National Technology Day 2024: మే 11వ తేదీ జాతీయ సాంకేతిక దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..
1998లో భారతదేశం పోఖ్రాన్‌లో అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించినందుకు ఈ రోజును గుర్తుంచుకుంటారు. ఈ పరీక్షల ఫలితంగా భారతదేశం అణు ఆయుధాలు కలిగిన ఆరవ దేశంగా అవతరించింది. దేశ శాస్త్ర, సాంకేతిక రంగాలలో సాధించిన గణనీయమైన పురోగతిని స్మరించుకోవడానికి ఈ దినోత్సవం ఒక అవకాశం.
2024 సంవత్సరం యొక్క థీమ్ “పాఠశాలల నుంచి స్టార్టప్‌ల వరకు: యువ మనస్సును ఆవిష్కరించడం(From Schools to Startups: Igniting Young Minds to Innovate).”
World Lupus Day 2024: ప్రపంచ లూపస్ దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..
దీని చరిత్ర ఇదే..
1998 మే 11వ తేదీ భారత సైన్యం రాజస్థాన్‌లోని పోఖ్రాన్ టెస్ట్ రేంజ్‌లో శక్తి-1 అనే అణు క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షకు అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నాయకత్వం వహించారు. దీనిని ఆపరేషన్ శక్తి లేదా పోఖ్రాన్-2 అని కూడా పిలుస్తారు. రెండు రోజుల తరువాత, భారతదేశం మరో రెండు అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది.
ఈ పరీక్షల ఫలితంగా అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి భారతదేశాన్ని అణు రాష్ట్రంగా ప్రకటించారు. అలాగే మే 11వ తేదీని జాతీయ సాంకేతిక దినంగా స్థాపించారు. 1999 నుంచి టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డు (టీడీబీ) ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుతోంది.