపై ఫోకస్పెంచారు. ప్రధాని బాగా ప్రోత్సహిస్తున్న చిరుధాన్యాలకు మరింత ప్రాచుర్యం కల్పిస్తామన్నారు. ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు ఎగువ భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు కేటాయించారు.

మహిళలకు మరింత సాధికారత

మహిళా సాధికారత దిశగా మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. 81 లక్షల పై చిలుకు స్వయం సహాయ బృందాలను స్టార్టప్ తరహాలో తీర్చిదిద్దడం ద్వారా నెక్స్ట్లెవెల్కు తీసుకెళ్తున్నట్టు ప్రకటించారు. పర్యాటక రంగానికి ఇతోధికంగా ప్రోత్సాహకాలిస్తామన్నారు. మధ్య తరగతి దర్శనీయ ప్రాంతాల్లో పర్యటించేందుకు పథకం ప్రకటించారు.

జి–20 సారథ్యం.. గొప్ప అవకాశం..

‘‘జి–20 సదస్సుకు ఏడాది భారత్సారథ్యం వహించనుండటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన పాత్రను మరింత బలోపేతం చేసుకునేందుకు గొప్ప అవకాశం. వసుధైక కుటుంబకం (ప్రపంచమంతా ఒకే కుటుంబం) నినాదంతో దిశగా ముందుకెళ్తున్నాం’’అని నిర్మల తెలిపారు.

ఈసారి 87 నిమిషాలే..

బడ్జెట్ప్రసంగాన్ని విత్త మంత్రి ఈసారి 8,000 పై చిలుకు పదాల్లో, కేవలం 87 నిమిషాల్లోనే ముగించారు. 2020 బడ్జెట్ సమర్పించినప్పుడు ఆమె ఏకంగా 162 నిమిషాలు మాట్లాడటం విశేషం! బడ్జెట్ప్రసంగాల్లో అతి సుదీర్ఘమైనదిగా అది చరిత్రకెక్కింది కూడా. తర్వాత క్రమంగా నిడివి తగ్గతూ వస్తోంది. నిర్మల 2021లో 110 నిమిషాలు, 2022లో 92 నిమిషాలు ప్రసంగించారు. కరోనా నేపథ్యంలో 2021లో తొలి పేపర్లెస్బడ్జెట్ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆమెదే.
ఇదీ బడ్జెట్సమగ్ర స్వరూపం (అంకెలు రూ.కోట్లలో)         

 

 

2021–2022
వాస్తవ కేటాయింపులు

2022–2023
బడ్జెట్అంచనాలు

2022–2023
సవరించిన అంచనాలు

2023–2024

బడ్జెట్అంచనాలు

1.

రెవెన్యూ వసూళ్లు

   21,69,905

22,04,422

23,48,413

26,32,281

2.

 పన్ను ఆదాయం

18,04,793

19,34,771

20,86,662

23,30,631

3.

పన్నేతర ఆదాయం

3,65,112

2,69,651

2,61,751

3,01,650

4.

మూలధన వసూళ్లు

16,23,896

17,40,487

18,38,819

18,70,816

5.

రుణాల రికవరీ

24,737

14,291

23,500

23,000

6.

ఇతర వసూళ్లు

14,638

65,000

60,000

61,000

7.

అప్పులు, ఇతర వసూళ్లు

15,84,521

16,61,196

17,55,319

17,86,816

8.

మొత్తం వసూళ్లు(1+4)

37,93,801

39,44,909

41,87,232

45,03,097

9.

మొత్తం వ్యయం(10+13)

37,93,801

39,44,909

41,87,232

45,03,097

10.

రెవెన్యూ ఖాతా

32,00,926

31,94,663

34,58,959

35,02,136

11.

వడ్డీ చెల్లింపులు

8,05,499

9,40,651

9,40,651

10,79,971

12.

మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు

2,42,646

3,17,643

3,25,588

3,69,988

13.

మూలధన ఖాతా

5,92,874

7,50,246

7,28,274

10,00,961

14.

వాస్తవమూలధన వ్యయం(12+13)

8,35,520

10,67,889

10,53,862

13,70,949

15.

రెవెన్యూ లోటు(10–1)

10,31,021

9,90,241

11,10,546

8,69,855

16.

నికర రెవెన్యూ లోటు(15–12)

7,88,375

6,72,598

7,84,958

4,99,867

17.

ద్రవ్య లోటు [9–(1+5+6)]

15,84,521

16,61,196

17,55,319

1786816

18.

ప్రాథమిక లోటు (17–11)

7,79,022

7,20,545

8,14,668

706845

ఆర్థిక వృద్ధికి నిర్మలమ్మ కొత్త సూత్రం.. పొదుపు కాదు.. ఖర్చు చేయండి!

సెక్షన్‌ 80సీ, గృహ రుణంపై వడ్డీ చెల్లింపులు, హెచ్ఆర్ వంటి పన్ను మినహాయింపులు కోరని వారికి కనీస ఆదాయ పరిమితి పెంచడంతో పాటు ట్యాక్స్రిబేట్పరిమితిని పెంచారు. ఎటువంటి పన్ను మినహాయింపులు కోరకుండా మొత్తం ఆదాయంపై పన్ను చెల్లించే నూతన పన్నుల విధానంలో బేసిక్లిమిట్ను రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. పాత పన్నుల విధానంలో బేసిక్లిమిట్లో ఎటువంటి మార్పులు చేయలేదు. అదేవిధంగా నూతన పన్నుల విధానంలో సెక్షన్‌ 87 కింద ఎటువంటి పన్ను చెల్లించాల్సినక్కర్లేని ట్యాక్స్రిబేట్పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24) నుంచి రూ.7 లక్షల వార్షిక ఆదాయం వరకు ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. పాత పన్నుల విధానంలో రిబేట్ను రూ.5 లక్షలకే పరిమితం చేశారు. ఎటువంటి పన్ను మినహాయింపులు కోరని వారికి తక్కువ పన్ను రేట్లతో ఆరు శ్లాబులతో కొత్త పన్నుల విధానాన్ని 2020–21లో నిర్మలా సీతారామన్ప్రవేశపెట్టారు.

మూడేళ్లు అయినప్పటికీ ఇప్పటికీ చాలామంది పన్ను చెల్లింపుదారులు పాత పన్నుల విధానాన్నే ఎంచుకోవడంతో వీరిని కొత్త పన్నుల విధానంలోకి మా ర్చడానికి ఆర్థిక మంత్రి నిర్ణ యాలు తీసుకున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆరు ట్యాక్స్శ్లాబులను కొత్త పన్నుల విధానంలో ఐదుకు పరిమితం చేయడమే కాకుండా వీరికి రూ. 50,000 స్టాండర్డ్డిడక్షన్ను వర్తింపచేస్తున్ననట్లు తెలిపారు. ఫ్యామిలీ పెన్షన్తీసు కునే వారికి స్టాండర్డ్డిడక్షన్రూ. 15,000గా నిర్ణయించారు. స్టాండర్డ్డిడక్షన్పరిగణనలోకి తీసుకుంటే రూ. 7.5 లక్షల ఆదాయం వరకూ ఎలాంటి పన్ను ఉండదు. అలాగే ఫ్యామిలీ పెన్షన్తీసుకొనేవారికి రూ.7.15 లక్షల ఆదాయం వరకూ పన్ను ఉండదు.

డిఫాల్ట్గా కొత్త పన్నుల విధానం 

ఇప్పటివరకు రెండు పన్నుల విధానాల్లో దేన్నీ ఎంచుకోకపోతే డిఫాల్ట్గా పాత పన్నుల విధానాన్ని పరిగణనలోకి తీసుకునేవారు. కానీ, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త పన్నుల విధానాన్ని డిఫాల్ట్విధానంగా పరిగణించనున్నట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. అయినప్పటికీ పాత పన్నుల విధానంలో రిటర్న్లు దాఖలు చేసేవారికి పన్ను మినహాయింపు ప్రయోజనాలు వర్తిస్తాయని తెలిపారు. ఆర్థిక మంత్రి తీసుకున్న నిర్ణయాల వల్ల కొత్త పన్ను చెల్లింపుదారుల్లో రూ.7 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి రూ.33,800 వరకు ప్రయోజన కలగనుండగా, రూ.10 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రూ.23,400, రూ.15 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రూ.49,400 వరకు ప్రయోజనం చేకూరుతుందని ట్యాక్స్నిపుణులు అంచనా వేస్తున్నారు.

బడ్జెట్ప్రతిపాదనల వల్ల రూ.15.5 లక్షల ఆదాయం దాటిన వారికి కనీసం రూ.52,500 వరకు ప్రయోజనం దక్కనున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆదాయపు పన్ను చట్టంలోని మినహాయింపుల ప్రయోజనాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోగలితే రూ.9.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారి వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

అధిక ఆదాయం ఉన్నవారిపై కరుణ

రూ.కోట్లలో ఆదాయం ఆర్జిస్తున్న వారిపై మోదీ ప్రభుత్వం కరుణ చూపించింది. రూ.2 కోట్ల వార్షికాదాయం దాటిన వారిపై విధించే సర్చార్జీని 37 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. నిర్ణయం వల్ల రూ.5.5 కోట్ల వార్షికాదాయం ఉన్న వారికి రూ.20 లక్షల వరకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటివరకు అధికాదాయం ఉన్న వారిపై ప్రపంచంలోనే అత్యధికంగా 42.7 శాతం పన్నురేటు ఉండేదని, సర్చార్జీ తగ్గించడం వల్ల రేటు 39 శాతానికి పరిమితమైనట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. అదేవిధంగా ఎర్న్డ్లీవులను నగదుగా మార్చుకుంటే పన్ను మినహాయింపు పరిమితిని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రసుత్తం ఉన్న లీవ్ఎన్క్యాష్మెంట్పై రూ.3 లక్షలుగా ఉన్న ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. రూ.5 లక్షలకు పైబడి చెల్లించే అధిక మొత్తం ఉండే బీమా పాలసీలకు వర్తించే పన్ను మినహాయింపులను రద్దు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. నిర్ణయం నుంచి యూనిట్లింక్డ్‌ (యులిప్‌) పాలసీలను మినహాయించారు.

పాత పన్నుల విధానంలో ట్యాక్స్శ్లాబులు

60 ఏళ్ల లోపు వయస్సు ఉంటే..

ఆదాయ పరిమితి

పన్ను రేటు

0–2.5 లక్షలు

లేదు

2.5 – 5 లక్షలు

5%

5–10 లక్షలు

20%

10 లక్షలు దాటితే

30%

60 నుంచి 80 ఏళ్లు..

ఆదాయ పరిమితి

పన్ను రేటు

0–3 లక్షలు

లేదు

3 – 5 లక్షలు

5%

5–10 లక్షలు

20%

10 లక్షలు దాటితే

30%

80 ఏళ్లు దాటితే.. 

ఆదాయ పరిమితి

పన్ను రేటు

0–5 లక్షలు

లేదు

5–10 లక్షలు

20%

10 లక్షలు పైన

30%


నూతన పన్నుల విధానంలో మారిన పన్నుల శ్లాబులు (ఆదాయం రూ.లలో)

ప్రస్తుత శ్లాబులు                                                                    శ్లాబు మార్పు ప్రతిపాదనలు              

ఆదాయ పన్ను

పరిమితి రేటు 

ఆదాయ పన్ను

పరిమితి రేటు 

2.5 లక్షల వరకు

లేదు

0–3 లక్షలు

లేదు

2.5–5 లక్షలు

5%

3–6 లక్షలు

5%

5–7.5 లక్షలు

10%

6–9 లక్షలు

10%

7.5–10 లక్షలు

15%

9–12 లక్షలు

15%

10–12.5 లక్షలు

20%

12–15 లక్షలు

20%

12.5– 15 లక్షలు

25%

15 లక్షలపైన

30%

15 లక్షల పైన

30%

 

 

నూతన, పునరుత్పాదక ఇంధన శాఖకు రూ.37,828.15 కోట్లు 
కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖకు బడ్జెట్లో ప్రభుత్వం రూ.37,828.15 కోట్లు కేటాయించింది. గత ఏడాది బడ్జెట్లో సవరించిన అంచనా(రూ.27,547.47 కోట్లు)తో పోలిస్తే ఇది 37 శాతం అధికం. ఈ శాఖ ఆధ్వర్యంలోని రెండు సంస్థలకు బడ్జెట్లో కేంద్రం భారీ కేటాయింపులు చేసింది. తాజా బడ్జెట్లో ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఐఆర్ఈడీఏ)కి రూ.35,777.35 కోట్లు కేటాయించారు. అలాగే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈసీఐ)కి రూ.2,050.80 కోట్లు కేటాయించారు. ఇంధన రంగంలో కొత్త ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందజేయడానికి ఐఆర్ఈడీఏ 1987లో ఏర్పాటయ్యింది. నేషనల్ సోలార్ మిషన్(ఎన్ఎస్ఎం) అమలు, ఈ రంగంలో లక్ష్యాల సాధన కోసం ఎస్ఈసీఐని 2011లో నెలకొల్పారు.   

ఈవీఎంల కోసం రూ.1,900 కోట్లు కేటాయింపు 


ఎల్రక్టానిక్ వోటింగ్ మెషిన్లు (ఈవీఎం) కొనుగోలు చేయడానికోసం కేంద్ర న్యాయశాఖకు ఈ బడ్జెట్లో దాదాపు రూ.1,900 కోట్లను కేటాయించారు. 2024లో రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ఈవీఎంలను సమకూర్చుకోవడంతోపాటు వాటికి అనుబంధంగా వాడే ఇతర పరికరాల కొనుగోలు చేయడానికి వీలుగా రూ.1,891.78 కోట్లను కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, ఇతర పరకరాలను కొనుగోలు చేయడమేకాక పాతవాటిని తుక్కుకింద మార్చడానికి ఈ నిధులను వినియోగిస్తారు. 2024 సంవత్సరంలో రానున్న లోక్సభ ఎన్నికలతోపాటు ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘానికి నిధులు అవసరమవుతాయని కేంద్ర న్యాయశాఖ ప్రతిపాదించడంతో కేంద్ర కేబినెట్ గత నెలలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈవీఎంలకోసం బడ్జెట్లో నిధులను కేటాయించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్, ఎల్రక్టానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాల నుంచి ఈవీఎంలను కొనుగోలు చేయనున్నారు.   

స్టార్టప్లకు పన్ను మినహాయింపులు 
అంకురసంస్థలకు కేంద్రం మరోసారి ప్రోత్సాహకాలు ప్రకటించింది. కొత్తగా ఏర్పాటయ్యే అంకురసంస్థలకు పన్ను మినహాయింపులు ఇవ్వనున్నట్లు మంత్రి నిర్మల చెప్పారు. 2024 మార్చి నెలలోపు స్థాపించబడిన స్టార్టప్ సంస్థలకు పన్ను మినహాయింపులు కొనసాగుతాయని ఆమె స్పష్టంచేశారు. ‘నష్టాలను తదుపరి ఆర్థిక సంవత్సరానికి ఫార్వార్డ్ చేసే వెసులుబాటును ప్రస్తుతమున్న ఏడేళ్ల నుంచి పదేళ్లకు పెంచుతున్నాం. 2023 మార్చి 31 నుంచి 2024 మార్చి 31వ తేదీదాకా ఆదాయ పన్ను మినహాయింపులు పొందవచ్చు. 2016–17 ఆర్థికసంవత్సర అంచనాలకు ముందు చెరకు రైతులకు ఇచ్చేసిన చెల్లింపులను చక్కెర సహకార సంఘాలు క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం’అని మంత్రి చెప్పారు. దీంతో చక్కెర సహకార సంఘాలకు రూ.10,000 కోట్లమేర లబ్ధిచేకూరనుంది. ‘కొత్త కోపరేటివ్లకూ 15 శాతం పన్ను లబ్ధి దక్కుతుంది. ల్యాబ్లలో తయారయ్యే డైమండ్ల కోసం వినియోగించే ముడి సరకుపై కస్టమ్ సుంకాలను సైతం తగ్గించే యోచనలో ఉన్నాం. ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాల్లోని ఒక్కో సభ్యుడు తీసుకునే రుణం/ డిపాజిట్ చేసే మొత్తానికి రూ.2,00,000ను గరిష్ట పరిమితిగా విధించాలని భావిస్తున్నాం’అని మంత్రి తెలిపారు.  

