AP New Airports: ఏపీలో ఆరు కొత్త ఎయిర్‌‌పోర్టులు.. నిధులు విడుదల

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో ఆరు చోట్ల ఎయిర్ పోర్టులు అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

వీటి సాధ్యాసాధ్యాల నివేదక తయారు చేసే బాధ్యతను ఎయిర్పోర్ట్ అథా రిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి అప్పగించింది. ఇందుకోసం రూ.1.92 కోట్లను కేటాయిస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇప్పటికే నెల్లూరు జిల్లా దగదర్తి వద్ద కొత్తగా కట్టే ఎయిర్ పోర్టుకు అదనంగా కుప్పం, నాగార్జున సాగర్, తాడేపల్లిగూడెం, తుని-అన్నవరం, శ్రీకాకుళం, ఒంగోలు వద్ద ఎయిరుపోర్టులు నిర్మించడానికి ఏపీ ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఏడీసీ ఎల్) ప్రతిపాదనలను సిద్ధం చేసింది. 

కుప్పం ఎయిర్పోర్టు నిర్మాణానికి 1,501.57 ఎకరాలు, నాగార్జునసాగర్ వద్ద 1,670.61 ఎకరాలు, తాడేపల్లిగూడెంలో 1,123.06 ఎకరాలు, శ్రీకాకుళంలో 1,383.71 ఎకరాలు, తుని-అన్నవరంలో 787.08 ఎకరాలు, ఒంగోలులో 657.57 ఎకరాల భూమిని ప్రభుత్వం గుర్తించింది.

Missile Testing: ఆంధ్రప్రదేశ్​లో క్షిపణి ప్రయోగ కేంద్రం

#Tags