Online Admissions: ఇంటర్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు

కళాశాల ప్రవేశానికిక దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటనను విడుదల చేశారు ఏపీఆర్‌జేసీ కళాశాల ప్రిన్సిపాల్‌.

పరిగి: ఏపీఆర్‌జేసీలో ఇంటర్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు పరిగి మండలం కొడిగెనహళ్లిలోని ఏపీఆర్‌జేసీ ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2024–25 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్రంలోని ఏడు జూనియర్‌ కళాశాలలతో పాటు నాగార్జున సాగర్‌లోని డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

NEST Notification 2024 Details : ఇంట‌ర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. రూ. 60000 స్కాలర్‌షిప్‌తో పాటు.. ఉన్న‌త విద్య‌కు..

అలాగే ఏపీఆర్‌ఎస్‌ సాధారణ, మైనార్టీ పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశంతో పాటూ 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రాత పరీక్ష ఆధారంగా విద్యార్థులకు వచ్చిన మార్కుల్లో మెరిట్‌ను పరిగణలోకి తీసుకొని సీట్లను భర్తీ చేయనున్నారు.

Electoral Bond FAQs: ఎలక్టోరల్ బాండ్ పై పూర్తి వివరాలు ఇవే

#Tags