Daily Current Affairs in Telugu: 02 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
02 November Daily Current Affairs in Telugu

1. జాతీయ క్రీడల్లో మహిళల 4X100 మీటర్ల రిలే ఫైనల్లో చెలిమి ప్రత్యూష, భవానీ యాదవ్, మధుకావ్య, జ్యోతి యర్రాజీలతో కూడిన ఏపీ బృందం పోటీని 45.61 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. మహిళల జావెలిన్‌ త్రోలో బల్లెంను 52.55 మీటర్ల దూరం విసిరి ఏపీకి చెందిన రష్మీ శెట్టి కాంస్యం నెగ్గింది.

2. అమెరికాకు చెందిన అడోబ్‌ కంపెనీ సీఈవో పద్మశ్రీ శంతను నారాయణ్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం 49వ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు.

Daily Current Affairs in Telugu: 31 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

3. అత్యంత శక్తిమంతమైన సూపర్‌ అణు బాంబును తయారు చేయనున్నట్టు అమెరికా  ప్రకటించింది.

4. ఎస్సీ, ఎస్టీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఉన్నతి–మహిళా శక్తి అనే ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది.

5. భారత నావికాదళంలోని తూర్పు నావికా విభాగం బ్రహ్మోస్‌ క్షిపణిని బుధవారం విజయవంతంగా పరీక్షించింది.

Daily Current Affairs in Telugu: 30 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

6. గోవాలో జరుగుతున్న జాతీయ క్రీడల్లో మహిళల స్విమ్మింగ్‌ 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ ఈవెంట్‌లో వ్రితి అగర్వాల్‌ కాంస్య పతకం నెగ్గి ఈ క్రీడల్లో మూడో పతకం సాధించింది.

7. ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ వ్యక్తిగత విభాగంలో ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ పసిడి పతకం గెలిచాడు.
పురుషుల 25 మీటర్ల సెంటర్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్‌ వ్యక్తిగత విభాగంలో ప్రదీప్‌ సింగ్‌ షెఖావత్‌ 582 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు.

8. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు అక్టోబర్‌లో భారీగా రూ.1.72 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

9. భారత్, బంగ్లాదేశ్‌ ప్రధానులు నరేంద్ర మోదీ, షేక్‌ హసీనాలు సంయుక్తంగా త్రిపురలోని నిశ్చింతపుర్‌, గంగాసాగర్‌ను బంగ్లాదేశ్‌తో కలుపుతూ 65 కిలోమీటర్ల ఖుల్నా–మోంగ్లా పోర్ట్‌ రైల్వే లైన్, బంగ్లాలోని రామ్‌పూర్‌లో ఉన్న మైత్రీ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్టులను ప్రారంభించారు. 

Daily Current Affairs in Telugu: 28 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

#Tags