అమృత్కాల్ అంటే..
అమృత్కాల్లో ప్రవేశపెట్టబడిన తొలి బడ్జెట్ ఇదేనంటూ బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ‘ గత బడ్జెట్ వేసిన పునాదులపై నిర్మించబడిన బడ్జెట్ ఇది. పాతికేళ్లలో వందో స్వాతంత్ర దినోత్సవం జరుపుకోనున్న భారత్కు బ్లూప్రింట్ ఈ పద్దు’ అని ఆమె వ్యాఖ్యానించారు. బడ్జెట్ ప్రసంగంలో విత్తమంత్రి పలు మార్లు ప్రస్తావించిన ‘అమృత్కాల్’పై చర్చ మొదలైంది. అమృత్కాల్ ప్రత్యేకత ఏంటి అనేది ఓసారి పరిశీలిస్తే.. ఢిల్లీలో 2021వ సంవత్సరంలో 75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ తొలిసారిగా ‘అమృత్కాల్’ అనే భావనను తెరమీదకు తెచ్చారు. ‘దేశం 75 స్వేచ్ఛా స్వాతంత్ర వసంతాలు పూర్తిచేసుకుంది. మరో 25 సంవత్సరాల్లో దేశం శత వసంతాలు పూర్తిచేసుకోబోతోంది. అంటే 2021వ ఏడాది నుంచి వచ్చే 25 సంవత్సరాలు దేశానికి అమృతకాలంతో సమానం. ఈ 25 సంవత్సరాల్లోనే భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించి ‘అభివృద్ధి చెందుతున్న దేశం’ నుంచి ‘అభివృద్ధి చెందిన దేశం’గా అవతరించాలి. ఇందుకు అనుగుణంగా పల్లెలు, పట్టణాలకు మధ్య ఉన్న అభివృద్ధి అంతరాలను చెరిపేయాలి. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని దేశంలో డిజిటలైజేషన్ పాత్ర పెంచి ప్రజాజీవితంలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించుకోవాలి. ప్రతీ గ్రామానికి రోడ్డు సౌకర్యం ఉండాలి. ప్రతీ కుటుంబానికి బ్యాంక్ ఖాతా, గ్యాస్ కనెక్షన్, అర్హుడైన పౌరులకు ఆరోగ్య బీమా ఉండాలి. అందరి సమష్టి కృషి, అంకితభావం, త్యాగాల ఫలితంగానే ఇదంతా సాధ్యం. వందల ఏళ్లు బానిసత్వాన్ని చవిచూసిన భారతీయ సమాజం.. కోల్పోయిన వైభవాన్ని తిరిగి సాధించేందుకు మనకు మనం నిర్దేశించుకున్న పాతికేళ్ల లక్ష్యమిది’ అని ఆనాడు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అమృత్కాల్ అనే పదం మన వేదాల్లో ప్రస్తావించబడింది. కష్టాల కడలిని దాటి విజయతీరాలకు చేరుకునే కాలం. కొత్త పని మొదలుపెట్టేందుకు అత్యంత శుభసూచకమైన సమయంగా అమృత్కాల్ను భావిస్తారు. 

డీపీఐఐటీకి రూ.8,200 కోట్లు, ఇండస్ట్రియల్ కారిడార్స్కు రూ.2,000 కోట్లు 
డిజైన్స్, ట్రేడ్ మార్కులు, కాపీ రైట్ ఆఫీస్, కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ వంటి మేధో సంపత్తి హక్కులకు సంబంధించిన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఆర్) ఎకో సిస్టమ్కు బడ్జెట్లో రూ.329 కోట్లు కేటాయించారు. గతేడాది కంటే ఇది 15 శాతం ఎక్కువ. వీటితోపాటు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అపిలేట్ బోర్డ్ (ఐపీఏబీ), ఐపీఆర్ పాలసీ మేనేజ్మెంట్, సీజీపీ, డీటీఎంల్లో మౌలిక వసతుల అభివృద్ధి తదితరాలకు కూడా నిధులను మరింతగా పెంచారు. పేటెంట్, డిజైన్లు, ట్రేడ్ మార్కులు, కాపీరైట్ తదితర చట్టాల వ్యవహారాలను సీజీపీ, డీటీఎం పర్యవేక్షిస్తుంటాయి. 

ఇండ్రస్టియల్ కారిడార్కూ రూ.2,000 కోట్లు.. 
నేషనల్ ఇండ్రస్టియల్ కారిడార్స్కు బడ్జెట్లో రూ.2,000 కోట్లు కేటాయించారు. గతేడాది కంటే ఇది రూ.500 కోట్లు ఎక్కువ. అలాగే పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ)కి రూ.8,200 కోట్ల కేటాయింపులు దక్కాయి. ఇది గతేడాది (రూ.6,725 కోట్లు) కంటే ఏకంగా 22 శాతం ఎక్కువ! స్టార్టప్స్కు ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్ఎఫ్ఎస్)కింద మరో రూ.1,470 కోట్లు దక్కాయి. ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (ఎస్ఐఎస్ఎఫ్ఎస్)ను రూ.10 వేల కోట్ల కార్పస్ నిధితో 2021 ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి ఆపరేటింగ్ ఏజెన్సీగా భారత చిన్న పరశ్రమల అభివృద్ధి బ్యాంకు (ఎస్ఐఈడబీఐ) వ్యవహరిస్తోంది.కాన్సెప్టులకు పరూఫులు, ప్రొటో టైప్ డెవలప్మెంట్, ప్రోడక్ట్ ట్రయల్స్, మార్కెట్ ఎంట్రీ, వాణిజ్యీకరణ తదితర అంశాల్లో స్టార్టప్లకు ఆర్థిక సాయం అందించడం ఎస్ఐఎస్ఎఫ్ఎస్ లక్ష్యం.  

వ్యవసాయం, అనుబంధ రంగాలు

కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో వ్యవసాయ రంగంపై శీత కన్ను వేసింది. గతంలో కంటే గణనీయ స్థాయిలో నిధులకు కోత పెట్టింది. ప్రధాన పథకాలన్నింటికీ కేటాయింపులను తగ్గించి వేసింది. ఇదే సమయంలో దేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని, తృణధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. మత్స్య రంగానికి మాత్రం కాస్త నిధులు ఇచ్చింది. 

వ్యవసాయానికి భారీగా తగ్గిన కేటాయింపులు
202223 బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు కలిపి రూ. 1,51,521 కోట్లను కేటాయించగా.. తాజా బడ్జెట్లో 5% తక్కువగా రూ. 1,44,214 కోట్లకు మాత్రమే ప్రతిపాదించారు.మొత్తంగా బడ్జెట్లో నిధుల కేటాయింపు శాతాన్ని చూస్తే.. వ్యవసాయం, అనుబంధ రంగాలకు గత ఏడాది 3.84% ఇవ్వగా, ఈసారి 3.20 శాతానికి తగ్గి పోయింది. ఫసల్ బీమా యోజన, పీఎం కిసాన్, కృషి వికాస్ యోజన పథకాలకు కేటాయింపులు భారీగా తగ్గిపోయాయి. ఇక పంటలకు గిట్టుబాటు ధర లభించేందుకు తోడ్పడేలా అమల్లోకి తెచ్చిన ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్’కు, పంటలకు మద్దతు ధర లభించేందుకు తెచ్చిన ‘పీఎం–ఆశ’ పథకాలను కేంద్రం పక్కన పెట్టేసింది.
వ్యవసాయానికి రుణ సాయం.. 
దేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు, తక్కువ వడ్డీతో మరిన్ని రుణాలు అందేలా చర్యలు చేపడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. గత ఏడాది (రూ.18 లక్షల కోట్లు) కన్నా 11 శాతం అధికంగా ఈసారి రూ.20 లక్షల కోట్ల మేర పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. బ్యాంకులు పంట రుణాలకు 9 శాతం వడ్డీ వసూలు చేస్తాయని.. కేంద్రం అందులో 2 శాతాన్ని భరిస్తుండటంతో రైతులకు ఏడు శాతం వడ్డీకే రుణాలు అందుతున్నాయని చెప్పారు. రైతులకు ప్రయోజనకరంగా ఉండేందుకు ఎలాంటి తనఖా లేకుండా ఇచ్చే రుణాలను రూ.1.6 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించారు.
 
☛ ఎక్కువ పొడవు పింజ ఉండే పత్తి ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు క్లస్టర్ ఆధారిత విధానాన్ని అనుసరిస్తామని నిర్మల తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ విధానం)తో విత్తనాల నుంచి మార్కెటింగ్ వరకు వ్యాల్యూ చైన్ను ఏర్పాటు చేస్తామన్నారు. 
మత్స్య రంగానికి ఊపు కోసం..
☛ దేశంలో చేపల ఉత్పత్తి, రవాణాను మెరుగుపర్చేందుకు ‘ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన’ కింద రూ.6,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. ఇతర సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ క్రమంలో రొయ్యల దాణా దిగుమతిపై కస్టమ్స్ పన్నును తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. 

ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం.. 
∙ దేశంలో సహజ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతున్నట్టు నిర్మల ప్రకటించారు. ఇందుకోసం వచ్చే మూడేళ్లపాటు దేశవ్యాప్తంగా కోటి మంది రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. పంటలకు అవసరమైన సూక్ష్మ పోషకాలు (ఎరువులు), పురుగు మందులను పంపిణీ చేసేందుకు 10వేల ‘బయో–ఇన్పుట్ రీసోర్స్ సెంటర్’లతో నెట్వర్క్ను ఏర్పాటు చేస్తామన్నారు.
☛ పశు, వ్యవసాయ వ్యర్థాలను సద్వినియోగం చేసుకునేందుకు ‘గోబర్ధన్ (గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో–ఆగ్రో రీసోర్సెస్ ధన్)’ పథకం కింద రూ.10 వేల కోట్లతో కొత్తగా 500 ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సహజవాయువును విక్రయించే అన్ని సంస్థలు తప్పనిసరిగా 5శాతం బయో కంప్రెస్డ్ బయోగ్యాస్ను అందులో చేర్చాలని నిర్ణయించినట్టు తెలిపారు. 

వ్యవసాయానికి బడ్జెట్తీరు ఇదీ.. (రూ. కోట్లలో)..

విషయం

 2022–23లో

2023–24లో

తగ్గింపు/పెంపు

మొత్తం బడ్జెట్

1,51,521

1,44,214

5% తగ్గింపు

ఉపాధి హామీ

73,000

60,000

18% తగ్గింపు

పీఎం కిసాన్

68,000

60,000

13% తగ్గింపు

ఫసల్బీమా

15,500

13,625

12% తగ్గింపు

కృషి వికాస్యోజన

10,433

7,150

31% తగ్గింపు

కృషి ఉన్నతి యోజన

7,183

7,066

2% తగ్గింపు

మార్కెట్ఇంటర్వెన్షన్

1,500

10 లక్షలు

పూర్తిగా కోత

పీఎం ఆశ

1

ఒక లక్ష

పూర్తిగా కోత

‘శ్రీ అన్న’తో తృణధాన్యాల హబ్గా.. 
దేశాన్ని తృణధాన్యాల హబ్గా మార్చేందుకు ‘శ్రీ అన్న’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. హైదరాబాద్లోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్’ను దీనికి వేదికగా ఎంచుకున్నట్టు తెలిపారు. ఇది తృణధాన్యాల ఉత్పత్తి, పరిశోధన, సాంకేతిక అంశాల్లో అత్యుత్తమ విధానాలను అంతర్జాతీయ స్థాయిలో పంచుకునేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా పనిచేస్తుందని వివరించారు. తృణధాన్యాల వినియోగంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని.. ఎందరో చిన్న రైతులు వీటిని పండించి ప్రజల ఆరోగ్యానికి తోడ్పడుతున్నారని వ్యాఖ్యానించారు. 
హైదరాబాద్ ఐఐఎంఆర్ ఏంటి? 
దేశంలో తృణధాన్యాల దిగుబడి పెంచడం, కొత్త వంగడాల రూపకల్పన కోసం 
హైదరాబాద్లో ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (ఐఐఎంఆర్)’ను ఏర్పాటు చేశారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) పరిధిలో ఇది పనిచేస్తుంది. జొన్నలు, సజ్జలు, రాగులు, సామలు వంటి తృణధాన్యాల పంటలపై ఇక్కడ పరిశోధనలు చేస్తారు. ఐఐఎంఆర్ దేశ విదేశాలకు చెందిన తృణధాన్యాల సంస్థలతో కలిసి పనిచేస్తుంది కూడా.

భూమిని కాపాడేందుకు ‘పీఎం–ప్రణామ్’! 
ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగం, పురుగు మందుల వాడకాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ‘ప్రధాన మంత్రి ప్రోగ్రామ్ ఫర్ రీస్టోరేషన్, అవేర్నెస్, నరి‹Ùమెంట్ అండ్ అమెలియరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్ (పీఎం–ప్రణామ్)’ పథకాన్ని చేపడుతున్నట్టు నిర్మల తెలిపారు. ఈ దిశగా చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. 
☛ ఉద్యాన పంటల కోసం.. తెగుళ్లు సోకని, నాణ్యమైన మొక్కలను అందుబాటులో ఉంచేందుకు రూ.2,200 కోట్లతో ‘ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్’ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. 
☛ గ్రామీణ ప్రాంతాల్లో యువ పారిశ్రామికవేత్తలు ‘అగ్రి స్టార్టప్స్’ను నెలకొల్పేలా ప్రోత్సహించేందుకు ‘అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ (ఏఏఎఫ్)’ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. 
☛ వ్యవసాయ రంగంలో రైతు ఆధారిత, సమ్మిళిత పరిష్కారాల కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. 
☛ ‘మిష్తి’ పథకం కింద దేశవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో మడ అడవులను పెంచనున్నట్టు తెలిపారు.


పల్లెకు నిధులు కట్!
మౌలిక రంగాన్ని పరుగులు పెట్టిస్తామంటూ భారీగా పెట్టుబడి నిధులను కేటాయించిన మోదీ సర్కారు.. గ్రామీణాభివృద్ధి విషయంలో ఈసారి కాస్త చిన్నచూపు చూసింది. ప్రధానమైన కేంద్ర ప్రాయోజిత పథకాలకు (ఫ్లాగ్షిప్) నిధుల కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయింపులు (సవరించిన అంచనా) రూ. 1,81,121 కోట్లు కాగా, 2023–24 బడ్జెట్లో కేటాయింపులను 13 శాతం మేర తగ్గించి రూ.1,57,545 కోట్లకు పరిమితం చేసింది. ప్రధానంగా ఉపాధి హామీ పథకంలో భారీగా కోత పెట్టడం గమనార్హం.

