World Record: ఒకేరోజు 13,326 గ్రామసభలు.. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ సంస్థ గుర్తింపు

ఒకే రోజు అత్యధిక గ్రామ సభలు నిర్వహించినందుకు గానూ.. ఏపీ పంచాయతీరాజ్ శాఖకు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ సంస్థ రికార్డ్ పత్రం, మెడల్‌ను ప్రకటించింది.

ఆగ‌స్టు 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో చేపట్టబోయే అభివృద్ధి పనులపై ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించినట్లు ప్రభుత్వం ప్రకటించుంది. 

ఈ నేపథ్యంలో వరల్డ్ రికార్డ్స్ యూనియన్ సంస్థ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ సెప్టెంబ‌ర్ 16వ తేదీ ఉప ముఖ్యమంత్రి పవన్‌క‌ళ్యాణ్‌ను మంగళగిరిలోని ఆయన నివాసంలో కలిసి రికార్డ్ పత్రం, మెడల్ను అందజేశారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, డైరెక్టర్ కృష్ణతేజ, ఉపాధి హామీ పథకం డైరెక్టర్ షణ్ముఖ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

World Records: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో శ్రీశైలం దేవస్థానం

#Tags