World Sports Journalists Day: జూన్ 2న‌ అంతర్జాతీయ క్రీడా జర్నలిస్ట్‌ల దినోత్సవం

ప్రతి సంవత్సరం జూన్ 2వ తేదీన అంతర్జాతీయ క్రీడా జర్నలిస్ట్‌ల దినోత్సవం జరుపుకుంటారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా జర్నలిస్టులు చేసే అమూల్యమైన పనిని గుర్తించడం, వారిని మరింత మెరుగ్గా పనిచేసేలా ప్రోత్సహించడ‌మే ఈ రోజును జరుపుకోవడం వెనుక ఉన్న ఉద్దేశ్యం. 

1924 జూలై 2న పారిస్‌లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ సందర్భంగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్ (AIPS) స్థాపించబడింది. 1994లో, ఏఐపీసీ తన 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజును అధికారికంగా అంతర్జాతీయ క్రీడా జర్నలిస్ట్‌ల దినోత్సవంగా ప్రకటించింది.

క్రీడా జర్నలిస్టుల పాత్ర ఇదే..
➣ క్రీడా జర్నలిస్టులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్రీడా పోటీల గురించి తాజా సమాచారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తారు.
➣ వారు వార్తా కథనాలు, వ్యాఖ్యానాలు, విశ్లేషణలు, ఇంటర్వ్యూల ద్వారా ప్రేక్షకులకు ఆసక్తికరమైన, సమాచారపూర్వక కంటెంట్‌ను అందిస్తారు.
➣ క్రీడా జర్నలిజం కేవలం వార్తలను అందించడం మాత్రమే కాదు, అభిమానులతో క్రీడా సంస్కృతిని పెంపొందించడంలో కూడా సహాయపడుతుంది.

World Day to Combat Desertification and Drought: జూన్ 17వ తేదీ ప్రపంచ ఎడారీకరణ, కరువు నిరోధక దినోత్సవం

#Tags