World Wetland Day 2024: నేడు ప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం..

ప్ర‌తి సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 2వ తేదీ ప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవాన్ని జ‌రుపుకుంటారు.

ఈ సంవ‌త్స‌రం దక్షిణాసియాలోనే అత్యధిక చిత్తడి నేలలు కలిగిన దేశంగా భారత్ రికార్డు నమోదు చేసింది. జనవరి 2024 నాటికి 1.33 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో 80 రామ్‌సర్ సైట్లను కలిగి ఉంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 5 కొత్త రామ్‌సర్ సైట్లను గుర్తించడంతో ఈ సంఖ్య ప్రస్తుతం 80కి చేరింది. భారత్ పర్యావరణ సంరక్షణలో అంకితభావాన్ని ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది దినోత్స‌వంపై 'వెట్‌ల్యాండ్స్ అండ్ హ్యూమన్ వెల్‌బీయింగ్' అనే థీమ్‌పై దృష్టి సారించారు. 

ఈ సంవత్సరం భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ & వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి 2022లో నియమించిన రామ్‌సర్ సైట్‌లోని సిర్పూర్ సరస్సు, ఇండోర్‌లో జాతీయ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వ‌హించ‌నున్నారు.

Bharat Ratna: ‘భారత రత్న’ అందుకున్న ప్రముఖులు వీరే..

చిత్తడి నేలల ప్రాధాన్యాన్ని గుర్తించడంతో పాటు వాటి పరిరక్షణ, అభివృద్ధి కోసం కృషి చేయాలని ఇరాన్‌లోని రామ్సార్‌లో 1971లో ప్రపంచ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అప్ప‌టి నుంచి ప్ర‌తి సంవత్స‌రం ఫిబ్రవరి 2వ‌ తేదీ చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. వరద రక్షణ, స్వచ్ఛమైన నీరు, జీవవైవిధ్యం, మానవ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం అవసరమైన వినోద అవకాశాలను అందించడం ద్వారా మన జీవితాలను మెరుగుపరచడంలో చిత్తడి నేలలు కీలక పాత్ర పోషిస్తాయి. మంచినీటితో పాటు ఉప్పునీటి సరస్సులు, తంపర, బీల భూములు, పగడపు దిబ్బలు, మడ అడవులు తదితర 19 రకాల ప్రాంతాలు చిత్తడి నేలల కిందకు వస్తాయి.

 

#Tags