Degree Courses Duration : మారిన రూల్స్‌.. ఇక‌పై డిగ్రీ ఎన్ని సంవ‌త్సరాలు చ‌ద‌వాలంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : 2025-26 విద్యా సంవత్సరం నుంచి మూడేళ్ల డిగ్రీ రెండేళ్లలో పూర్తి చేసే వెసులుబాటును తెచ్చే ఆలోచన చేస్తున్నట్లు యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ తెలిపారు.

కొత్తగా తీసుకురావాలని భావిస్తున్న ఈ విద్యా విధానంలో మూడేళ్ల డిగ్రీ కోర్సును రెండున్నర సంవత్సరాల్లోనే పూర్తి చేయాలని విద్యార్థులు భావిస్తే ఆ ఆప్షన్ ఎంచుకునే అవకాశం ఇస్తామని వెల్లడించారు.

వారికి మేలు జరుగుతుంద‌నే..
నాలుగేళ్ల డిగ్రీ కోర్సును మూడేళ్లలో పూర్తి చేసే అవకాశం కూడా విద్యార్థులకు కల్పిస్తామని పేర్కొన్నారు. సమర్థులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని త్వరితగతిన డిగ్రీ పూర్తి చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ మార్పు మాత్రమే కాదు.. చదువులో కాస్త వెనుకబడిన విద్యార్థులకు, వ్యక్తిగత పరిస్థితులు అనుకూలించక డిగ్రీ పూర్తి చేసే సమయంలో గ్యాప్ తీసుకున్న విద్యార్థులకు మూడేళ్ల డిగ్రీ కోర్సులను నాలుగేళ్లు, నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ఐదేళ్లలో పూర్తి చేసే అవకాశం కల్పిస్తామని జ‌గదీష్ కుమార్ తెలిపారు. 

డిగ్రీ తర్వాత విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాలను సాధించే విషయంలో రాజీ పడకుండా ముందుకెళ్లాలనే సదుద్దేశంతో యూజీసీ ఈ మార్పులు చేయాలని నిర్ణయించినట్లు జగదీష్ కుమార్ చెప్పారు. డిగ్రీని త్వరగా పూర్తి చేయడం వల్ల ఉద్యోగాల వైపు వెళ్లే వారికి, ఉన్నత చదువులు అభ్యసించేందుకు సిద్ధమైన వారికి మేలు జరుగుతుందన్నారు.

#Tags