Oscar Award Winners 2022: ఆస్కార్ అవార్డుల విజేతలు వీరే.. భార‌త్‌కు..

ఒక్కసారైనా ఆస్కార్‌ అవార్డును ముద్దాడాలనేది ఎంతోమంది కల. ఈ అవార్డు వరిస్తే చాలు ప్రపంచాన్నే జయించినంత హ్యాపీగా ఫీలవుతారు తారలు.
Oscar Award Winners 2022

అలాంటి అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుల ప్రదానం కరోనా వల్ల గత రెండేళ్లు నీరసంగా సాగింది. ప్రేక్షకులు లేకుండానే తూతూమంత్రంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కానీ ఈసారి మాత్రం ఆస్కార్‌ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 94వ ఆస్కార్‌ అవార్డుల వేడుక మార్చి 28వ తేదీ (సోమవారం) ఉదయం అట్టహాసంగా మొదలైంది. సెలబ్రిటీలు, ప్రేక్షకుల సమక్షంలో విజేతలను ప్రకటించారు ఆస్కార్‌ నిర్వాహకులు. ఆస్కార్‌ పోటీల్లో 'డ్యూన్‌', 'చైల్డ్‌ ఆఫ్‌ డెఫ్‌ అడల్ట్స్‌(CODA)' సినిమాలు సత్తా చాటాయి. CODA మూడు విభాగాల్లో, డ్యూన్‌ ఆరు విభాగాల్లో అవార్డులను ఎగరేసుకుపోయాయి. మరోవైపు బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫియేచర్‌ విభాగంలో పోటీపడిన భారతీయ చిత్రం 'రైటింగ్‌ విత్‌ ఫైర్‌'కు నిరాశే ఎదురైంది. ఈ అవార్డును సమ్మర్‌ ఆఫ్‌ సోల్‌ కైవసం చేసుకుంది. 


ఆస్కార్‌ అవార్డును కైవం చేసుకుంది వీళ్లే..

☛ ఉత్తమ చిత్రం - చైల్డ్‌ ఆఫ్‌ డెఫ్‌ అడల్ట్స్‌(CODA)
☛ ఉత్తమ నటుడు - విల్‌ స్మిత్‌ (కింగ్‌ రిచర్డ్‌)
☛ ఉత్తమ నటి -  జెస్సికా చస్టేన్‌ (ద ఐస్‌ ఆఫ్‌ టామీ ఫే)
☛ ఉత్తమ దర్శకురాలు - జేన్‌ కాంపియన్‌ (ది పవర్‌ ఆఫ్‌ ద డాగ్‌)
☛ ఉత్తమ సహాయ నటి - అరియానా దిబోస్‌ (వెస్ట్‌ సైడ్‌ స్టోరీ)
☛ ఉత్తమ సహాయ నటుడు - ట్రాయ్‌ కోట్సర్‌ (CODA)
☛ ఉత్తమ సినిమాటోగ్రఫీ - గ్రెగ్‌ ఫ్రెజర్‌ (డ్యూన్‌)
☛ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ - నో టైమ్‌ టు డై
☛ బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫియేచర్‌ - సమ్మర్‌ ఆఫ్‌ సోల్‌
☛ బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే-  CODA (షాన్‌ హెడర్‌)
☛ బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే - బెల్‌ఫాస్ట్‌ (కెన్నత్‌ బ్రానా)
☛ బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌ - జెన్నీ బీవన్‌ (క్రూయెల్లా)
☛ బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫియేచర్‌ - డ్రైవ్‌ మై కార్‌ (జపాన్‌)
☛ బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫియేచర్‌ - ఎన్‌కాంటో
☛ బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ - హన్స్‌ జిమ్మర్‌ (డ్యూన్‌)
☛ బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ - డ్యూన్‌ (పాల్‌ లాంబర్ట్‌, ట్రిస్టన్‌ మైల్స్‌, బ్రియన్‌ కానర్‌, గెర్డ్‌ నెఫ్‌జర్‌)
☛ బెస్ట్‌ ఫిలిం ఎడిటింగ్‌ - జో వాకర్‌ (డ్యూన్‌)

☛ బెస్ట్‌ సౌండ్‌ - డ్యూన్‌ (మాక్‌ రుత్‌, మార్క్‌ మాంగిని, థియో గ్రీన్‌, డగ్‌ హెంఫిల్‌, రాన్‌ బార్ట్‌లెట్‌)
☛ బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ - డ్యూన్‌ (ప్రొడక్షన్‌ డిజైన్‌- పాట్రైస్‌ వెర్మట్‌, సెట్‌ డెకరేషన్‌- జుజానా సిపోస్‌)
☛ బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌స్టైలింగ్‌ - ద ఐస్‌ ఆఫ్‌ ది టామీ ఫే (లిండా డౌడ్స్‌, స్టెఫనీ ఇన్‌గ్రామ్‌, జస్టిన్‌ రాలే)
☛ బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిలిం: ది లాంగ్‌ గుడ్‌బై
☛ బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిలిం: ది విండ్‌షీల్డ్‌ పైపర్‌
☛ బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం: ద క్వీన్‌ ఆఫ్‌ బాస్కెట్‌బాల్‌

ఆస్కార్ అవార్డులు-2020

ఆస్కార్ అవార్డులు-2019

ఆస్కార్ అవార్డులు - 2017

2016 ఆస్కార్ అవార్డులు

2015 ఆస్కార్ పురస్కారాలు

#Tags