CUET PG Exams 2024 : సీయూఈటీ పీజీ ప్రవేశ పరీక్షలు ప్రారంభం, మార్చి 28 వరకు పరీక్షలు
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ) పీజీ 2024 ప్రవేశ పరీక్షలు మార్చి 11 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 28వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.
ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. మొత్తం 157 సబ్జెక్టుల్లో పరీక్ష ఉంటుంది.దేశ వ్యాప్తంగా ఈ పరీక్షకు దాదాపు 4,62,589 మంది దరఖాస్తు చేసుకున్నారు. సీయూఈటీ- 2024లో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు పీజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తాయి.
వీటిల్లో సెంట్రల్ యూనివర్సిటీలతోపాటు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తోన్న విద్యాసంస్థలు, రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యాసంస్థలు కూడా ఉన్నాయి.
#Tags