World Food Safety Day 2024: జూన్ 7వ తేదీ ప్ర‌పంచ ఆహార భ‌ద్ర‌త దినోత్స‌వం.. ఈ ఏడాది థీమ్ ఇదే..

ప్ర‌తి సంవ‌త్స‌రం జూన్ 7వ తేదీ ప్ర‌పంచ ఆహార భ‌ద్ర‌త దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటారు.

వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ ఐక్య‌రాజ్య‌స‌మితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఆర్గ‌నైజేష‌న్ స‌హ‌కారంతో ఈ దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తుంది.

ఆహార భద్రత దినోత్సవాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లో మొదలుపెట్టింది. తినే తిండి వల్ల కలిగే నష్టాలపై, రాగల ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, తద్వారా మానవ ఆరోగ్యానికి, ఆహార భద్రతకు, ఆర్థిక అభివృద్ధి, వ్యవసాయానికి, పర్యాటకానికి సాయపడటం లక్ష్యం.  

World Environment Day: జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం..
 
ఈ సంవత్సరం థీమ్ ఇదే..
ఈ సంవ‌త్స‌రం డ‌బ్ల్యుహెచ్ఓ "ఆహార భద్రత: ఊహించని వాటి కోసం సిద్ధం చేయండి(Food Safety: Prepare for the Unexpected)." అనే థీమ్‌ను ఎంచుకుంది. ఈ థీమ్ ఆహార భద్రత సంఘటనల తీవ్రతతో సంబంధం లేకుండా వాటికి సిద్ధంగా ఉండటం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతోంది. 

ఆహార భ‌ద్ర‌త అనేది ప్ర‌భుత్వాలు, ఉత్ప‌త్తిదారులు, వినియోగ‌దారులు మ‌ధ్య భాగ‌స్వామ్య బాధ్య‌త‌. అంతేకాదు మ‌నం తీసుకునే ఆహారం సుర‌క్షిత‌మైన‌దేనా అని నిర్థారించ‌డంలో రైతు నుంచి కూలి వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రి పాత్ర ఉంది. ఆహార భ‌ద్ర‌త కోసం త‌గు చ‌ర్య‌లు తీసుకునేలా ప్ర‌పంచ దేశాల‌ను ప్రోత్స‌హించ‌డం, ఆహార కొర‌త స‌మ‌స్య ఉత్ప‌న్నం కాకుండా చూడ‌డం, ప్ర‌జ‌లు ర‌క‌ర‌కాల వ్యాధుల‌ను ఎదుర్కోనేలా వారికి పౌష్టిక‌ర‌మైన ఆహారం అందుబాటులో ఉండేలా చేయ‌డం వంటివి త‌మ ప్ర‌ధాన ఎజెండాగా డ‌బ్ల్యుహెచ్ఓ పేర్కొంది.

World Hunger Day 2024: మే 28వ తేదీ  'ప్రపంచ ఆకలి దినోత్సవం'..

#Tags