ఉపాధి ‘హామీ’కి కోత..
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కేటాయింపుల్లో భారీగా కోత పడింది. 2022–23లో కేటాయింపుల సవరించిన అంచనా రూ.89,400 కోట్లతో పోలిస్తే 32 శాతం మేర తగ్గించేశారు. కాగా, 2022 జూలై–నవంబర్ కాలంలో ఈ స్కీమ్ కింద పనులు చేసేందుకు ముందుకొచ్చిన కార్మికుల సంఖ్య కోవిడ్ ముందస్తు స్థాయిలకు చేరినట్లు తాజా ఆర్థిక సర్వే పేర్కొనడం గమనార్హం.
 • 2023–24 కేటాయింపు: రూ.60,000 కోట్లు
 • 2022–23 కేటాయింపు: రూ.73,000 కోట్లు (సవరించిన అంచనా రూ.89,400 కోట్లు)

గ్రామీణ రోడ్లు.. జోరు తగ్గింది (పీఎంజీఎస్వై)
గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలను మరింత మెరు గుపరిచేందుకు రోడ్ల నిర్మాణం కోసం కేంద్రం నిధులు వెచ్చి స్తోంది. అయితే, తాజా బడ్జెట్లో ఈ ఫ్లాగ్షిప్ స్కీమ్కు కేటాయింపులను మాత్రం పెంచలేదు. 2023–24లో 38,000 కిలోమీటర్ల మేర పక్కా రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
 • 2023–24 కేటాయింపు: రూ.19,000 కోట్లు
 • 2022–23 కేటాయింపు: రూ.19,000 కోట్లు 

ఇంటికి ఓకే.. (పీఎంఏవై) 
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి పెద్దపీట వేసేలా తాజా బడ్జెట్లో కొంత మెరుగ్గానే కేటాయింపులు జరిపారు. ప్రధానంగా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఫండ్ తరహాలోనే పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఫండ్ను నెలకొల్పుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ప్రకటించారు. ఏటా రూ.10,000 కోట్లను ఈ ఫండ్కు ఖర్చు చేస్తామని, దీన్ని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నిర్వహిస్తుందని ప్రకటించారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో బలహీన వర్గాలకు 2023–24లో 57.33 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. పట్టణ ప్రాంతాల్లో దాదాపు 20 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం.
 • 2023–24 కేటాయింపులు: రూ.79,590 కోట్లు (గ్రామీణ–పట్టణ ప్రాంతాలతో కలిపి)
 • 2022–23 కేటాయింపులు: రూ.48,000 కోట్లు (సవరించిన అంచనా రూ.77,130 కోట్లు)

స్వచ్ఛ భారత్ మిషన్..
దేశంలో బహిరంగ మలమూత్ర విసర్జన (ఓడీఎఫ్)ను పూర్తిగా తుడిచిపెట్టడానికి 2014లో ఆరంభమైన ఈ స్వచ్ఛ భారత్ పథకం (ఎస్బీఎం) కిందికి ఘన వర్ధాల (చెత్త నిర్మూలన), జల వ్యర్థాల నిర్వహణను కూడా తీసుకొచ్చారు. ఈ పథకానికి మాత్రం తాజా బడ్జెట్లో కేటాయింపులు పెంచారు. కాగా, పట్టణ ప్రాంతాల్లో 2023–24లో 13,500 కమ్యూనిటీ/పబ్లిక్ టాయిలెట్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే, 3 లక్షల గ్రామాలను ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీరు నిర్వహణ కిందికి తీసుకురావాలనేది కేంద్రం లక్ష్యం.
 • 2023–24 కేటాయింపు: రూ.12,192 కోట్లు (గ్రామీణ–పట్టణ ప్రాంతాలతో కలిపి)
 • 2022–23 కేటాయింపు: రూ.9,492 కోట్లు (సవరించిన అంచనా రూ.7,000 కోట్లు)

తాగునీటికి నిధుల పెంపు.. 
స్వచ్ఛమైన తాగునీటిని అందరికీ అందించేందుకు 2019–20లో జల్ జీవన్ మిషన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ను ప్రకటించారు. దీనిలో భాగంగా 2023–24లో 4 కోట్ల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకు తాజా బడ్జెట్లో నిధుల కేటాయింపులను పెంచారు.
 • 2023–24 కేటాయింపు: రూ.70,000 కోట్లు
 • 2022–23 కేటాయింపు: రూ.60,000 కోట్లు (సవరించిన అంచనా రూ.55,000 కోట్లు)

భారత్ నెట్..
భారత్ నెట్ కింద దేశంలోని పల్లెలన్నింటికీ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ను ఏర్పాటు చేయాలనేది కేంద్రం లక్ష్యం. దీనిలో భాగంగా 2023–24లో 17,000 గ్రామ పంచాయితీలను కొత్తగా హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ద్వారా అనుసంధానించనున్నారు. అలాగే 78,750 కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ను వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5,50,000 ఫైబర్–టు–హోమ్ కనెక్షన్లు కూడా ఇవ్వాలనేది లక్ష్యం. 

రహదారులపై ప్రగతి పయనం
ఎన్హెచ్ఏఐకు 2022–23 బడ్జెట్లో కేంద్రం రూ.1.42 లక్షల కోట్లు కేటాయించగా, 2023–24 బడ్జెట్లో రూ.1.62 లక్షల కోట్లు కేటాయించింది. ఈసారి కేటాయింపులను రూ.20,000 కోట్లు(13.90 శాతం) పెంచింది. జాతీయ రహదారుల రంగానికి 2022–23లో రూ.1.99 లక్షల కోట్లు కేటాయించగా, దీన్ని తర్వాత రూ.2.17 లక్షల కోట్లుగా సవరించింది. తాజా బడ్జెట్లో ఈ రంగానికి రూ.2.70 లక్షల కోట్లు కేటాయించడం గమనార్హం. 

 • ఎన్హెచ్ఏఐకి  రూ.1.62 లక్షల కోట్లు  
 • జాతీయ రహదారుల నిర్మాణానికి  రూ.2.70 లక్షల కోట్లు  

పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ఫండ్ 
టైర్–2, టైర్–3 పట్టణాల మౌలిక వసతుల అభివృద్ధికి ఏటా రూ. 10 వేల కోట్లు కేటాయించేలా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (యూఐడీఎఫ్)ను ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (ఆర్ఐడీఎఫ్) తరహాలో యూఐడీఎఫ్ను ఏర్పాటు చేస్తామని, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ దీని నిర్వహణ చేపడుతుందని తెలిపారు. ఈ నిధులను మౌలిక వసతుల కల్పనకు టైర్–2 (50 వేల నుంచి లక్ష జనాభా), టైర్–3 (20 వేల నుంచి 50 వేల జనాభా) పట్టణాల్లోని ప్రభుత్వ సంస్థలు వినియోగిస్తాయని తెలిపారు. రేపటి స్థిరమైన నగరాలుగా అభివృద్ధి చేసేందుకు పట్టణ ప్రణాళికల్లో సంస్కరణను ప్రోత్సహిస్తామని, ఇందులో భాగంగా సమర్థవంతంగా భూ వనరుల వినియోగం, మౌలిక వసతులకు చాలినంత వనరులు, రవాణా అభివృద్ధి, అందుబాటులో పట్టణ భూమి వనరులు, అందరికీ అవకాశాలు అనేవి ఉంటాయని తెలిపారు. ఇక అన్ని పట్టణాల్లో సీవరేజీ, సెప్టిక్ ట్యాంకుల విషయంలో మ్యాన్హోల్ నుంచి మెషీన్–హోల్గా మారేలా చర్యలు చేపడతామన్నారు. వృత్తాకార ఆర్థిక వ్యవస్థ ప్రోత్సాహంలో భాగంగా గోబర్ధన్ పథకాన్ని ఏర్పాటు చేసి 500 వరకూ “వేస్ట్ టు వెల్త్’ప్లాంట్లను ప్రారంభిస్తామన్నారు. దీనిలో భాగంగా ఏర్పాటు చేసే 200 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లలో 75 ప్లాంట్లను పట్టణ ప్రాంతాల్లో నిర్మిస్తామని, అలాగే 300 కమ్యూనిటీ లేక క్లస్టర్ బేస్డ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనికి రూ. 10 వేల కోట్ల పెట్టుబడిని కేటాయించారు. సహజ, బయోగ్యాస్ను ప్రోత్సహించడంలో భాగంగా అన్ని సంస్థల్లో 5 శాతం ఈ గ్యాస్ను వినియోగించేలా తప్పనిసరి చేస్తామని చెప్పారు.

సహకారానికి పన్ను ఊరట
దేశంలో సహకార రంగానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు కేంద్రం పన్ను రాయితీలను ప్రకటించింది. అయితే ఇదే సమయంలో ఈ శాఖకు నిధుల్లో కోత పెట్టింది. 2022–23 సవరించిన అంచనాల మేరకు సహకారశాఖకు కేటాయింపులు రూ.1,624.74 కోట్లు కాగా.. తాజా బడ్జెట్లో 1,150.38 కోట్లే ఇచ్చింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్), రూరల్ డెవలప్మెంట్ బ్యాంకుల సభ్యులు సొసైటీల్లో నగదు ఉప సంహరణపై 2 లక్షల పరిమితిని విధించింది.  

పన్ను రాయితీతో.. 
సహకార రంగంలో ఉత్పత్తిని పెంచేందుకు, కొత్త సొసైటీలను ప్రోత్సహించేందుకు కేవలం 15 శాతం పన్నునే వసూలు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. 2023 ఏప్రిల్ తర్వాత ఏర్పాటై, 2024 మార్చి చివరిలోగా ఉత్పత్తి ప్రారంభించే సొసైటీలకు ఇది వర్తిస్తుందని ప్రకటించారు. సొసైటీలకు నగదు విత్డ్రాపై టీడీఎస్ విధింపు పరిమితిని ఒక ఏడాదిలో రూ.3 కోట్లకు పెంచుతున్నట్టు వివరించారు. సహకారంతో సమృద్ధి’నినాదంలో భాగంగా 63 వేల ప్యాక్స్ను రూ.2,516 కోట్లతో కంప్యూటీకరించినట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా సహకార సొసైటీలతో కూడిన డేటాబేస్ను సిద్ధం చేస్తామని.. దీని ఆధారంగా భారీగా గోదాములను నిర్మిస్తామని చెప్పారు. రైతులు తమ ఉత్పత్తులకు మంచి ధర వచ్చేదాకా నిల్వ చేసుకోవచ్చని తెలిపారు.   

జీడీపీలో ఇవి పవర్ఫుల్
ఏదైనా ఒక దేశం/ప్రాంతంలో ఒక ఏడాది మొత్తంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు, సేవల విలువను కలిపి ‘జీడీపీ (గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్)’ అంటారు. ఎంత ఎక్కువ జీడీపీ ఉంటే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆ దేశం అంత ప్రభావవంతమైనదని చెప్పుకోవచ్చు. ‘ప్రపంచ ఆర్థిక సంస్థ (ఐఎంఎఫ్)’ తాజా గణాంకాల ప్రకారం ప్రపంచంలోని సుమారు 200 దేశాల జీడీపీలను కలిపి చూస్తే.. అందులో సగం కేవలం యూఎస్, చైనా, జపాన్, జర్మనీ, 
ఇండియాల వాటానే కావడం గమనార్హం. ఇంకా చెప్పుకోవాలంటే కేవలం యూఎస్, చైనాల వాటానే 40 శాతం దాకా ఉంటుంది.

మిషన్ ‘గ్రీన్ ఎనర్జీ’ 


కర్బన ఉద్గారాలను అరికట్టి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు 2030 నాటికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 4,000 ఎండబ్ల్యూహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీని ప్రోత్సహిస్తామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ చట్టంలో గ్రీన్ క్రెడిట్ కార్యక్రమాన్ని చేరుస్తామన్నారు. ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరి 4వ తేదీన రూ.19,744 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగం, ఎగుమతులను పెంచడంతోపాటు 2030 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించేలా ఈ మిషన్ దోహదం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్ వినియోగానికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో కర్బన ఉద్గారాలను అరికట్టే ప్రక్రియ దేశానికి ఇంధన భద్రతతోపాటు ఆర్థిక పురోగతికి ఉపకరిస్తుందని ఆర్థిక సర్వే పేర్కొంది.   

ఆన్లైన్ గేమ్స్ సంపాదనపై 30 శాతం టీడీఎస్

బడ్జెట్లో కొత్త ప్రతిపాదన  ఆన్లైన్ గేమ్స్లో సంపాదించే డబ్బుపై 30 శాతం టీడీఎస్ (మూలం వద్ద పన్ను విధింపు) విధించాలని కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించింది. అలాగే ప్రస్తుతం టీడీఎస్లో ఇప్పుడున్న రూ.10వేల పరిమితి (థ్రెషోల్డ్ లిమిట్)ని తొలగించనున్నట్లు చెప్పింది. ఒకవేళ యూజర్ ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించకపోతే ఆర్థిక సంవత్సరం చివరిలో ఈ టీడీఎస్ కోత విధిస్తారు. ఇంటర్నెట్ గేమ్స్లో గెలుపొందే సంపాదనపై పన్ను విధిస్తామని రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా బడ్జెట్ అనంతరం మీడియాకు వెల్లడించారు. కొన్ని ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు థ్రెషోల్డ్ పరిమితి కన్నా తక్కువున్న డబ్బును యూజర్స్ నుంచి తీసుకుంటున్నట్లు పన్నుల శాఖ దృష్టికి వచ్చిందని, ఈ డబ్బు టీడీఎస్ పరిధిలోకి రావడంలేదని చెప్పారు. దేశంలో ఆన్లైన్ గేమింగ్ బాగా విస్తరించిందని, 2025 నాటికి దేశంలో మొబైల్ గేమింగ్ రంగం నుంచి వచ్చే ఆదాయం 5 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని నంగియా అండర్సన్ ఎల్ఎల్పీ భాగస్వామి సుదిన్ సబ్నిస్ చెప్పారు. అందువల్ల ఆన్లైన్ గేమింగ్స్ నుంచి వచ్చే మొత్తంపై ఆదాయంపై యూజర్ల నుంచి పన్ను విధించాలని బడ్జెట్లో ప్రతిపాదించారన్నారు. ఆన్లైన్ గేమింగ్స్కు టీడీఎస్కు సంబంధించి రెండు సెక్షన్లు 115 బీబీజే, 194 బీఏలను కొత్తగా తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. 

ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటే? 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ (ఎల్డీజీ)ను అభివృద్ధి చేసేందుకు ఐఐటీల్లో ఒక దానికి ఐదేళ్లపాటు పరిశోధన గ్రాంట్ను అందిస్తామని ప్రకటించారు. దేశీయంగా ల్యాబ్ తయారీ వజ్రాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 
ఇంతకీ ఎల్డీజీలు అంటే ఏమిటి? 
భూగర్భంలో లభించే వజ్రాలను అచ్చుగుద్దినట్లుగా ల్యాబ్లలో నిర్దిష్ట సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కృత్రిమంగా తయారు చేసే వాటినే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటారు. వీటిని తయారు చేసేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నప్పటికీ సాధారణంగా, అత్యంత చౌకగా ఎల్డీజీలను అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రత పద్ధతిలో తయారు చేస్తారు. గ్రాఫైట్ను ‘డైమండ్ సీడ్’గా ఉపయోగిస్తూ దాన్ని 7.30 లక్షల పీఎస్ఐ పీడనానికి, సుమారు 1500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకు గురిచేస్తే భౌతికంగా, రసాయనపరంగా అచ్చం సహజ వజ్రాలను పోలిన వజ్రం ల్యాబ్లో తయారవుతుంది. ఎల్డీజీలను సాధారణంగా పారిశ్రామిక అవసరాల కోసం యంత్రాలు, పనిముట్లలో ఉపయోగిస్తారు. అయితే సాధారణ వజ్రాల్లాగానే ఎల్డీజీలను సైతం మెరుపు కోసం కట్టింగ్, పాలిషింగ్ వంటి ప్రక్రియలకు లోనుచేయాల్సి ఉంటుంది. దీనివల్ల విదేశాల నుంచి ముడి వజ్రాల దిగుమతులను గణనీయంగా తగ్గించుకోవచ్చు. అదే సమయంలో కట్టింగ్, పాలిషింగ్ కోసం దేశీయంగా ఉన్న వజ్రాల పరిశ్రమకు మరింత ఉపాధి 
కల్పించడం వీలవుతుంది.  
 
పౌర విమానయాన శాఖకు రూ. 3,113 కోట్లే! 
పౌర విమానయాన శాఖకు గతేడాదితో పోలిస్తే 2023–24 బడ్జెట్లో సగానికిపైగా కేటాయింపులు తగ్గాయి. ఎయిర్ ఇండియాకు చెందిన ఆస్తుల కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికల్ ‘ఎయిర్ఇండియా అసెట్ హోల్డింగ్ లిమిటెడ్’(ఏఐఏహెచ్ఎల్)కు కేటాయింపుల్లో భారీ కోత పెట్టడంతో ఈ శాఖకు మొత్తంమీద రూ. 3,113.36 కోట్ల మేర మాత్రమే కేటాయింపులు లభించాయి. ఇందులో ఏఐఏహెచ్ఎల్కు రూ. 1,114.49 కోట్లను కేంద్రం కేటాయించింది. 2022–23 బడ్జెట్లో ఏఐఏహెచ్ఎల్కు తొలుత రూ. 9,259.91 కోట్లు కేటాయించిన కేంద్రం... ఆ తర్వాత సవరించిన బడ్జెట్ అంచనాల్లో ఆ మొత్తాన్ని రూ. 7,200 కోట్లకు తగ్గించింది. 2022–23 బడ్జెట్లో పౌర విమానయాన శాఖకు మొత్తంగా రూ. 10,667 కోట్లు కేటాయించినప్పటికీ సవరించిన బడ్జెట్ అంచనాల్లో దాన్ని రూ. 9,363.70 కోట్లకు పరిమితం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియా నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవడంతో టాటా గ్రూప్ ఆ సంస్థను గతేడాది జనవరిలో చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. 
విమానయాన రంగానికి సంబంధించిన ఇతర కేటాయింపులు.. 
∙ ప్రాంతీయ గగనయాన అనుసంధానత కోసం రూ. 1,244.07 కోట్లు 
∙ పౌర విమానయాన డైరెక్టరేట్కు రూ. 73 కోట్లు 
∙ పౌర విమానయాన భద్రతా బ్యూరోకు రూ. 309 కోట్లు  

వ్యవసాయానికి డిజిటల్ ప్లాట్ఫామ్
ఈ ఏడాది బడ్జెట్లో ‘వ్యవసాయం’కోసం డిజిటల్ రూపంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. నాణ్యమైన ఇన్పుట్స్ (విత్తనాలు, ఎరువులు తదితరాలు) రైతులకు లభించేందుకు మాత్రమే కాకుండా.. పండిన పంటకు జరిగే నష్టాలను నివారించేందుకు అవకాశాలు మెరుగు అవుతాయి. తగిన సమాచారం అందుబాటులో లేని కారణంగా రుణాలిచ్చేందుకు తటపటాయించే బ్యాంకులు కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ ఆధారంగా రైతులకు అవసరమైనంత స్థాయిలో రుణా లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. పంటల ఆరోగ్యంపై, ఇన్పుట్ల ఖర్చు, నేల సారం, ధరలు, ఉత్పత్తుల నాణ్యత వంటి అనేక అంశాల సమాచారం ఈ ప్లాట్ఫామ్ ద్వారా బ్యాంకర్లకు అందుతుందని అంచనా. వీటి ద్వారా రైతుల రుణ అర్హతలనూ నిర్ణయించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. జన్ధన్ ఖాతాలు, డిజిటల్ పేమెంట్ల కారణంగా ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నేరుగా నగదు రూపంలోనే సాయం అందిస్తున్న విషయం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది.  

దేశం కోసం.. దేశంలోనే.. కృత్రిమ మేధ
గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు కృత్రిమ మేధ,మెషీన్ లెర్నింగ్ వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. గూగూల్కు చెందిన ‘ఇండియ రీసెర్చ్ ల్యాబ్కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ల సాయంతో ఆరోగ్య రంగాన్ని మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా.. ప్రజా ఆరోగ్య రంగం, వన్యప్రాణి సంరక్షణ, వ్యాధుల నివారణ వంటి అనేక అంశాల్లో కృత్రిమ మేధను వాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
కృత్రిమ మేధ వినియోగాన్ని మరింత విస్తృతం చేసేందుకు దేశంలో మూడు అత్యున్నత నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలు మూడింటిలో వీటి ఏర్పాటు జరుగుతంది. వ్యవసాయం, ఆరోగ్యం, సస్టెయినబుల్ సిటీస్ రంగాల్లో పరిశోధనలు తద్వారా ఆయా రంగాల్లోని సమస్యలకు అత్యాధునిక టెక్నాలజీ పరిష్కారాలు కనుక్కునేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడతాయి. ఇందుకు పరిశ్రమ వర్గాలు తమవంతు తోడ్పాటునందిస్తాయి. ‘‘కృత్రిమ మేధ రంగంలో మానవ వనరులను అభివృద్ధి చేసేందుకు, దేశంలో సమర్థమైన కృత్రిమ మేధ వ్యవస్థ ఒకటి ఏర్పాటయ్యేందుకు’ఈ మూడు కేంద్రాలు ఉపకరిస్తాయి’’అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ కేంద్రాల ఏర్పాటు వల్ల విద్యార్థులు మరింత ఎక్కువ మంది కృత్రిమ మేధ కోర్సులకు మొగ్గు చూపుతారని, దేశ అభివృద్ధికి మేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

5జీ కోసం వంద ల్యాబ్లు..


టెలి కమ్యూనికేషన్స్, 5జీ టెక్నాలజీల్లో గత ఏడాది డిమాండ్ 33.7 శాతం వరకూ పెరిగింది. 2022–23లోనే ఈ రంగాల్లో 1.3 లక్షల ఉద్యోగాలకు డిమాండ్ ఉండగా.. ఏటికేడాదీ ఇది పెరుగుతోంది. 5జీ రంగంలో కొత్తగా ఏర్పాటయ్యే ల్యాబ్ల వల్ల యూనివర్సిటీల్లో పరిశోధనలు మరింత ఊపందుకుంటాయి. మరిన్ని ఉద్యోగావకాశాలను సృష్టించనున్నాయి. డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా కేంద్రం గత ఏడాది దేశంలో 5జీ సర్వీసులను మొదలుపెట్టింది. వేగవంతమైన నెట్వర్క్తోపాటు అనేక ఇతర లాభాలు తెచ్చిపెట్టగల ఈ 5జీ టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకునేందుకు దేశంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో వంద ల్యాబ్ లు ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తాజాగా ప్రకటించారు. స్మార్ట్ క్లాస్రూమ్లు, ప్రిసిషన్ ఫార్మింగ్, తెలివైన రవాణా వ్యవస్థలతోపాటు ఆరోగ్య రంగంలో ఉపయోగపడే అప్లికేషన్లను తయారు చేయడం వీటి లక్ష్యం. బ్యాంకులు, వివిధ నియంత్రణ సంస్థలు, ఇతర వ్యాపార వర్గాలు కూడా ఈ ల్యాబ్ కార్యకలాపాల ద్వారా లాభపడే అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం సుమారు 225 ప్రాంతాల్లో ఈ 5జీ టెక్నాలజీ అందుబాటులో ఉంది. 5జీ టెక్నాలజీలపై పరిశోధనలకు గాను ఈ ఏడాది రూ. 5.56 కోట్లు కేటాయించారు. గత ఏడాది ఈ కేటాయింపులు రూ.7.74 కోట్లు. 

నైపుణ్యాల వృద్ధికి భారీ ఊతం
స్కిల్ ఇండియా కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 1.0 పేరుతో 2015లో మొదలైన విషయం తెలిసిందే. దాదాపు 20 కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు స్కిల్ ఇండియాలో భాగంగా పలు నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నాయి. అవసరమైన సందర్భాల్లో వాటిని మరింత ఆధునికీకరించడం కూడా చేస్తున్నాయి. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 2.0 2017లో, మూడో దఫా 2021లోనూ మొదలయ్యాయి. 
రేపటి తరం కొత్త టెక్నాలజీల్లో దేశ యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఈ ఏడాది బడ్టెట్లో ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఇందులో భాగంగా వివిధ రకాల నైపుణ్యాలను అందించనున్నారు. కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ ఇవ్వడంతోపాటు, శిక్షణ పొందిన వారిని, కంపెనీలను ఒకచోటకు చేర్చడమూ ఈ ప్లాట్ఫామ్ ద్వారా జరుగుతాయి. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలకూ ప్రాధాన్యం లభించనుంది. నేషనల్ అప్రెంటిషిప్ ప్రమోషన్ స్కీమ్లో భాగంగా రానున్న మూడేళ్లలో 47 లక్షల మంది యువతకు నేరుగా ఆన్లైన్ పద్ధతిలో స్టైఫండ్ అందించనున్నారు. 
అంతేకాకుండా.. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0లో భాగంగా కోడింగ్, కృత్రిమ మేధ, మెకట్రానిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, త్రీడీ ప్రింటింగ్ డ్రోన్స్ ఇతర సాఫ్ట్ స్కిల్స్ను అందిస్తారు. అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు దేశం మొత్తమ్మీద 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ కేంద్రాల ఏర్పాటు జరుగుతుంది.  

నేషనల్ డేటా గవర్నెన్స్ పాలసీ
డిజిలాకర్లో ప్రస్తుతం మనం పలు రకాల డాక్యుమెంట్లను స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. ఆధార్, పర్మనెంట్ అకౌంట్ నెంబరు (పాన్)లతోపాటు డ్రైవింగ్ లైసెన్స్, విద్యార్హతల డాక్యుమెంట్లను ఇక్కడ నిక్షిప్తం చేసుకోవచ్చు. ఇప్పటివరకూ వీటిని చూడగలిగే అవకాశం కొన్ని సంస్థలకు మాత్రమే ఉండగా.. కొత్త డేటా గవర్నెన్స్ పాలసీ కారణంగా మరిన్ని ఎక్కువ సంస్థలు అవసరాన్ని బట్టి చూడగలిగే అవకాశం ఏర్పడుతుంది.  
ఆర్థిక రంగ సంస్థలకు భారీగా ఉపయోగపడేలా కేంద్రం ఈ ఏడాది నేషనల్ డేటా గవర్నెన్స్ విధానం ఒకదాన్ని తీసుకు రానుంది. ఈ విధానం వల్ల స్టార్టప్ కంపెనీల్లో మరింత అధిక సంఖ్యలో సృజనాత్మక ఆవిష్కరణలు జరుగుతాయని, విద్యా సంస్థల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇప్పటివరకూ అందుబాటులో లేని సమాచారం డేటా గవర్నెన్స్ పాలసీ కారణంగా నిర్దిష్ట సంస్థలకు అందుబాటులోకి వస్తుందని, వివిధ సంస్థలు ‘నో యువర్ కస్టమర్’లేదా కేవైసీ కోసం ఎక్కువ ప్రయాస పడాల్సిన అవసరం లేకుండా పోతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కేవైసీలో భాగంగా అందరూ ఆధార్ వంటి వివరాలు మాత్రమే అడుగుతున్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే కంపెనీలు, బ్యాంకులు తమకు ఎదురయ్యే రిస్క్ ఆధారంగా ఇతర డాక్యుమెంట్లను కూడా కోరవచ్చు లేదా డిజిలాకర్ నుంచి తీసుకోవచ్చు. వ్యక్తులు డిజిలాకర్లో ఉంచుకున్న డాక్యుమెంట్లను కూడా అవసరాలకు తగ్గట్టుగా కొన్ని నియంత్రణ, ఆర్థిక సంస్థలకు అందుబాటులోకి తేనున్నారు.  

డిజిటల్కు కేటాయింపుల తగ్గింపు?
ఈ ఏడాది బడ్జెట్లో డిజిటల్ ఇండియా కార్యక్రమాలకు మొత్తం రూ.4785 కోట్లు కేటాయించారు. అయితే ఇది గత ఏడాది కేటాయింపుతో పోలిస్తే 37 శాతం తక్కువ. గత ఏడాది మొత్తం రూ.7603.5 కోట్ల కేటాయింపులు డిజిటల్ ఇండియా కార్యక్రమానికి జరిగింది. ముందుగా రూ.10,676 కోట్ల కేటాయింపులు జరిగినా సవరణల తరువాత ఈ మొత్తం తగ్గింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ డిజిటల్ ఇండియా కార్యకలాపాలను చేపడుతుందన్న విషయం తెలిసిందే. ప్రతి పౌరుడికి హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకు రావడం, జీవితాంతం పనిచేసే ఐడెంటిటీ (ఆధార్, యూపీఐ, పాన్ వంటివి) అందించడం ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగం. అలాగే... ప్రభుత్వ సేవలను డిజిటల్ టెక్నాలజీల సాయంతో అందివ్వడం, అన్ని భాషల్లోనూ ఈ టెక్నాలజీ ఫలాలు అందుబాటులో ఉండేలా చేయడం కూడా ఇందులో భాగంగానే చేస్తున్నారు.   

అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు 
ఈ ఏడాది మేలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2023–24లో పెద్దపీట వేశారు. ముఖ్యంగా కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఎగువ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరుతున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు ఏకంగా రూ.5,300 కోట్ల గ్రాంట్ను ప్రకటించారు. ‘‘కర్ణాటకలోని కరువుపీడిత మధ్య ప్రాంతాలను సస్యశ్యామలం చేసే ఎగువ భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్ల సాయాన్ని అందిస్తాం’’అని సీతారామన్ తన ప్రసంగంలో తెలిపారు. తుంగ నది నుంచి 17.40 టీఎంసీల నీటిని భద్ర రిజర్వాయర్లోకి ఎత్తిపోయడంతోపాటు భద్ర జలాశయం నుంచి 29.90 టీఎంసీలను ఎగువ భద్రలోకి ఎత్తిపోయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. నిర్మలా సీతారామన్ ప్రకటనపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హర్షం వ్యక్తం చేశారు. యావత్ కర్ణాటక ప్రజల తరఫున కేంద్ర మంత్రికి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు.  

రైల్వే రంగానికి రూ.2.40 లక్షల కోట్లు కేటాయింపు 


కేంద్ర బడ్జెట్లో రైల్వేకు గతంలో ఎన్నడూ లేనంతగా పెద్దపీట వేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.40 లక్షల కోట్లు కేటాయించారు. 2013–14తో పోలిస్తే ఇది తొమ్మిది రెట్లు అధికం. బొగ్గు, ఎరువులు, ఆహార ధాన్యాలు తదితర సరుకుల రవాణా కోసం మౌలికవసతుల కల్పనకు 100 కీలక ప్రాజెక్టులు గుర్తించామని నిర్మల చెప్పారు. వీటిని రూ. 75 వేల కోట్ల పెట్టుబడితో ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామన్నారు. దీనిలో రూ. 15 వేల కోట్లు ప్రైవేట్ వర్గాల నుంచి సేకరించనున్నట్లు వెల్లడించారు. 
ప్రీమియర్ రైళ్లలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందనే అంచనాతో రాజధాని, శతాబ్ది, దురంతో, హమ్సఫర్, తేజస్ వంటి రైళ్లలో 1,000కి పైగా కోచ్లను ఆధునీకరించాలని రైల్వే శాఖ ప్రతిపాదించింది. ఈ కోచ్ల లోపలి భాగాల్లో అధునాతన సౌకర్యాల కల్పనతో పాటు వాటిని సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది.  

మరిన్ని వందేభారత్ రైళ్లు..
దేశవ్యాప్తంగా పలు రైళ్ల వేగం పెంచడంతో పాటు మరిన్ని మార్గాల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టడం కోసం ట్రాక్లను మార్చడానికి పెద్దఎత్తున నిధులు కేటాయించనున్నారు. అయితే వందేభారత్ రైళ్ల కోసం ట్రాక్ల ఆధునీకరణకు గత బడ్జెట్ సవరించిన అంచనాల మేరకు రూ. 15,388.05 కోట్లు కేటాయించగా.. ఈ బడ్జెట్లో దానిని రూ. 17,296.84 కోట్లుగా ప్రతిపాదించారు. దేశవిదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా మరో 100 విస్టాడోమ్ కోచ్లను అందుబాటులోకి తీసుకురావాలని, కొత్తగా 35 హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైళ్లు, నూతన డిజైన్తో కూడిన 4,500 అటోమొబైల్ క్యారియర్ కోచ్లు, 5,000 ఎల్హెచ్బీ కోచ్లు, 58,000 వ్యాగన్లు తయారు చేయాలని తాజా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. గత ఏడాది(2022–23) బడ్జెట్లో రైల్వే శాఖకు మొత్తం 1.4 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో పెట్టుబడి వ్యయం రూ.1.37 లక్షల కోట్లు కాగా.. రూ. 3,267 కోట్లు రెవెన్యూ వ్యయం. కాగా, 2023–24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ పేపర్ల అంచనా ప్రకారం నెట్ రెవెన్యూ వ్యయం రూ. 2.65 లక్షల కోట్లుగా ఉంది. అయితే ఇది 2022–23 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల మేరకు రూ. 2,42,892.77 కోట్లుగా ఉంది. 
నిర్వహణ నష్టాలకు తక్కువగా..  
ఈ బడ్జెట్ అంచనాల మేరకు వ్యూహాత్మక మార్గాల్లో నిర్వహణ నష్టాలకు రీయింబర్స్మెంట్ నిధులు రూ. 487.51 కోట్లుగా ఉండగా.. సవరించిన అంచనాల మేరకు 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.2,461.90కోట్లుగా ఉంది. కాగా, జాతీయ ప్రాజెక్టులకు సంబంధించి మార్కెట్ల నుంచి రుణ సేకరణ సేవలకు ఈ బడ్జెట్లో రూ. 780 కోట్లను ప్రతిపాదించారు. ఈ బడ్జెట్ అంచనాల్లో మూలధన వ్యయంకోసం మొత్తంరూ. 2,60,200 కోట్లను కేటాయించగా.. ఇందులో రూ 2,40,000 కోట్లు జనరల్ రెవెన్యూ, రూ.2 వేల కోట్లు నిర్భయ ఫండ్, రూ.3వేల కోట్లు అంతర్గత వనరులు, రూ.17వేల కోట్లు  బడ్జెట్ వనరులుగా ఉన్నాయి.   

ఇక వందే మెట్రో..
పెద్ద నగరాల పరిసరాల్లో నివసించే ప్రజలు రాకపోకలు సాగించేందుకు వందే మెట్రో రైళ్లను రూపొందిస్తున్నామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. వందే మెట్రో రైళ్లు.. వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు మినీ రూపమన్నారు. ఈ ఏడాది వీటి డిజైన్, తయారీ పూర్తవుతుందన్నారు. ఇక పూర్తి దేశీయంగా రూపొందించిన తొలి హైడ్రోజన్ ఇంధన రైలును ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రవేశపెడతామన్నారు. 

రాబడి ఇలా..
ప్రయాణికులు, సరుకు రవాణా, ఇతర ఖాతాలు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి మొత్తం రాబడిని రూ. 2,65,000 కోట్లుగా ఈ బడ్జెట్లో అంచనా వేశారు. ఇది గత బడ్జెట్లో సవరించిన అంచనాల ప్రకారం రూ. 2,42,892.77 కోట్లుగా ఉంది. సరుకు రవాణా నుంచి ఆదాయం రూ. 1,79,500 కోట్లుగా ఉంటుందని ఈ బడ్జెట్లో పేర్కొన్నారు. అయితే ఇది గత బడ్జెట్లో సవరించిన అంచనాల మేరకు రూ. 1,65,000 కోట్లుగా ఉంది. రైలు బండ్ల నిర్మాణానికి గత బడ్జెట్లో సవరించిన అంచనాల మేరకు కేటాయింపులు రూ. 15,157.86 కోట్లు కేటాయించగా.. ఈ బడ్జెట్లో ఆ నిధులను సుమారు రెట్టింపు చేసి రూ. 37,581 కోట్లుగా ప్రతిపాదించారు.  
మెట్రో ప్రాజెక్టులకు రూ. 19,518 కోట్లు.. 
దేశ వ్యాప్తంగా మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ. 19,518 కోట్లు కేటాయించింది. అయితే గత బడ్జెట్లో సవరించిన అంచనాల మేరకు మెట్రోలకు రూ. 15,628 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనల్లో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ రూ. 4,471 కోట్లు, సబార్డినేట్ డెట్ రూ. 1,324 కోట్లు, పాస్త్రూ అసిస్టెన్స్ రూ. 13,723 కోట్లుగా ఉంది. నేషనల్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్కు రూ. 3,496 కోట్లు కేటాయించారు. 

క్రీడా శాఖకు అదనంగా రూ.700 కోట్లు 
ఆసియా క్రీడలు, 2024లో ప్యారిస్ ఒలంపిక్స్కు ఆటగాళ్లను సంసిద్ధులను చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం క్రీడాశాఖకు రూ.3,397.32 కోట్లను కేటాయించింది. మునుపటిబడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే ఇది రూ.723.97 కోట్లు అదనం. గత 2022–23 బడ్జెట్లో క్రీడలకు వాస్తవ కేటాయింపులు రూ.3,062.60 కోట్లు కాగా, రివైజ్డ్ బడ్జెట్లో రూ.2,673.35 కోట్లిచ్చింది. చైనాలో 2022 సెపె్టంబర్లో జరగాల్సిన ఆసియా క్రీడలు కోవిడ్ తీవ్రత కారణంగా వాయిదా పడ్డాయి. ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్ నెలల్లో ఇవి జరగాల్సి ఉంది. క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’కు ఈసారి రూ.1,045 కోట్లు ప్రత్యేకించింది. గత రివైజ్డ్ బడ్జెట్లో ఖేలో ఇండియాకు కేటాయించింది రూ.606 కోట్లే.
భారత క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్)కి కూడా రూ.785.52 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్ కేటాయింపుల కంటే ఇది రూ.36.09 కోట్లెక్కువ. అదేవిధంగా, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఎన్ఎస్ఎఫ్)లకు కూడా గతంలో కంటే రూ.45 కోట్లు ఎక్కువగా అంటే రూ.325 కోట్లు కేటాయించింది. వరల్డ్ యాంటీ–డోపింగ్ ఏజెన్సీ(వాడా)కి అనుబంధంగా ఉండే నేషనల్ యాంటీ–డోపింగ్ ఏజెన్సీ(నాడా)కి, నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యా»ొరేటరీ(ఎన్డీటీఎల్)లకు గతంలో సాయ్తోపాటే నిధులు కేటాయించేవారు. ఈసారి బడ్జెట్లో ప్రత్యేకంగా నాడాకు రూ.21.73 కోట్లు, ఎన్డీటీఎల్కు రూ.19.50 కోట్లు కేటాయించింది. పలు దేశాలు క్రీడాకారులకు నైపుణ్యం, శాస్త్రీయ శిక్షణపై ఎక్కువ శ్రద్ధ చూపడాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నేషనల్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ రీసెర్చ్ కోసం వేరుగా రూ.13 కోట్లు కేటాయించింది.  

జమ్మూకశ్మీర్‌కు రూ.35,581 కోట్ల కేంద్ర సాయం..
వార్షిక బడ్జెట్లో కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్కు రూ.35,581.44 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో కశ్మీర్కు కేటాయించింది రూ.34,704.46 కోట్లు. తాజా కేటాయింపుల్లో అత్యధికం రూ.33,923 కోట్లు కేంద్ర సాయం (సెంట్రల్ అసిస్టెన్స్) రూపంలోనే ఉండటం గమనార్హం. 
ఈ నిధులను 2014 వరదల్లో దెబ్బతిన్న మౌళిక వనరులను పునరుద్ధరించేందుకు, ముఖ్యంగా దాల్–నగీన్ సరస్సు పరిరక్షణ, పునరుద్ధరణ కోసం వెచ్చించాల్సి ఉంటుంది. ఇంకా, 624 మెగావాట్ల కిరు జలవిద్యుత్ ప్రాజెక్టు, 800 మెగావాట్ల రాటిల్ జల విదుŠయ్త్ ప్రాజెక్టు, 540 మెగావాట్ల క్వార్ జల విద్యుత్ ప్రాజెక్టులకు ఈక్విటీగా ఖర్చు చేస్తారు. అండమాన్ 
నికోబార్ దీవులకు గత బడ్జెట్లో రూ.5,508.05 కోట్లు కేటాయించగా ఈసారి రూ.5,987.14 కోట్లు కేటాయించారు. మరో కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్కు గత బడ్జెట్లో రూ.5,131.12 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.5,436.10 కోట్లు కేటాయించారు. అలాగే, దాద్రానగర్ హవేలీకి రూ.2,475 కోట్లు, లద్దాఖ్కు రూ.5,958 కోట్లు, లక్షద్వీప్కు రూ.1,394 కోట్లు, ఢిల్లీకి రూ.1,168.01 కోట్లు, పుదుచ్చేరికి రూ.3,117.77 కోట్లు కేటాయించారు.  

రెవెన్యూ అంతరాన్ని పూడ్చేందుకు.. రూ.15.4 లక్షల కోట్ల రుణాలు 
2023–24 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ అంతరాన్ని పూడ్చుకునేందుకు డేటెడ్ సెక్యూరిటీల ద్వారా ఏకంగా రూ.15.4 లక్షల కోట్ల మేరకు రుణాలు సేకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ లక్ష్యం రూ.14.21 లక్షల కోట్లు. కాగా జన వరి నాటికి అందులో 91 శాతం, అంటే రూ.12.93 లక్షల కోట్లు సేకరించగలిగారు. 2023– 24లో రూ.11.8 కోట్ల నికర మార్కెట్ రుణాలను ఆశిస్తున్నట్టు విత్త మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. మిగతా మొత్తాలను చిన్న మొత్తాల పొదుపు తదితర మార్గాల ద్వారా సమకూర్చుకుంటామన్నారు. రుణాలు పోను ఈసారి రూ.27.2 లక్షల కోట్ల రాబడిని, రూ.45 లక్షల కోట్ల వ్యయాన్ని అంచనా వేస్తున్నాం. నికర పన్ను వసూళ్ల అంచనా రూ.23.3 లక్షల కోట్లు’’అని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి రుణగ్రస్తత వార్షిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఏకంగా 83 శాతానికి సమానం!  

ఇన్ఫ్రాకు ఏకంగా రూ.10 లక్షల కోట్లు.. 


మౌలిక సదుపాయాల అభివృద్ధికి బడ్జెట్ పెద్దపీట వేసింది. ఇందుకోసం మూలధన వ్యయ పద్దు కింద కేటాయింపులను ఏకంగా రూ.10 లక్షల కోట్లకు పెంచారు. గత కేటాయింపుల కంటే ఇది 33 శాతం ఎక్కువ! అంతేగాక మొత్తం జీడీపీలో ఇది 3.3 శాతం!! 2019–20 కేటాయింపులతో పోలిస్తే దాదాపుగా మూడు రెట్లు ఎక్కువ! ఈ కేటాయింపులను పెంచడం వరుసగా ఇది మూడో ఏడాది. ఈసారి బడ్జెట్ కేటాయింపులకు అదనంగా ప్రైవేటు పెట్టుబడులను కూడా సేకరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ‘‘కొత్తగా ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ సెక్రటేరియట్ ఇందుకు తోడ్పడుతుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి మాస్టర్ లిస్ట్ను నిపుణుల కమిటీ మదింపు చేసి వేటిని ఏ క్రమంలో చేపట్టాలో సిఫార్సు చేస్తుంది’’అని ప్రకటించారు. ఆమె ఇంకా ఏం చెప్పారంటే.. 
☛ బొగ్గు, ఉక్కు, ఎరువులు, ఆహార ధాన్యాల వంటి రంగాలకు చెందిన పరిశ్రమలు, పోర్టులకు పూర్తిస్థాయి అత్యుత్తమ కనెక్టివిటీ కల్పిస్తాం. ఇందుకోసం 100 కీలక రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టనున్నాం. దీనికి రూ.75,000 కోట్లు కేటాయిస్తున్నాం. రూ.15,000 కోట్లు ప్రైవేటు నుంచి సేకరిస్తాం. 
☛ మౌలిక సదుపాయాలు, ఉత్పాదన సామర్థ్య రంగాలపై పెట్టుబడులు వృద్ధి, ఉద్యోగ కల్పనను ఎన్నో రకా లుగా ప్రభావితం చేయగలవు. అందుకే పెట్టుబడులు, ఉపాధి కల్పన క్రమాన్ని మరోసారి వేగవంతం చేసే చర్యలకు బడ్జెట్లో పెద్దపీట వేస్తున్నాం. కరోనా కారణంగా కొంతకాలం మందగించిన పెట్టుబడులు మళ్లీ పుంజుకుంటుండటం శుభ పరిణామం. 

ఇప్పటికే పీఎం గతి శక్తి.. 
లాజిస్టిక్ వ్యయాలను తగ్గించేందుకు ఉద్దేశించిన జాతీయ సమీకృత మౌలికాభివృద్ది మాస్టర్ ప్లాన్ ‘పీఎం గతి శక్తి’ని 2021 అక్టోబర్లో ప్రధాని మోదీ ప్రారంభించడం తెలిసిందే. ఇందులో భాగంగా రూ.500 కోట్లకు మించిన అనుసంధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులన్నీ నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ (ఎన్పీజీ) ద్వారా సాగుతాయి. రవాణా, కనెక్టివిటీ సంబంధిత మౌలిక సదుపాయాల కల్పనలో కొత్త యుగానికి తెరతీసేలా బడ్జెట్ ఉందంటూ ఉపరితల రవాణా, హైవే శాఖల మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసించారు. హైవే రంగానికి బడ్జెట్లో రూ.27 లక్షల కోట్లు కేటాయించడం ముదావహమన్నారు.  

