Pulitzer Prizes 2022: పులిట్జర్‌ అవార్డుకు ఎంపికైన భారతీయ ఫోటో జర్నలిస్టు?

భారత్‌లో కోవిడ్‌ మరణాలపై డానిష్‌ సిద్దిఖి బృందం తీసిన ఫొటో

భారతీయ ఫోటో జర్నలిస్టు, అఫ్గానిస్తాన్‌ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన రాయటర్స్‌ సంస్థకు చెందిన ఫోటోగ్రాఫర్‌ డానిష్‌ సిద్దిఖికి ప్రతిష్టాత్మక పులిట్జర్‌ అవార్డు–2022 లభించింది. సిద్దిఖితో పాటు మరో ముగ్గురు భారతీయులు, ఆయన సహచర ఫొటోగ్రాఫర్లు అద్నాన్‌ అబిది, సనా ఇర్షాద్‌ మట్టో, అమిత్‌ దేవ్‌లకు ఫీచర్‌ ఫోటోగ్రఫీ కేటగిరీలో ఈ అవార్డు లభించింది. భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న సమయంలో మరణ మృదంగాన్ని అద్దం పట్టేలా అద్భుతంగా తమ కెమెరాలో బంధించినందుకు ఈ నలుగురు భారతీయులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇక జర్నలిజం ప్రజాసేవ విభాగంలో అమెరికా పార్లమెంటు భవనంపై దాడికి సంబంధించిన కవరేజికిగాను వాషింగ్టన్‌ పోస్టుకి పులిట్జర్‌ అవార్డు లభించింది.

GK Important Dates Quiz: అంతర్జాతీయ గనుల అవగాహన దినోత్సవం?

డానిష్‌కి రెండోసారి..

  • డానిష్‌ సిద్దిఖికీ పులిట్జర్‌ అవార్డు రావడం ఇది రెండోసారి. 2018లో రోహింగ్యా సంక్షోభం కవరేజీలో ఒక మహిళ దేశాన్ని వీడి వెళ్లిపోతూ నేలని తాకుతున్న ఫొటోకి ఆయనకి ఈ అవార్డు లభించింది. 
  • 38 ఏళ్ల వయసున్న సిద్దిఖి 2021 ఏడాది అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు తమ వశం చేసుకున్నప్పుడు జరిగిన ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయారు. అఫ్గాన్‌ సంక్షోభం కవరేజీకి వెళ్లిన సిద్దిఖి కాందహార్‌ నగరంలో 2021, జూలైలో అఫ్గాన్‌ సైన్యానికి, తాలిబన్లకి మధ్య కాల్పుల్ని కవర్‌ చేస్తుండగా తూటాలకు బలయ్యారు.
  • అఫ్గాన్‌ కల్లోలం, హాంగ్‌కాంగ్‌ నిరసనలు, ఆసియా, యూరప్, మధ్యప్రాచ్య దేశాల్లో ఎక్కడా సంక్షోభం తలెత్తినా డానిష్‌ సిద్ధిఖి విస్తృతంగా కవర్‌ చేశారు. ఢిల్లీకి చెందిన సిద్ధికి మాస్‌ కమ్యూనికేషన్లు, ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ చేశారు. 2010లో రాయటర్స్‌ సంస్థలో చేరారు.​​​​​​​

FAO: ఛాంపియన్‌ అవార్డుకు భారత్‌ నుంచి నామినేట్‌ అయిన వ్యవస్థ?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
పులిట్జర్‌ అవార్డు–2022(ఫీచర్‌ ఫోటోగ్రఫీ కేటగిరీలో) ఎంపికైన భారతీయులు?
ఎప్పుడు : మే 10
ఎవరు    : అఫ్గానిస్తాన్‌ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన రాయటర్స్‌ సంస్థకు చెందిన ఫోటోగ్రాఫర్‌ డానిష్‌ సిద్దిఖితో పాటు ఆయన సహచర ఫొటోగ్రాఫర్లు అద్నాన్‌ అబిది, సనా ఇర్షాద్‌ మట్టో, అమిత్‌ దేవ్‌
ఎందుకు    : భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న సమయంలో మరణ మృదంగాన్ని అద్దం పట్టేలా అద్భుతంగా తమ కెమెరాలో బంధించినందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags