IFS: ఐఎఫ్‌ఎస్‌ ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థుల సత్తా

యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (యూపీఎస్సీ) అక్టోబర్‌ 29న విడుదల చేసిన ఇండియన్ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ (ఐఎఫ్‌ఎస్‌)–2020 ఫలితాల్లో రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు సత్తా చాటారు.
ఐఎఫ్‌ఎస్‌ ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థుల సత్తా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్సార్‌ జిల్లా నందలూరుకు చెందిన గొబ్బిళ్ల విద్యాధరి జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్‌ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. విద్యాధరి ఇటీవల సివిల్స్‌–2020 తుది ఫలితాల్లో 211వ ర్యాంక్‌ సాధించిన సంగతి తెలిసిందే. అటు సివిల్స్, ఇటు ఐఎఫ్‌ఎస్‌లోఉత్తీర్ణత సాధించిన విద్యాధరిని పలువురు ప్రశంసించారు.

మూడో ర్యాంక్‌ సాధించిన విష్ణు

విజయవాడ రామలింగేశ్వరనగర్‌కు చెందిన పాల్వాయి విష్ణువర్ధన్ రెడ్డి ఇండియన్ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌)లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించాడు. గోవాలోని బిట్స్‌ పిలానీలో బీటెక్‌ పూర్తి చేసిన విష్ణు తన నాలుగో ప్రయత్నంలో ఐఎఫ్‌ఎస్‌లో సత్తా చాటాడు. విష్ణువర్ధన్ రెడ్డి తండ్రి నరసింహారెడ్డి కానూరులో ఓ అకాడమీ డైరెక్టర్‌ కాగా, తల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు.

#Tags