CUET Exam Changes In 2025: యూనివర్శిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET)లో మార్పులు
యూనివర్శిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) యూజీ, పీజీ పరీక్షల విధానంలో కొన్ని మార్పులు చేయనున్నట్లు యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. నిపుణుల ప్యానెల్ సమీక్షించిన తర్వాత 2025 నుంచి పేపర్ పాటర్న్, సిలబస్, పరీక్ష సమయం వంటి పలు అంశాల్లో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. గత కొన్నాళ్లుగా ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకొని పరీక్ష నిర్వహణను మరింత మెరుగుపర్చడం అవసరమని పేర్కొన్నారు.
''ఇటీవలి సమావేశంలో కమిషన్ ఈ సిఫార్సులను పరిగణలోనికి తీసుకుంది. ప్యానల్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా 2025 నుంచి సిలబస్‌లో కొన్ని మార్పులు చేయబోతున్నాం. దీనికోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహా పలు సంస్థల నుంచి సలహాలను ఆహ్వానిస్తున్నాం. గతేడాది జరిగిన తప్పులు ఈసారి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం'' అని జగదీష్ కుమార్ వివరించారు.
Apprenticeship: అప్రెంటిస్ మేళాకు 43 మంది ఎంపిక
కాగా సెంట్రల్ వర్సిటీలు, ఇతర వర్సిటీల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET)ని నిర్వహిస్తారు. ఇందులో సాధించిన స్కోర్ ఆధారంగా.. విద్యార్థులు దేశంలోని అన్ని సెంట్రల్ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకుని ప్రవేశ ప్రక్రియలో పాల్గొనొచ్చనే విషయం తెలిసిందే.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags