CUET (PG) 2024: క్యూట్‌ పీజీసెట్‌కు 4.62 లక్షల మంది హాజరు.. ఈసారి దేశం వెలుపల పరీక్షలు

సాక్షి, అమరావతి: దేశంలోని కేంద్రీయ విశ్వ­విద్యాలయాలు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (క్యూట్‌–పీజీ) విజయవంతంగా ముగిసి­నట్టు యూజీసీ చైర్మన్‌ మామిడాల జగదీశ్‌ కుమార్‌ మార్చి 29న‌ ‘సాక్షి’కి తెలిపారు.

మార్చి 11వ తేదీ నుంచి 28 వరకు 565 కేంద్రాల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు విధానంలో పరీక్షలు నిర్వహించామన్నారు. భారత్‌లోని 253 నగరాలతో పాటు దేశం వెలుపల మనమా, దుబాయ్, ఖట్మాండు, మస్కట్, రియాద్, ఒట్టావా, అబుదాబి, వియన్నా, ఖతార్‌లాంటి నగరాల్లోనూ పరీక్షలు చేపట్టామన్నారు.

చదవండి: Good News: ఇక నుంచి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) ద్వారా పిహెచ్‌డి ప్రవేశం... ఎలా అంటే

2024–25 విద్యా సంవత్సరం పీజీ ప్రవేశాలకు క్యూట్‌లో 190 వర్సిటీలు పాల్గొన్నట్టు పేర్కొన్నారు. ఇందులో 4.62లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 7.68లక్షల టెస్టులు నిర్వహించామన్నారు.

950 మంది నిపుణులు, 200 మంది అనువాదకులు ప్రశ్న పత్రాలను తయారు చేయడంలో భాగస్వాములయ్యారని వివరించారు.   

#Tags