International Friendship Day: జూలై 30వ తేదీ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం

ప్రతి సంవత్సరం జూలై 30వ తేదీ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటారు.

1935వ సంవత్సరం ఆగస్టు మొదటి శనివారం రోజున అమెరికా ప్రభుత్వం చేతిలో చనిపోయిన తన స్నేహితుడిని మర్చిపోలేని మరో స్నేహితుడు ఆ తర్వాత రోజైన ఆదివారం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీనికి చలించిపోయిన అమెరికా ప్రభుత్వం 1935లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల రోజుగా ప్రకటించింది. 

ఆ తర్వాత 1958లో పరాగ్వేలో వరల్డ్‌ ఫ్రెండ్‌షిప్‌ క్రూసేడ్‌ అనే సంస్థ జూలై 30న ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించగా.. క్రమంగా చాలా దేశాలు దీన్ని పాటించడం మొదలు పెట్టాయి. దీంతో ఐక్యరాజ్యసమితి 2011లో ఆ రోజును అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. 

2024 సంవత్సరానికి ప్రత్యేకమైన థీమ్ ఇంకా ప్రకటించబడలేదు. అయితే.. అంతర్జాతీయ స్నేహ దినోత్సవం యొక్క ప్రధాన సందేశం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. ప్రజలు, దేశాలు, సంస్కృతులు, వ్యక్తుల మధ్య స్నేహాన్ని ప్రోత్సహించడం ద్వారా శాంతి ప్రయత్నాలకు ప్రేరణనివ్వడం, సమాజాల మధ్య వారధులు నిర్మించడం.

International Tiger Day 2024: జూలై 29వ తేదీ అంతర్జాతీయ పులుల దినోత్సవం

#Tags