Oscar 2023: సత్తా చాటిన 'RRR'.. 'నాటు నాటు' పాటకు ఆస్కార్

విశ్వ వేదికపై తెలుగు సినిమా 'RRR' సత్తా చాటింది.

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘నాటునాటు’ పాట ఆస్కార్‌ అవార్డును గెలుపొందింది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో హాలీవుడ్‌ సాంగ్స్‌ను వెనక్కి నెట్టి తెలుగు పాట విజేతగా అవతరించింది. భారతీయ పాటకు అందులోనా ఓ తెలుగు సాంగ్‌కు ఆస్కార్‌ రావడం ఇదే మొదటిసారి. కాగా బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో లిఫ్ట్‌ మీ అప్‌(బ్లాక్‌ పాంథర్‌), టెల్‌ ఇట్‌ లైక్‌ ఎ ఉమెన్‌, హోల్డ్‌ మై హాండ్‌(టాప్‌ గన్‌ మార్వెరిక్‌), టీజ్‌ ఇస్‌ ఎ లైఫ్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఇట్‌ వన్స్‌) పాటలు పోటీపడ్డాయి. వేదికపై గేయ రచయిత చంద్రబోస్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి అవార్డును అందుకున్నారు.

Oscar Awards 2023 : ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్‌లో.. ఎంపికైన ఆర్ఆర్ఆర్ సాంగ్ ఇదే.. అలాగే భార‌త్ నుంచి..


నాటు నాటు పాట విషయానికి వస్తే..
సుమారు ఏడాదిన్నర పాటు శ్రమించి చంద్రబోస్‌ లిరిక్స్‌ రాయగా.. రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ నాటు నాటు పాటను ఆలపించారు. హీరోలు రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లు స్టెప్టులేశారు. కీరవాణి ట్యూన్‌ సెట్‌ చేశారు. ఇకపోతే నాటు నాటు పాట షూటింగ్‌ ఉక్రెయిన్‌ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ అధికారిక భవనం మరియిన్‌స్కీ ప్యాలెస్‌ ముందు జరిగింది. ఈ పాటకు ప్రేమ్‌ రక్షిత్‌ కొరియోగ్రఫీ చేశారు.

Oscar Awards: ఆస్కార్ అందుకున్న భార‌తీయులు ఎంత మందో తెలుసా.. అందుకే ఈ అవార్డుల‌కు అంత క్రేజ్‌.!

#Tags