ద్రవ్యలోటు అదుపులోనే.. 2023–24లో 5.9 శాతం కుదింపు లక్ష్యం
ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును కట్టడి చేస్తామని నిర్మల ప్రకటించారు. ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యం మేరకు ద్రవ్యలోటును 6.4% వద్ద (స్థూల దేశీయోత్పత్తి విలువలో పోల్చి– విలువలో రూ.16,61,196 కోట్లు)) నిలువరించగలుగుతున్నట్లు తెలిపారు. అదే విధంగా రానున్న ఆర్థిక సంవత్సరంలో (2023–24) దీనిని మరింతగా 5.9%కు తగ్గించాలని తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు. 2025–26 ఆర్థిక ఏడాదికి ద్రవ్యోలోటును 4.5 శాతానికి తగ్గించడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కాగా, గడచిన ఆర్థిక సంవత్సరం 2021–22లో ద్రవ్యలోటు తొలి అంచనా 6.8%కాగా, దీనిని తాజాగా 6.9 శాతానికి (రూ.15,06,812 కోట్ల నుంచి రూ.15,91,089 కోట్లు) సవరించడం జరిగింది.

రూ.23.3 లక్షల కోట్ల నికర పన్ను వసూళ్ల అంచనా.. 
బడ్జెట్ ప్రకారం 2023–24లో కేంద్రానికి రాబడులు రూ.27.2 లక్షల కోట్లు. ఇందులో నికర పన్ను రాబడులు రూ.23.3 లక్షల కోట్లు. డేటెడ్ సెక్యూరిటీల నుంచి నికర మార్కెట్ రుణాలను రూ.11.8 లక్షల కోట్లు. స్థూలంగా ఈ విలువ రూ.15.43 లక్షల కోట్లుగా ఉంది. ఇక వ్యయ అంచనా రూ.45 లక్షల కోట్లు. ఇదిలావుండగా, రాష్ట్రాలవిషయంలో ద్రవ్యలోటును జీడీపీలో 3.5%గా అంచనావేయడం జరిగింది. ఇందులో విద్యుత్ రంగం సంస్కరణలకు సంబంధించి ఆ రంగానికి 0.5 శాతాన్ని అనుమతించడం జరుగుతుంది. కాగా, పరోక్ష పన్ను ప్రతిపాదనలు గ్రీన్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీ) పెంచుతాయని ఆర్థిక మంత్రి చెప్పారు. 

మహిళలకు కొత్త పొదుపు పథకం.. 
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పేరుతో రెండేళ్ల కాలానికి మహిళలకు కొత్త పొదుపు పథకాన్ని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2025 వరకూ ఉద్దేశించిన ఈ పథకం గరిష్ట డిపాజిట్ పరిమితి రూ. 2 లక్షలు. వడ్డీ రేటు 7.5 శాతం.  

రాష్ట్రాలకు మరో ఏడాది ‘50 ఏళ్లరుణాలు’ 
రాష్ట్రాలకు 50 ఏళ్ల వడ్డీ లేని రుణాలను కేంద్రం మరో ఏడాది కొనసాగించనుంది. ఈ రుణాలను 2023–24లోపు మూల ధన వ్యయంపై ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆర్థికమంత్రి తెలిపారు.  

ఇన్ఫ్రా ఫైనాన్స్ సెక్రటేరియట్తో భారీ పెట్టుబడులు.. 
కొత్తగా ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ సెక్రటేరియట్ ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో సహకరిస్తుందని నిర్మల అన్నారు. అమృత్ కాల్కు అనువైన మౌలిక సదుపాయాల వర్గీకరణ, ఫైనాన్సింగ్ ఫ్రేమ్వర్క్ చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి 33% పెంపుతో రూ.10 లక్షల కోట్లకు పెంచిన మూలధన వ్యయం జీడీపీలో 3.3%గా ఉందన్నారు.  

పోస్టాఫీస్ డిపాజిట్ పథకం పరిమితి రెట్టింపు 
పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ డిపాజిట్ పథకం పరిమితిని వ్యక్తిగతంగా ప్రస్తుత 4.5 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచడం జరిగింది. జాయింట్ అకౌంట్కు సంబంధించి ఈ పరిమితిని రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షలకు రెట్టింపు చేయనున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు.    

మధ్యతరగతికి కుటుంబానికి దక్కిందిదే..!


కేంద్ర బడ్జెట్ మీద గంపెడాశలు పెట్టుకున్న ఓ సగటు మధ్య తరగతి కుటుంబానికి దక్కింది చాలా తక్కువే. ఒకట్రెండు హామీలు తప్పితే మిగతావన్నీ చేదుగుళికలే. ‘‘నేనూ మధ్యతరగతి వ్యక్తినే. ఈ వర్గం ప్రజలపై ఉండే ఒత్తిళ్లు నాకూ తెలుసు. వాటిని అర్థం చేసుకోగలను’’ అని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలతో బడ్జెట్లో మిడిల్ క్లాస్ మెలోడీస్ విని పిస్తాయని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే ఆదాయ పన్ను మినహాయింపు, కాసింత సేవింగ్స్, కూసింత ఎంటర్టైన్మెంట్ తప్ప మిగిలిన వాటిల్లో నిరాశే మిగిలింది.  
ఉద్యోగి..
కరోనా తర్వాత బతుకు భారమైపోయింది. ఆదాయాన్ని మించిపోయేలా ఖర్చులు తడిసిమోపెడయ్యాయి. సగటు వేతన  జీవి ఆదాయ పన్ను పరిమితివైపే ఆశగా చూశాడు. ఈ విషయంలో కాస్తో కూస్తో ఊరట కలిగింది. ఏడాదికి రూ.7 లక్షలు అంటే నెలకి రూ.60 వేల సంపాదన ఉన్నవారు ఆదాయ పన్ను కట్టాల్సిన పని లేదు. ఈ కొత్త బడ్జెట్ ద్వారా వారికి నెలకి రూ.2800 వరకు మిగులుతుంది. పెరిగిపోతున్న ధరాభారానికి అదేమంత పెద్ద మొత్తం కాదని అందరూ పెదవి విరుస్తున్నారు. ఒక కుటుంబం కొనుగోలు శక్తిని మరింత పెంచకుండా దేశ ఆర్థిక వృద్ధి రేటుపై మోయలేని లక్ష్యాలు పెట్టుకొని ఏం ప్రయోజనమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.  
మహిళ..
ఆదాయాన్ని పొదుపుగా వాడుకుంటూ ఇల్లు నడిపే మహిళల కోసం ప్రకటించిన మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఒక వరం. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు నానాటికీ తీసికట్టుగా మారిపోతున్న నేపథ్యంలో మహిళలకి 7.5% స్థిర వడ్డీరేటుని కల్పిస్తారు. ఈ సర్టిఫికెట్ కింద రెండు లక్షల వరకు డిపాజిట్ చేసే అవకాశం ఉంది. ఆర్థిక కష్టాలు వస్తే బంగారం ఆదుకుంటుందన్న నమ్మకం బడ్జెట్లో గల్లంతైంది. గోల్డ్ బార్స్ దిగుమతి సుంకాన్ని 12.5 శాతానికి పెంచడంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన వెంటనే 10 గ్రాముల బంగారం రూ. 58 వేలకి చేరుకోవడం మహిళలకి షాక్ తగిలినట్టైంది.
సీనియర్ సిటిజన్ ..
సీనియర్ సిటిజన్లకి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ స్కీమ్ పరిమితిని ఒకేసారి రెట్టింపు చేస్తూ నిర్ణయం ప్రకటించారు. సీనియర్ సిటిజన్లు తమ పేరు మీద ఇన్నాళ్లూ రూ.15 లక్షల డిపాజిట్లు చేసుకోవచ్చు. ఇప్పుడు దానిని రూ.30 లక్షలకు పెంచారు. కరోనా సమయంలో రైలు ప్రయాణంలో సీనియర్ సిటిజన్లకి 50శాతం కన్సెషన్ ఉండేది. దానిని ఎత్తేస్తారని ఆశగా ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురైంది. నిర్మలక్క ఆ ఊసు కూడా ఎత్తలేదు.  
విద్యార్థి..
కోవిడ్–19 చదువుల్ని చావు దెబ్బ తీసింది. బడిముఖం చూడకుండా ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లలో పాఠాలు విన్న పిల్లలు చదువుల్లో కొన్నేళ్లు వెనకబడిపోయారు. 2012 నాటి స్థాయికి చదువులు పడిపోయాయని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఈ సారి బడ్జెట్లో ఎన్నడూ లేని విధంగా రూ.1.12 లక్షల కోట్లు కేటాయించారు. పాఠశాల విద్యకి 8 శాతం నిధులు పెరిగినా పిల్లల్ని బడి బాట పట్టించే చర్యలు శూన్యం. నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తాననడం కంటితుడుపు చర్యగా మారింది. 
నిరుద్యోగి ..
ఇది లే ఆఫ్ల కాలం. పని సగంలో ఉండగా మీ సేవలు ఇంక చాలు అంటూ పింక్ స్లిప్ చేతికిచ్చి ఇంటికి పంపేస్తున్నారు. దీంతో నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కల్పనకి అవసరమైన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సారి బడ్జెట్ సప్తరుషుల్లో ఒకటిగా యువశక్తికి పెద్ద పీట వేసింది. యువతలో నైపుణ్యం పెంచడానికి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) 4.0 ప్రారంభించనుంది.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, 3డీ ప్రింటింగ్, డ్రోన్లు వంటి వాటిలో శిక్షణ ఇస్తుంది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 38,800 ఉపాధ్యాయులను నియమించనుంది. టూరిజం రంగంలో ఉద్యోగాల కోసం యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపడతామని చెప్పినా ఎన్ని కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న దానిపై స్పష్టత లేదు.  
సొంతిల్లు..
సొంతిల్లు అనేది మధ్య తరగతికి కల. ఏదున్నా లేకున్నా తలదాచుకోవడానికి ఒక గూడు ఉండాలని అనుకుంటారు. ఈ మధ్య కాలంలో ఆర్బీఐ రెపో రేట్లు సవరించిన ప్రతీసారి గృహ రుణాల వడ్డీ రేటు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ సారి బడ్జెట్లో వడ్డీ రేట్లు తగ్గింపు వంటి వాటిపై ఏమైనా ప్రకటనలుంటాయేమోనని, ఆదాయ పన్ను మినహాయింపులో గృహ రుణాలు తీసుకున్న వారి పరిమితిని పెంచుతారని ఆశపడ్డారు. కానీ ఆర్థిక మంత్రి ఆ ఊసే ఎత్తలేదు. అయితే నిరుపేదల కోసం నిర్మించే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకానికి 66% నిధుల్ని పెంచుతూ మొత్తంగా 79 వేల కోట్లు కేటాయించారు.  
ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్..
ఇవాళ రేపు ఎవరింట్లో చూసినా ఎవరి తీరాన వారు మొబైల్ ఫోన్లలో తలదూర్చేస్తున్నారు. వాట్సాప్లోనే పలకరింపు, ముచ్చట్లు కలబోసుకుంటున్నారు. వినోదమైనా, విజ్ఞానమైనా అంతా మన అరచేతిలోనే. ఇప్పుడు ఆ మొబైల్ ధరలైతే తగ్గనున్నాయి. టీవీలు, మొబైల్ ఫోన్లలో వాడే విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించడంతో టీవీ, మొబైల్ రేట్లు తగ్గుతాయి. ఇవి తగ్గుతాయి బానే ఉంది కానీ, వినోదం కోసం బయట సినిమాకి వెళ్లారంటే  ఇక్కడ మిగిలింది కాస్త అక్కడ ఖరై్చపోతుంది. మొత్తంగా లెవలైపోతుంది. హళ్లికీ హళ్లి సున్నాకి సున్నా. ఫ్యామిలీ పార్టీల్లో బ్రాడెండ్ దుస్తులు వేసుకోవాలన్నా మధ్యతరగతికి ఇప్పుడు అది భారమైపోయింది.  

పోస్టల్, టెలికామ్కు రూ.1.23 లక్షల కోట్లు 
పోస్టల్, టెలికామ్ ప్రాజెక్టులకు 2023–24 కేంద్ర బడ్జెట్లో రూ. 1.23 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో టెలీకాం ప్రాజెక్టులకు మొత్తం రూ. 97,579.05 కోట్లు కేటాయించగా.. పోస్టల్ ప్రాజెక్టులకు రూ. 25,814 కోట్లు ప్రతిపాదించారు. ఇందులో పోస్టు పేమెంట్స్ బ్యాంకు కోసం రూ. 250 కోట్లు కేపిటల్ ఇన్ఫ్యూజన్గా పేర్కొన్నారు. అలాగే 5జీ సేవలందించడానికి సిద్ధమవుతున్న బీఎస్ఎన్ఎల్కు రూ. 52,937 కోట్లు కేపిటల్ ఇన్ఫ్యూజన్గా ప్రతిపాదించారు. డిఫెన్స్ సరీ్వసెస్కు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఆధారిత నెట్వర్క్ కోసం రూ. 2,158 కోట్లు కేటాయించారు. ఈశాన్య రాష్ట్రాల్లో టెలీకాం సేవల ప్రాజెక్టుల కోసం రూ. 715.8 కోట్లు ప్రతిపాదించారు. 
  
విదేశీ వ్యవహారాలకు రూ.18,050 కోట్లు
బడ్జెట్లో విదేశీ వ్యవహారాల శాఖ రూ. 18,050 కోట్లు దక్కించుకుంది. గత బడ్జెట్ కంటే ఇది సుమారు 4.64 శాతం ఎక్కువ. కేటాయింపుల్లో రూ. 5,408 కోట్లను వివిధ దేశాలకు సహాయం కోసం ప్రతిపాదించారు. జీ 20 అధ్యక్ష బాధ్యతలకు రూ. 990 కోట్లు ఇచ్చారు. ‘పొరుగుకు ప్రాధాన్యం’ పాలసీ నేపథ్యంలో భూటాన్కు రూ. 2,400 కోట్లు కేటాయించారు. మాల్దీవుల్లో ప్రాజెక్టుల నిర్వహణకు రూ. 400 కోట్లు ప్రతిపాదించారు. అఫ్ఘనిస్థాన్తో అనుబంధం కొనసాగింపులో భాగంగా  రూ. 200 కోట్లు సహాయంగా అందించనున్నారు. నేపాల్ రూ. 550 కోట్లు, మారిషస్ రూ. 460 కోట్లు, మయన్మార్ రూ. 400 కోట్లు, శ్రీలంక రూ. 150 కోట్లు, ఆఫ్రికా దేశాలు రూ. 250 కోట్లు అభివృద్ధి నిధులు పొందనున్నాయి. మూలధన వ్యయం గత బడ్జెట్లో రూ. 1,416.23 కోట్లు ఉండగా.. ఈ బడ్జెట్లో అది రూ. 1,520.21 కోట్లకు పెరిగింది. 

