Good News For Womens : మహిళలకు శుభవార్త.. ఇక ప్రతి నెలా అకౌంట్లలోకి రూ.2,500.. అర్హతలు ఇవే..!
ఇక ప్రతి నెలా అకౌంట్లలోకి రూ. 2,500 వచ్చి పడనున్నాయి. ఈ అంశంపై మంత్రి కీలక ప్రకటన చేసింది.
అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళకు రూ. 2500 చొప్పున అందిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. త్వరలోనే ఈ స్కీమ్‌ను అమలు చేస్తామని వెల్లడించారు. అలాగే ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, అలాగే రూ.5 లక్షలు అందించే పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేస్తామని మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే..
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ప్రకటించిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా అన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటికే కొన్ని పథకాలను అమలులోకి తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవలే లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా మరికొన్ని హామీలను అమలు చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు పలువురు మంత్రులు ఇప్పటికే చేప్పారు. మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కీలక ప్రకటన చేశారు.
మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే పథకం ఎప్పుడు ప్రారంభం అంటే..?
తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు రూ.2500 అందుతాయన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోందని అన్నారు. ఎటువంటి పింఛన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నెలకు రూ.2500 అందేలా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. అంతే కాకుండా జులై నుంచి దీన్ని ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.