వార్తా సంస్థలకు పన్ను మినహాయింపు రద్దు 
ఎయిర్ కనెక్టివిటీ పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చర్య­లు చేపట్టింది. అదనంగా 50 విమానాశ్రయా­లు, వాటర్ ఏరోడ్రోమ్స్, హెలిపోర్టులు ఏర్పా­టు చేయనున్నట్టు ప్రకటించింది. కొంత కాలంగా ప్రాంతీయంగా విమాన ప్రయా­ణాల కనెక్టివిటీని పెంపొందించడానికి ఉడాన్ పథకం కింద పలు ప్రోత్సాహకాలు చేపట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో 50 అదనపు విమానాశ్రయాలు, హెలిపోర్టు­లు, వాటర్ ఏరోడ్రోమ్స్ అభివృద్ధి చేస్తామని చెప్పారు. రవాణా రంగంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కూడా చేపట్టనున్నట్టు వివరించారు.   

రక్షణకు రూ.5.94 లక్షల కోట్లు
కేంద్ర బడ్జెట్లో ఈ ఏడాది రక్షణ రంగానికి ప్రాధాన్యం లభించింది. మొత్తం రూ.5.94 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాది కంటే రూ. 69 వేల కోట్లు ఎక్కువ. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెడు­తూ రక్షణ రంగ కేటాయింపుల్లో రూ. 1.62 లక్షల కోట్లు మూల ధన వ్యయమని తెలిపారు. ఈ మొత్తాన్ని కొత్త ఆయుధాలు, విమానాలు, యుద్ధనౌకలు, ఇతర మిలటరీ పరికరాల కొను­గోళ్లకు మాత్రమే ఉపయోగిస్తారన్నమాట. 2022–23 మూలధన కేటాయింపులు రూ.1.52 లక్ష కోట్లు మా­త్రమే. అంచనాల సవరణ తరువాత ఇది రూ.1.50 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది రక్షణ రంగ కేటాయింపుల్లో రూ.2.70 లక్షల కోట్లు ఆదాయ వ్యయం అంటే సిబ్బంది జీతభత్యాలు, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం ఖర్చు పెట్టనున్నారు. గత ఏడాది ఈ ఖర్చుల కోసం ముందుగా 2.39 లక్షల కోట్లు కేటాయించారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (సివిల్) మూలధన వ్యయం రూ.8774 కోట్లు. ఫించన్ల కోసం విడిగా రూ.1.38 లక్షల కోట్లు కేటాయిపులు జరిగాయి. దీంతో రక్షణ శాఖ ఆదాయ వ్యయం మొత్తమ్మీద రూ.4.22 లక్షల కోట్లకు చేరింది. 
  
భద్రతకు పెద్దపీట.. హోంశాఖకు 1.96 లక్షల కోట్లు


దేశంలో అంతర్గత భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా స్పష్టం చేసింది. బడ్జెట్లో కేంద్ర హోంశాఖకు ఏకంగా రూ.1,96,034.94 కోట్లు కేటాయించడమే ఇందుకు నిదర్శనం. గత ఏడాది బడ్జెట్లో ఈ కేటాయింపులు రూ.1,85,­776.55 కోట్లు.  ఈసారి కేటాయింపులను రూ.10,258.39 కోట్లు పెంచినట్లు స్పష్టమవుతోంది. మొత్తం కేటాయింపుల్లో సింహభాగం కేంద్ర సాయుధ పోలీ­సు దళాలు, నిఘాసమాచారం సేకరణ కోసం ఖర్చు చేయనున్నారు. అంత­ర్జాతీయ సరిహద్దుల్లో మౌలిక సదు­పాయాల అభివృద్ధి, పోలీసు దళాల ఆధునీకరణ కోసం పెద్ద ఎత్తున వెచ్చించబోతున్నారు.  

మహిళా భద్రత పథకాలకు రూ.1,100 కోట్లు  
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు దళాలకు గత ఏడాది రూ.1,19,070 కోట్లు కేటాయించగా ఈసారి రూ.1,27,756 కోట్లు కేటాయించారు. ఇందులో సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(సీఆర్పీఎఫ్)కు 2022–23లో రూ.31,495 కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్లో రూ.31,772 కోట్లు కేటాయించారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్), కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్), సశస్త్ర సీమాబల్(ఎస్ఎస్బీ), ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ), అస్సాం రైఫిల్స్ తదితర దళాలకు కేటాయింపులను పెంచారు. నేషనల్ సెక్యూరిటీ గార్డు(ఎన్ఎస్జీ), ఇంటెలిజెన్స్ బ్యూరో, ప్రత్యేక భద్రతా విభాగం(ఎస్పీజీ)కి గణనీయమైన కేటాయింపులు లభించాయి. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.3,545.03 కోట్లు, పోలీసు మౌలిక సదుపాయాల కోసం రూ.3,636.66 కోట్లు, పోలీసు దళాల ఆధునీకరణ కోసం రూ.3,750 కోట్లు కేటాయించారు. భద్రతకు సంబంధించిన ఖర్చుల కోసం రూ.2,780.88 కోట్లు, జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన పనులకు రూ.1,564.65 కోట్లు, మహిళా భద్రత పథకాలకు రూ.1,100 కోట్లు, ఫోరెన్సిక్ సదుపాయాల ఆధునీకరణకు రూ.700 కోట్లు, సరిహద్దుల్లో చెక్పోస్టుల నిర్వహణకు రూ.350.61 కోట్లు,సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు దళాల ఆధునికీకరణ ప్రణాళిక–4 కోసం రూ.202.27 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.

అంతరిక్షానికి 12,544 కోట్లు 
అంతరిక్ష రంగానికి బడ్జెట్లో రూ.12,544 కోట్లు కేటాయించారు. ఈ కేటా­యింపులు గత ఏడాది ఇచ్చి­న రూ.13,700 కంటే 8 శాతం తక్కువ కావడం గమనార్హం. వచ్చే ఏడాది చంద్రుడు, చుట్టూ ఉన్న గ్రహాల అధ్యయనం కోసం మానవసహిత గగన్యాన్ను నిర్వహించేందుకు అంతరిక్ష విభాగం ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఇచ్చిన కేటాయింపుల్లో అధి­క­భాగం రూ.11,669.41 కోట్లను గగన్యాన్, శాటిలైట్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఇస్తారు. థియరిటికల్ ఫిజిక్స్తోపాటు వివిధ అంశాలపై పరిశోధనలు నిర్వహించే అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి రూ.408.69 కోట్లు కేటాయించారు. ఈ విభాగానికి గత ఏడాది రూ.411.11 కోట్లు ఇచ్చారు. ప్రైవేట్ రంగాన్ని పర్యవేక్షించేందుకు కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసిన సింగిల్విండో విభాగమైన ఇన్–స్పేస్కు గత ఏడాది రూ.21 కోట్లు ఇవ్వగా, తాజా బడ్జెట్లో రూ.95 కోట్లను కేటాయించా రు. వచ్చే ఏడాది చంద్రయాన్ మిషన్ చేపడుతున్న ఇస్రో.. సూర్యుడు, శుక్రుడు, అంగారక గ్రహాలపైనా పరిశోధనలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.   

రూ.7 వేల కోట్లతో మూడో దశ ఇ–కోర్టులు 
న్యాయ పరిపాలన సమర్థంగా సాగేలా రూ.7,000 కోట్లతో మూడో దశ ఇ–కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు  ఆర్థిక మంత్రి చెప్పారు. కక్షిదారులు, న్యాయవాదులు ఎక్కడి నుంచైనా కేసును నమోదుచేసేందుకు మూడోదశ ఇ–కోర్టులు ఉపయోగపడతాయి. మూడో దశ ఇ–కోర్టులను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజ్జు ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే.
 
మొబైల్ విడిభాగాలపై సుంకాల తగ్గింపు 
దేశీయంగా మొబైల్ ఫోన్లు, లిథియం అయాన్ బ్యాటరీల తయారీని ప్రోత్సహించేందుకు విడిభాగాల దిగుమ తులపై కస్టమ్స్ సుంకం తగ్గించారు. కెమెరా లెన్స్ దిగుమతులపై సుంకాన్ని తగ్గించారు. లిథియం అయాన్ బ్యాటరీ సెల్స్ దిగుమతులపై రాయితీ డ్యూటీని కొనసాగించారు. ఎలక్ట్రిక్ వాహనాలకు దేశీయంగా లిథియం అయాన్ బ్యాటరీ సెల్స్ తయారీ కోసం  దిగుమతి చేసుకునే పరికరాలు, క్యాపిటల్ గూడ్స్పై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు కల్పించారు. సీఆర్జీవో స్టీల్, ఫెర్రస్ స్క్రాప్, నికెల్ క్యాథోడ్ తయారీ  ముడి పదార్థాల దిగుమతులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. కాంపౌండెడ్ రబ్బర్ దిగుమతిపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 10 శాతం నుంచి 25 శాతం చేశారు. ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 7.5 శాతం నుంచి 15 శాతానికి పెంచారు.  

రీట్, ఇన్విట్.. అన్ని రకాల ఆదాయంపై పన్ను
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)లకు సంబంధించి పన్ను పరిధి విస్తృతమైంది. రీట్లు, ఇన్విట్లు తమ వాటాదారులకు (యూనిట్ హోల్డర్లు) వడ్డీ, డివిడెండ్, అద్దె ఆదాయం, డెట్ ఇలా నాలుగు భాగాలుగా లాభాలను చెల్లిస్తుంటాయి. ఇందులో వడ్డీ ఆదాయం, డివిడెండ్, అద్దె ఆదాయంపై పన్ను అమల్లో ఉంది. వీటిని స్వీకరించిన ఇన్వెస్టర్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డెట్ భాగం చెల్లింపు పన్ను లేదు. ఇక మీదట ఈ మొత్తం కూడా యూనిట్ హోల్డర్ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. కనుక రీట్లు, ఇన్విట్ల నుంచి వాటాదారులు అందుకునే అన్ని రకాల ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. 

ఆటబొమ్మల దిగుమతులపై మరింత పన్ను
ఆట బొమ్మలు (టాయ్స్), వాటి విడిభాగాల దిగుమతులపై 60 శాతంగా ఉన్న సుంకాన్ని 70 శాతానికి పెంచుతూ ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతిపాదించారు. దేశీ తయారికి ఊతమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సైకిళ్ల దిగుమతులపైనా సుంకాన్ని 30 శాతం నుంచి 35 శాతానికి చేర్చారు. ఎలక్ట్రానిక్ టాయ్స్, వాటి విడిభాగాలకు పన్ను పెంపును మినహాయింపు కల్పించారు. ఆట బొమ్మలు, వాడి విభాగాలపై కస్టమ్స్ డ్యూటీ 30 శాతంగా ఉంటే, 2020 ఫిబ్రవరిలో 60 శాతానికి పెంచడం గమనార్హం. దీంతో అప్పటి వరకు ఏటా రూ.2,960 కోట్ల మేర ఉన్న దిగుమతులు 2021–22లో రూ.870 కోట్లకు పరిమితమయ్యాయి. ఎగుమతులు 61 శాతం వృద్ధితో అదే ఏడాది రూ.2,601 కోట్లకు చేరాయి. 

విద్యా రంగానికి రూ.1.12 లక్షల కోట్లు 
ఈసారి విద్యా రంగానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.1,12,898.97 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు విద్యాశాఖకు ఇవే అత్యధిక కేటాయింపులు కావడం గమనార్హం. పాఠశాల విద్యకు రూ.68,804.85 కోట్లు కేటాయించగా ఉన్నత విద్యకు రూ.44,094.62 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో విద్యా రంగానికి రూ.1,04,277.72 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాలు ఉన్నత విద్యకు రూ.40,828.35 కోట్లు, పాఠశాల విద్యకు రూ.59,052.78 కోట్లుగా ఉన్నాయి. మేక్ ఏఐ ఇన్ ఇండియా, మేక్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా కలను సాకారం చేసే లక్ష్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి మూడు సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ కేంద్రాలు అత్యున్నత విద్యాసంస్థల్లో ఏర్పాటు కానున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, రవాణా రంగాల్లో మెరుగైన సేవలు అందించేలా ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో వంద ల్యాబ్లు ఏర్పాటవుతాయి. నేషనల్ డిజిటల్ లైబ్రరీని నెలకొల్పి నాణ్యమైన పుస్తకాలను అందుబాటులోకి తెస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.  

కేంద్ర సంస్థలకు పెరిగిన కేటాయింపులు 
జాతీయ నూతన విద్యావిధానాన్ని (ఎన్ఈపీ 2020) చిత్తశుద్ధితో అమలు చేసే లక్ష్యంతో కేంద్ర పరిధిలోని అత్యుత్తమ విద్యాసంస్థలు, యూనివర్సిటీలకు ఈసారి రూ.4,235.74 కోట్లు అదనంగా కేటాయించనున్నారు. గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి 12.8 శాతం నిధులు అదనంగా కేటాయించారు. యూజీసీకి గ్రాంట్లను రూ.459 కోట్లు పెంచారు. సెంట్రల్ యూనివర్సిటీలకు 17.66 శాతం, డీమ్డ్ యూనివర్సిటీలకు 27 శాతం గ్రాంట్లు పెరిగాయి. గతేడాది బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఐఐటీలకు 14 శాతం, ఎన్ఐటీలకు 10.5 శాతం పెరిగాయి. 
మెరుగ్గా ఉపాధ్యాయ శిక్షణ 
వినూత్నంగా పెడగాగి అంశాలు, కరిక్యులమ్లో మార్పులు, నిరంతర నైపుణ్యాల అభివృద్ధి తదితరాలతో ‘డైట్’కేంద్రాలను సరికొత్తగా ఆవిష్కరించి టీచర్ శిక్షణను మరింత మెరుగ్గా తీర్చిదిద్దనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 38,800 ఉపాధ్యాయ, సహాయ సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. రానున్న మూడేళ్లలో 740 ఏకలవ్య స్కూళ్లలో 3.5 లక్షల మంది ఆదివాసీ విద్యార్థులకు మెరుగైన బోధన అందించేలా నియామకాలు చేపట్టనున్నారు. ఏకలవ్య రెసిడెన్సియల్ స్కూళ్లకు బడ్జెట్లో రూ.5,943 కోట్లు కేటాయించారు.   
స్వాగతించిన ఎడ్టెక్ సంస్థలు 
విద్యా రంగంలో డిజిటల్ విధానాలను ప్రోత్సహిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు పెద్దపీట వేయటాన్ని ఎడ్టెక్ సంస్థలు స్వాగతిస్తున్నాయి. డిజిటల్ విప్లవం దిశగా దీన్ని కీలక చర్యగా అభివరి్ణస్తున్నాయి. డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు ఎడ్టెక్ రంగానికి సరికొత్త ఊపునిస్తుందని జడ్ఏఎంటీ సంస్థ వ్యవస్థాపకుడు ఆరుల్ మాలవీయ పేర్కొన్నారు. విద్యారంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యతకు బడ్జెట్లో గుర్తింపు లభించిందని చెప్పారు. ఎడ్టెక్ కంపెనీలు, స్టార్టప్లు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యేందుకు తాజా చర్యలు దోహదం చేస్తాయన్నారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకునేందుకు మానవ వనరులపై నిధులు వెచ్చించాల్సిన అవసరాన్ని బడ్జెట్ చాటి చెప్పిందని కూ ఇండియా, కీ బ్రిడ్జి గ్లోబల్ ఎడ్యుకేషన్ సహ వ్యవస్థాపకుడు అమోద్ దని చెప్పారు. నిత్య జీవితంలో భాగంగా మారిపోయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలను పెంపొందించే దిశగా సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లు కృషి చేస్తాయని ఫిజిక్స్వాలా కో ఫౌండర్ ప్రతీక్ మహేశ్వరి పేర్కొన్నారు. 
వజ్రాల తయారీ రీసెర్చ్కు గ్రాంట్  
ల్యాబ్ల్లో వజ్రాల తయారీ (ఎల్జీడీ) టెక్నాలజీకి ఉన్న విస్తృత ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని దేశీయంగా ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఓ ఐఐటీకి ఐదేళ్ల పాటు రీసెర్చ్ గ్రాంట్ అందచేస్తామని ప్రకటించారు.  
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0
వచ్చే మూడేళ్లలో లక్షల మంది యువతలో నైపుణ్యాలను పెంపొందించేలా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 ప్రారంభం కానుంది. పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా ఆధునిక కోర్సులైన కోడింగ్, ఏఐ, రోబోటిక్స్, మెకట్రానిక్స్, ఐవోటీ, 3డీ ప్రింటింగ్, డ్రోన్లు, సాఫ్ట్ స్కిల్స్లో శిక్షణ అందించనున్నారు. అంతర్జాతీయంగా అవకాశాలను అందిపుచ్చుకునేలా 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ కేంద్రాలను దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నెలకొల్పనున్నారు.  

మహిళా, శిశు సంక్షేమానికి రూ.25,448.75 కోట్లు  
కీలకమైన మహిళా, శిశు సంక్షేమ శాఖకు తాజా బడ్జెట్లో కేంద్రం రూ.25,448.75 కోట్లు కేటాయించింది. గత ఏడాది కంటే ఇది రూ.267 కోట్లు అధికం కావడం విశేషం. మహిళా, శిశు సంక్షేమమే ధ్యేయంగా కేటాయింపులను పెంచినట్లు తెలుస్తోంది. 2022–23లో ఈ శాఖకు రూ.25,172.28 కోట్లు కేటాయించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో మహిళల కోసం ముఖ్యమైన ప్రకటన చేశారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్’ను ప్రతిపాదించారు. దీనికింద పొదుపు చేసిన మొత్తంపై రెండేళ్ల కాలానికి రూ.7.5 శాతం వడ్డీరేటు చెల్లిస్తారు. మహిళ లేదా ఆడ శిశువు పేరిట డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.2 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. పాక్షికంగా ఉపసంహరించుకొనే వెసులుబాటు ఉంటుంది. ఇదొక చిన్న తరహా పొదుపు పథకం. మహిళ ఆర్థిక సాధికారత కోసం ‘దీన్దయాళ్ అంత్యోదయ యోజన–నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్’కింద గ్రామీణ మహిళలతో 81 లక్షల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఒక్కో సంఘంలో వేలాది మంది మహిళలు ఉంటారని తెలిపారు. ఉత్పాదక సంస్థల ద్వారా ఆర్థిక సాధికారత సాధించడమే ఈ సంఘాల లక్ష్యమని వివరించారు.  
మహిళా రైతులకు రూ.54,000 కోట్ల లబ్ధి  
పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి కింద చిన్న, సన్నకారు రైతులకు రూ.2.25 లక్షల కోట్లు బదిలీ చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ వివరించారు. ఇందులో 3 కోట్ల మంది మహిళా రైతులు రూ.54,000 కోట్ల మేర లబ్ధి పొందుతారని తెలియజేశారు. మహిళా, శిశు సంక్షేమ శాఖకు బడ్జెట్లో రూ.25,448.75 కోట్లు కేటాయించగా, ఇందులో సాక్షం అంగన్వాడీ, పోషణ్ 2.0 పథకాలకు రూ.20,554.31 కోట్లు, మిషన్ వాత్సల్యకు రూ.1,472 కోట్లు, మిషన్ శక్తికి రూ.3,143 కోట్లు కేటాయించారు. అలాగే సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ(సీఏఆర్ఏ), నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఛైల్డ్ రైట్స్(ఎన్సీపీసీఆర్), నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ తదితర స్వయం ప్రతిపత్తి కలిగిన విభాగాలకు రూ.168 కోట్లు కేటాయించారు. గత ఏడాది కంటే ఇది రూ.4 కోట్లు అధికం.  
పెట్టుబడి పరిమితి రెట్టింపు  
సీనియర్ సిటిజెన్ సేవింగ్ పథకం(ఎస్సీఎస్ఎస్)లో గరిష్టంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉండగా, ఈ పరిమితిని రూ.30 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలాగే పోస్టల్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ సింగిల్ అకౌంట్లో ఇకపై గరిష్టంగా రూ.9 లక్షలు (ప్రస్తుతం రూ.4.5 లక్షలు) పెట్టుబడి పెట్టొచ్చని అన్నారు. జాయింట్ అకౌంట్లో గరిష్టంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చని సూచించారు. ఇవి పెట్టుబడికి ఎలాంటి రిస్క్ లేకుండా వడ్డీ అందించే పథకాలు.   

పాత వాహనాల తుక్కుకోసం నిధులు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన పాత వాహనాలను తొలగించేందుకు అవసరమైన నిధులను కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అలాగే పాత వాహనాలు, అంబులెన్సులను వినియోగం నుంచి పక్కన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తాయన్నారు. పర్యావరణహిత ఆర్థిక వ్యవస్థ కోసం కాలుష్యకారక పాత వాహనాలను తొలగిస్తామని లోక్సభలో చెప్పారు. ప్రయాణికులు, వస్తువుల రవాణా కోసం తక్కువ వ్యయమమ్యే జలరవాణాను ప్రోత్సహిస్తామని, నిధుల అంతరాన్ని పూడ్చేందుకు దీన్ని పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో చేపడతామని చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి 15 సంవత్సరాలకు పైబడి ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రవాణా సంస్థలకు చెందిన బస్సులు, ప్రభుత్వరంగ సంస్థల వాహనాల రిజిస్ట్రేషన్ను రద్దుచేసి తొలగిస్తామని, వాటిస్థానంలో కొత్త వాహనాలను తీసుకొస్తామని ఇటీవల కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పిన సంగతి తెలిసిందే. శాంతిభద్రతల దృష్ట్యా రక్షణ శాఖకు చెందిన ఆయుధ వాహనాలు, ఇతర ప్రత్యేక వాహనాలకు ఈ నిబంధన వర్తించదని చెప్పారు.  

మైనార్టీ శాఖ నిధుల్లో 38% కోత 
మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ సారి బడ్జెట్లో భారీగా కోత పడింది. గత ఏడాదితో పోల్చి చూస్తే 38% నిధుల్ని తగ్గించారు. 2023–24 సంవత్సరానికి మైనార్టీ శాఖకి రూ.3097.60 కోట్లు కేటాయించినట్టుగా బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంలో మైనార్టీ శాఖ రూ.5,020.20 కేటాయించగా ఈసారి భారీగా కోత పడింది. ఈ సారి కేటాయించిన రూ. 3,097.60 కోట్లలో విద్యా సాధికారత కోసం రూ. 1,689 కోట్లు, నైపుణ్యాల అభివృద్ధి కోసం రూ. 65 కోట్లు, మైనార్టీల అభివృద్ధి కోసం రూ. 610 కోట్లు ఖర్చు చేయనున్నట్టు మంత్రి వివరించారు.   

హెల్త్కేర్ రంగానికి బడ్జెట్లో రూ.89,155 కోట్లు  
ఆరోగ్య రంగానికి ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం 2023–24 బడ్జెట్లో రూ.89,155 కోట్లు కేటాయించింది. గత ఏడాది రూ.79,145 కోట్లు కేటాయించగా, ఈసారి నిధులను 13 శాతం పెంచింది. ఆయుష్ శాఖకు కేటాయింపులను రూ.2,845.75 కోట్ల నుంచి రూ.3,647.50 కోట్లకు పెంచడం విశేషం. అంటే గత ఏడాది కంటే ఈ పెంపు 28 శాతంగా ఉంది. ఆరోగ్య రంగానికి కేటాయించిన రూ.89,155 కోట్లలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగానికి రూ.86,175 కోట్లు, ఆరోగ్య పరిశోధన విభాగానికి రూ.2,980 కోట్లు ఖర్చు చేయనున్నారు. తాజా బడ్జెట్లో ‘ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన’కు రూ.3,365 కోట్లు, 22 నూతన ‘ఎయిమ్స్’ల ఏర్పాటు కోసం రూ.6,835 కోట్లు కేటాయించారు. నేషనల్ హెల్త్ మిషన్కు బడ్జెట్ కేటాయింపులను రూ.28,974.29 కోట్ల నుంచి రూ.29,085.26 కోట్లకు పెంచారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు కేటాయింపులను రూ.6,412 నుంచి రూ.7,200 కోట్లకు పెంచారు. అంతేకాకుండా నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం)కు రూ.140 కోట్ల నుంచి రూ.341.02 కోట్లకు కేటాయింపులను పెంచారు. నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్కు కేటాయింపులు రూ.121 కోట్ల నుంచి రూ.133. 73 కోట్లకు పెరిగాయి. భారత వైద్య పరిశోధన మండలికి గత బడ్జెట్లో రూ.2,116.73 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.2,359.58 కోట్లు కేటాయించారు. ప్రఖ్యాత ఢిల్లీ–ఎయిమ్స్కు కేటాయింపులు రూ.4, 400.24 కోట్ల నుంచి రూ.4,134.67 కోట్లకు తగ్గడం గమనార్హం. ఆరోగ్య రంగంలో స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలకు 2022–23 బడ్జెట్లో రూ.10,348.17 కోట్లు కేటాయించగా, 2023–24 బడ్జెట్లో రూ.17,322.55 కోట్లు కేటాయించారు.  

సికిల్ సెల్ స్టేటస్ కార్డులు  
సికిల్ సెల్ స్థాయిని తెలియజేసే కార్డులను 40 ఏళ్లలోపు గిరిజనులకు ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. అంతేకాకుండా పెళ్లికి ముందు వారికి కౌన్సిలింగ్ సైతం ఇస్తామన్నారు. ఇద్దరు సికిల్సెల్ వ్యాధిగ్రస్తులు పెళ్లి చేసుకొంటే వారికి పుట్టబోయే బిడ్డ సైతం ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలియజేశారు. 
 
‘ఫార్మా’లో పరిశోధనలకు ఊతం  
దేశంలో ఫార్మాస్యూటికల్ రంగంలో పరిశోధనలకు మరింత ఊతం ఇవ్వడానికి కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఫార్మాస్యూటికల్ రంగంలో మరింత అభివృద్ధిని 
ఆకాంక్షిస్తున్నామని వెల్లడించారు.  
2047 నాటికి ‘సికిల్ సెల్’అంతం! 
దేశంలో సికిల్ సెల్ వ్యాధిని 2047 నాటికి పూర్తిగా అంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. సికిల్ సెల్ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమం అమలు చేయబోతున్నట్లు చెప్పారు. ఇదే కార్యక్రమం కింద గిరిజన ప్రాంతాల్లో 40 ఏళ్ల లోపు వయసున్న సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు, చికిత్స నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో కౌన్సెలింగ్ చేపట్టనున్నట్లు వివరించారు. అంతేకాకుండా కొత్తగా 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాట్లు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. 2014 తర్వాత ఏర్పాటు చేసిన 157 మెడికల్ కళాశాలల ప్రాంగణాల్లోనే ఈ నర్సింగ్ కాలేజీలు వస్తాయని పేర్కొన్నారు. ఎంపిక చేసిన భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ల్యాబ్ల్లో ఇకపై ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫ్యాకల్టీ సిబ్బంది సైతం పరిశోధనలు చేసుకొనే వెసులుబాటు కలి్పస్తామని తెలియజేశారు.  

రాష్ట్రపతి గృహవ్యయంలో రూ.10 కోట్ల కోత
రాష్ట్రపతి గృహవ్యయం కింద సిబ్బంది జీతాలు, రాష్ట్రపతి మంజూరు చేసే విచక్షణ గ్రాంట్లు మొదలైన వాటికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ. 36.22 కోట్లు కేటాయించింది. అయితే ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన బడ్జెట్ అంచనాలకన్నా రూ. 10 కోట్ల మేర తక్కువ కావడం గమనార్హం. ఈ బడ్జెట్లో రాష్ట్రపతి కార్యాలయం, ఇతర ఖర్చుల కోసం రూ. 90.14 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. గత బడ్జెట్తో పోలిస్తే ఈ కేటాయింపు రూ. 5.34 కోట్లు అధికం. అలాగే రాష్ట్రపతి జీతం, అలవెన్సుల కోసం రూ. 60 లక్షలు, రాష్ట్రపతి సచివాలయానికి రూ. 53.32 కోట్లు కేటాయించింది.  

దుర్బరులైన ఆదివాసీల అభ్యున్నతి రూ.15 వేల కోట్లతో పథకం 
అతి ప్రాచీన కాలం నుంచి వస్తున్న దుర్బరులైన ఆదివాసీల అభ్యున్నతిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. వారి సామాజిక, ఆర్థిక పురోగతికి ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రకటించారు.ఎస్టీల అభివృద్ధి కోసం చేపట్టే కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రూ.15 వేల కోట్లతో ప్రైమ్ మినిస్టర్ పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ (పీఎం–పీవీటీజీ) డెవలప్మెంట్ మిషన్ని వచ్చే మూడేళ్లలో అమలు చేస్తారు. ఆదిమ గిరిజన తెగల కుటుంబాలకు ప్రాథమిక సౌకర్యాలైన భద్రమైన గృహాలు, సురక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం, మెరుగైన విద్య, ఆరోగ్యం వంటివి ఈ పథకం కింద కలి్పస్తారు. వచ్చే మూడేళ్లలో రూ.15 వేల కోట్లను ఈ పథకం కింద ఖర్చు చేస్తారు.   
‘సున్నా ఉద్గారాల’ కోసం రూ. 35,000 కోట్లు 
కాలుష్యానికి కారణమవుతున్న కర్బన ఉద్గారాలను 2070 నాటికి సున్నా స్థాయికి తగ్గించుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వ ముఖ్యమైన లక్ష్యాల్లో ఒకటి. ప్రభుత్వ తొలి ఏడు ప్రాధాన్యతల్లో హరిత వృద్ధి(గ్రీన్ గ్రోత్) కూడా ఉంది. శిలాజ ఇంధనాల వినియోగం, తద్వారా కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించుకోవడానికి 2023–24 బడ్జెట్లో కేంద్ర సర్కారు రూ.35,000 కోట్లు కేటాయించింది. లైఫ్(పర్యావరణ హిత జీవనశైలి) అనేది ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పర్యావరణానికి హాని కలిగించని జీవనశైలిని ఒక ఉద్యమంగా సాగించాల్సిన అవసరం ఉందన్నారు. హరిత పారిశ్రామిక, ఆర్థిక వ్యవస్థ దిశగా మన ప్రయాణం సాగాలని  పిలుపునిచ్చారు. పెట్రోలియం, సహజ వాయు శాఖ ఆధ్వర్యంలో ఇంధన భద్రత, కర్బన ఉద్గారాల తగ్గింపునకు పెట్టుబడి కింద తాజా బడ్జెట్లో రూ.35,000 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. రూ.19,700 కోట్లతో ఇటీవలే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రారంభించినట్లు గుర్తుచేశారు. 2030 నాటికి ప్రతిఏటా ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వివరించారు. 4,000 ఎండబ్ల్యూహెచ్ బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్స్ కోసం నిధులు సమకూరుస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు.  
 

 

#Tags